S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లోక్‌సభలో ఆధార్ బిల్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయడానికి ఉపయోగించడం కోసం ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన ఒక బిల్లును గురువారం ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం ఈ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలియజేశాయి. అధికార ఎన్డీఏకు మెజారిటీ లేని రాజ్యసభ ఆమోదం అవసరం లేని మనీ బిల్లుగా ఈ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాల నిరసనల మధ్యనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఆధార్ బిల్లు మనీ బిల్లు నిబంధనల పరిధిలోకే వస్తుందని ఆయన స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జువనైల్ జస్టిస్ బిల్లు, గాయపడిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించడానికి ఉద్దేశించిన బిల్లులాంటివాటిని మనీ బిల్లుగా ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ పార్టీకి గుర్తు చేశారు. ఈ బిల్లు ఆధార్ వివరాల గోప్యతకు సంబంధించిన భయాలను నివృత్తి చేస్తుందని, ఆధార్‌ను పౌరసత్వానికి సాక్ష్యంగా ఉపయోగించుకోవడానికి వీలులేకుండా ఉండే ఒక క్లాజును బిల్లులో చేర్చినట్లు జైట్లీ చెప్పారు. ఆధార్ నంబరు లేదా దాని ధ్రువీకరణ పౌరసత్వానికి ఏ విధంగాను అధికారం ఇచ్చినట్లు కానీ, లేదా రుజువు కానీ కాబోదని బిల్లులోని 9వ క్లాజ్ పేర్కొంటోంది. ఆధార్‌కు చట్టబద్దత కల్పించడం వల్ల ప్రభుత్వ సబ్సిడీలు అసలైన లబ్ధిదారులకు మరింత మెరుగ్గా చేరేలా చూడడానికి తోడ్పడుతుంది. కాగా, ఈ బిల్లు వల్ల ప్రభుత్వ సబ్సిడీలు అనర్హులు పొందకుండా చూడడంద్వారా 20 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేలా చేస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఇలాంటి బిల్లునే యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అయితే అధికార కూటమికి మెజారిటీ లేని రాజ్యసభకు బిల్లు వెళ్లకుండా చూడడం కోసం ప్రభుత్వం దీన్ని మనీ బిల్లుగా చేసిందని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే ప్రస్తుత బిల్లు గతంలో ప్రవేశపెట్టిన దానికి పూర్తి భిన్నమైందని జైట్లీ వాదించారు.

లోక్‌సభలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ