S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నైపుణ్యాభివృద్ధిరస్తు

నైపుణ్యం ఉంటేనే ఏ వృత్తిలోనైనా రాణించడం సుసాధ్యం. నాలుగు గోడల మధ్య విద్యనభ్యసించి, ఎలాంటి ‘ప్రాక్టికల్ నాలెడ్జి’ లేకుండా బయటకు వచ్చే యువతకు ఉపాధి అవకాశాలు తక్కువే. అయితే కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు అనేక కంపెనీలు ఎంపిక చేసిన యువతకు శిక్షణ ఇచ్చి వారితో పనిచేయించుకొనేవి. దీనివలన యాజమాన్యాలు ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2014 తరువాత ఈ పరిస్థితిలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని లేవనెత్తారు. స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేసి, ప్రతి వస్తువు స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు కావాలని సూచించారు. దీంతో మనం దిగుమతి చేసుకునే వస్తువుల్లో చాలా వరకూ స్వదేశంలోనే తయారు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయానికి యువత సహకారం అవసరమైంది.
మన దేశంలో 65 శాతం మంది 35 సంవత్సరాల్లోపు ఉన్న యువత ఉపాధి కోసం అల్లాడిపోతున్నారు. వీరిలో నిద్రాణమై ఉన్న నైపణ్యాభిలాషను బయటకు తీసుకువస్తున్నట్టు 2014 ఆగస్ట్ 15న ఎర్ర కోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. మన మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వివిధ శాఖలను మోదీ సమావేశపరిచారు. అన్ని శాఖల్లో నైపుణ్యతను పెంచుకోవాలని ఆదేశించారు. నైపుణ్యాభివద్ధికి ప్రధాని ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించిన పెట్రోల్, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2015లో అన్ని ఆయిల్ కంపెనీల వారిని సమావేశపరిచి, ఈ ‘మిషన్’ గురించి వివరించారు. దేశంలోని ఆరు ఆయిల్ కంపెనీలు స్పందించి, ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ కింద ఖర్చు చేసే నిధుల్లో కొంత భాగాన్ని నైపుణ్యాభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించాయి. దేశంలోని ఎనిమిది పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు ఈ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో బామన్ లారీ, భారత్ పెట్రోలియం, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా , హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ , ఆయిల్ ఇండియా , ఆయిల్ అండ్ నేచునరల్ గ్యాస్ కంపెనీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దేశంలోని ఆరు చోట్ల ‘మెగా స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ల’ను ఏర్పాటు చేసి, ఒక్కో దాని నుంచి 10 నుంచి 15 వేల మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా గ్రామీణ యువతను దీనిలోకి తీసుకురావాలన్నది ప్రధాన ఉద్దేశం. సరైన నైపుణ్యం ఉన్న వారిని సరైన మార్గంలో పెట్టాలన్నది దీని ఉద్దేశం
హైడ్రోకార్బన్ సెక్టార్ కోర్సుల్లో శిక్షణ
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఆయిల్ కంపెనీలు నిర్వహిస్తున్నందున హైడ్రోకార్బన్ సెక్టార్‌కు కావల్సిన వివిధ రకాల శిక్షణలపై దృష్టి కేంద్రీకరించారు. 2015లో హైడ్రోకార్బన్ స్కిల్ రెండేళ్లకిందటే ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ ఉంటుంది. వీరు నైపుణ్య అవసరాలను అధ్యయనం చేసి ఏయే రంగానికి ఎంతమంది నైపుణ్యాభివృద్ధి కలిగిన యువత కావాలని అంచనా వేస్తారు. ఇప్పటి వరకూ సుమారు 40 సెక్టార్లను గుర్తించారు. ఈ సెక్టార్లలో 11 కోర్సులను గుర్తించారు. ఎల్‌పీజీ పరంగా మూడు కోర్స్‌లను ప్రారంభించారు. ఆయిల్ ఎక్స్‌పలరేషన్‌లో రెండు, మూడు కోర్స్‌లు, ముఖ్యంగా ఈ రెండు విభాగాల్లో ఇప్పటి వరకూ స్కిల్డ్ వర్కర్స్ లేరు. అంతంతమాత్రంగా అవగాహన కలిగిన వారిని చేర్చుకునే పరిస్థితి ఉంది. అత్యంత ప్రమాదకరమైన ఈ రంగాల్లో సమస్య తలెత్తితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అసలు ఇందులో ప్రమాదాలకు ఎక్కడెక్కడ ఆస్కారం ఉంటుంది? తదితర అంశాలపై ఈ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ ఇస్తారు.
పదో తరగతి పాసైతే చాలు
నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో కేవలం 10వ తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారిని తీసుకుంటారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారికి వెంటనే ఉద్యోగం వస్తుంది కాబట్టి, వారు 18 ఏళ్లు నిండినవారై ఉండాలి. అటువంటి వారు మాత్రమే ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతను బట్టి కోర్సుల్లో చేర్చుకుంటారు. విశాఖ స్కిల్ డవల్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో మూడు నెలల నుంచి ఆరు నెలలు ఉంటుంది. సంవత్సరానికి 15 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కోర్స్‌లను ‘నేషనల్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్’ డిజైన్ చేసి పంపిస్తుంది. ఒక కోర్స్‌కు 30 మందిని మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడి అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ల సహకారాన్ని, వారి ద్వారా ట్రైనింగ్ పార్ట్నర్స్‌ను తీసుకుంటున్నారు. విశాఖలో 10 కోర్స్‌లకుగాను ఐదుగురు ట్రైనింగ్ పార్ట్నర్స్‌ను తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అభ్యర్థులను సెంటర్‌కు తీసుకురావడం, వారికి ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇప్పించడం, శిక్షణ తరువాత ఉపాధి అవకాశాలు చూపించే బాధ్యత ట్రైనింగ్ పార్ట్నర్స్‌దే. శిక్షణలో వెనకబడిన అభ్యర్థులకు అదనపు శిక్షణ ఇస్తారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. అది ఇంటర్వ్యూ సమయంలో పనికి వస్తుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్స్ పూర్తయ్యే ముందు దగ్గరలో ఉన్న పరిశ్రమకు తీసుకువెళ్లి అక్కడ జరుగుతున్న పనులను నేరుగా చూపిస్తారు.
ప్లంబింగ్ పదో తరగతి
వెల్డింగ్ పదో తరగతి
ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఎలక్ట్రికల్
ఫిట్టరవీ ఐటీఐ ఫిట్టర్
ప్రోసెస్ ఇన్‌స్ట్‌మ్రెంటేషన్ ఐటీఐ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్‌మ్రెంటేషన్
పైప్ ఫిట్టర్ ఐటీఐ, ఫిట్టర్, టర్నర్, డిప్ మెకానికల్
ఇనె్వంటరీ క్లర్క్ ఇంటర్మీడియట్
వేర్ హౌస్ పేకర్ పదో తరగతి
తుది పరీక్షలు..
సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ థర్డ్‌పార్టీగా ఉండి, ఇక్కడి శిక్షణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. శిక్షణార్థుల డేటాను ఎన్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి 800 నుంచి 1500 రూపాయలను వారికి స్కిల్ డవలప్‌మెంట్ ఇనిస్టిట్యూషన్స్ చెల్లిస్తుంది. స్కిల్, వైవా, ప్రాక్టికల్స్‌లో వారు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి నేషనల్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ సర్ట్ఫికెట్ జారీ చేస్తుంది.
ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం
సాధారణంగా ఐటీఐ, పాలిటెక్టిక్‌లో ల్యాబ్స్ అంతంతమత్రంగా ఉంటాయి. దీనివలన విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. కానీ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్లలో ప్రతి ఒక్క విద్యార్థి, స్వయంగా ప్రాక్టికల్ చేస్తాడు. ల్యాబ్‌లో ఎక్విప్‌మెంట్ ఏముండాలన్నది కూడా ఎన్‌ఎస్‌డీసీయే నిర్ణయిస్తుంది.
క్యాంపస్ సెలక్షన్స్
ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న తక్షణం అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాలన్న ఉద్దేశంతో ట్రైనింగ్ పార్ట్నర్స్ ఇప్పటికే 70 కంపెనీలను గుర్తించారు. కోర్సు రెండు వారాల్లో పూర్తవుతుందని తెలిసిన వెంటనే ఆయా కంపెనీలు నేరుగా నైపుణ్య కేంద్రాలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఆయా కంపెనీలకు కావల్సిన మానవ వనరులను తీసుకువెళతారు. 95 శాతం మందికి ఉపాధి లభిస్తుంది. టెన్త్ ఉత్తీర్ణులైన వారికి కనీసం ఎనిమిది వేల రూపాయల వరకూ జీతం వస్తోంది. అదే ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థికి 15 వేల రూపాయల వరకూ జీతం లభిస్తోం ది. ఇప్పటి వరకూ విశాఖ స్కిల్ డవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో గడచిన 18 నెలల్లో 1746 మంది శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళ్లడమేకాకుండా, 90 నుంచి 95 శాతం మందికి ఉద్యోగాలు కూడా లభించాయి.
సకల వసతులు
కల్పిస్తున్నాం
విశాఖ స్కిల్ డవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో 300 మంది శిక్షణ పొందుతున్నా రు. వీరిలో 10 శాతం మంది యువతులు ఉన్నారు. వీరందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయంతోపాటు, మూడు యూనిఫామ్స్, పుస్తకాలు మంజూరు చేస్తున్నాం. ఒక్కో విద్యార్థిపై నెలకు రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి రోజు క్యాంప్‌స్‌లో ఉదయం 5.30 నుంచి గంటపాటు యోగా ఉంటుంది. ఆ తరువాత విద్యార్థులు లైబ్రరీకి వెళతారు. అనంతరం ప్రార్థన ఉంటుంది. ఏరోజు వార్తలను ఆరోజు నోట్ చేసుకుని, ఈ కార్యక్రమంలో చదివి వినిపిస్తారు.
ఖైదీలకు శిక్షణ
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు విశాఖ స్కిల్ డవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ముందుకు వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల అభ్యర్థన మేరకు ‘ప్రధాన మంత్రి కౌశల్ యోజన’ కింద 2017 జూలై నుంచి వెల్డింగ్, ప్లంబింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు బ్యాచ్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. వాళ్లను చూసిన తరువాత విశాఖ సెంట్రల్ జైలు అధికారులు ముందుకు వచ్చి ఇక్కడి ఖైదీలకు శిక్షణ ఇమ్మన్నారు. జైల్లోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు.
..........................
జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ ఉంటుంది. వీరు దేశంలోని స్కిల్ రిక్వైర్‌మెంట్స్‌పై అధ్యయనం చేసి ఏయే రంగానికి ఎంతమంది నైపుణ్యాభివృద్ధి కలిగిన యువత కావాలని అంచనా వేస్తారు. ఇప్పటి వరకూ సుమారు 40 సెక్టార్‌ను గుర్తించారు. ఈ సెక్టార్‌లో 11 కోర్స్‌లను గుర్తించారు.
.............................
ఉపాధికి భరోసా..

కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం పెరిగింది. యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని పెంచి, వారికి ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళికతో కేంద్రం అనేక కార్యక్రమాలను రూపొందించింది. ఈ బాధ్యతను యూజీసీకి అప్పగించింది. 12వ ఆర్థిక సంఘం నిధులతో ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ కేంద్ర ఆఫ్ యూజీసీ’ని 2015లో ఏర్పాటు చేశారు. యూజీసీ ఆర్థిక సహకారంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నడపాలంటూ కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 780 కాలేజీలు, యూనివర్శిటీలు ఈ కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 42 కాలేజీలకు మాత్రమే వీటి ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక్క నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని విశాఖలోని బీవీకే కాలేజీకి అనుబంధంగా మంజూరు చేశారు.
2015 సెప్టెంబర్‌లో ఈ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ప్రస్తుతం రెడీమేడ్ గార్మెంట్స్, రిటైల్ మేనేజ్‌మెంట్- ఐటీ కోర్సులు నడస్తున్నాయి. ఇందులో 2015 డిసెంబర్‌లో శిక్షణ లాంఛనంగా ప్రారంభమైంది. రెడీమేడ్ గార్న్‌మెంట్స్‌లో డిప్లొమో కోర్స్ ప్రారంభించాం. రిటైల్ మేనేజ్‌మెంట్-ఐటీ రెండేళ్ల కోర్స్. ఇది అడ్వాన్స్‌డ్ డిప్లొమో కోర్స్. రెడీమేడ్ గార్న్‌మెంట్స్‌లో ఇప్పటి వరకూ రెండు బ్యాచ్‌లు శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లాయి. రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్స్ రెండేళ్ల నుంచి ఒక ఏడాదికి కుదించాం. ఈ కోర్స్‌ల బోధనకు కావల్సిన ఫ్యాకల్టీతోపాటు, ఇండస్ట్రియల్ పార్ట్నర్స్‌తో అనుసంధానం అవుతాం. ఇక్కడ శిక్షణ తీసుకునేవారి వెనుక మేం ఉన్నామన్న భరోసా కల్పించేందుకు పారిశ్రామిక యాజమాన్యాలతో కూడా కలిసి పనిచేస్తుంటాం. ఇండ్రస్టియల్ పార్ట్నర్స్ నేటి పారిశ్రామిక అవసరాలకు సంబంధం ఉండేలా, వారి అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడి శిక్షకులకు మెలకువలు నేర్పుతారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే అభ్యర్థులను వివిధ కంపెనీల్లో అనుభవం సంపాదించేందుకు పంపిస్తుంటాం. బాగా పనిచేసే వారికి ఆయా కంపెనీలే ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇక్కడ శిక్షణ పొందుతున్న సమయంలో కొంతమందికి ఉద్యోగాలు కూడా లభించాయి. అయితే, చాలా మంది వేరే చోట ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడకుండా, తమంతట తామే ఒక చిన్నతరహా పరిశ్రమను ప్రారంభించి పదిమందికీ ఉపాధి కల్పించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు.
ఈ శిక్షణలో థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందులో సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. సంవత్సరానికి రెండు సెమిస్టర్లు. రెడీమేడ్ గార్న్‌మెంట్‌కు రెండు, రిటైల్‌మేనేజ్‌మేంట్‌కు నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. యూజీసీ గ్రేడ్ పాయింట్ సిస్టమ్స్‌లోనే సర్ట్ఫికెట్‌లు జారీ చేస్తుంటాం. పరీక్షా పత్రాలను ఇతర సంస్థలు తయారు చేస్తాయి. జవాబు పత్రాల మూల్యాంకన కూడా బయటవారే చేస్తారు.
యూజీసీ అడ్వైజరీ కమిటీ నామినీ ఒకరు ఉంటారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఇద్దరు ఉంటారు. ఏయూ నుంచి ఇద్దరు, ముగ్గురు సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్ట్స్‌ను నియమిస్తారు. ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఈ సెంటర్‌కు అడ్వైజరీ కమిటీ చైర్మన్. అడ్వైజరీ కమిటీలో పేరుపొందిన యూనివర్శిటీల సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్స్ ఉంటారు. సెంట్రల్ యూనివర్శిటీ, బరోడా యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఈ సెంటర్‌కు వస్తారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యూజీసీ, ఆంధ్రా యూనివర్శిటీ, బీవీకే కాలేజీ లోగోలతో కలిపి సర్ట్ఫికెట్ మంజూరు చేస్తాం. ఈ సర్ట్ఫికెట్‌కి బయట చాలా విలువ ఉంటుంది కాబట్టి, కంపెనీల్లో వీరికి ఉపాధి లభిస్తుంది.
-రమాప్రసాద్ ఆదిభట్ల
డైరెక్టర్, డీడీయూ కౌశల్ కేంద్రం
..............................
విశాఖ స్కిల్ డవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో 300 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో 10 శాతం మంది యువతులు ఉన్నారు. వీరందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయంతోపాటు, మూడు యూనిఫారమ్స్, పుస్తకాలు మంజూరు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి కోసం నెలకు రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
................................
మెగా క్యాంపస్‌కు రంగం సిద్ధం
విశాఖలో మెగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సబ్బవరం వద్ద ఏర్పాటు చేయనున్న పెట్రోలియం యూనివర్శిటీని ఆనుకుని 100 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కెపీఎంజీ సంస్థ ద్వారా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధం చేస్తున్నాం. ఇందులో 74 కోర్స్‌ల్లో శిక్షణ ఇవ్వనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, ఆడిటోరియం నిర్మించేందుకు సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆరు నెలల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
-సీ.వీ.ఎన్.దాస్
చీఫ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), విశాఖ స్కిల్ డవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్
..................................................
దేశంలోని యువతకు అందుబాటులో ఉండేవిధంగా ఆరు ప్రాంతాల్లో ఈ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఆరు కేంద్రాలను ఆరు ఆయిల్ కంపెనీలు నడిపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏదైతే ప్రధాన ఆయిల్ కంపెనీ ఉంటుందో వారికి ఈ బాధ్యత అప్పగించారు.
1.్భవనేశ్వర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
2.విశాఖపట్నం హెచ్‌పీసీఎల్
3.కొచ్చిన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్
4.అహ్మదాబాద్ ఓఎన్‌జీసీ
5.రాయ్‌బరేలి గెయిల్
6.గౌహతి ఆయిల్ ఇండియా లిమిటెడ్
లీడ్ మేనేజర్‌గా ఉన్న కంపెనీ సదరు స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ నిర్వహణకు కావల్సిన ఖర్చులో 30 శాతం భరించాల్సి వస్తుంది. మిగిలిన 70 శాతం మొత్తాన్ని మిగిలిన ఏడు కంపెనీలు భరిస్తాయి. ఈ ఆరు ప్రాంతల్లో అంతర్జాతీయ స్థాయిలో మెగా క్యాంపస్‌లు మొదలుపెట్టనున్నారు. అంత వరకూ తాత్కాలిక క్యాంపస్‌లలో వీటిని నిర్వహిస్తున్నారు.

-కె.వి.జి.శ్రీనివాస్