S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమయస్ఫూర్తి

ప్రతాప్ ఏదైనా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడాలని అనుకుంటాడు. తల్లిదండ్రులకి భారంగా ఉండటం అతడికి ఏ మాత్రం ఇష్టంలేదు. దాంతో పక్క ఊరికి వెళ్లి పనిచేసి.. వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం పెట్టాలని బయల్దేరతాడు. ఆ ఊళ్లో పని చూసుకొని తిరిగి ఇంటి ముఖం పట్టేప్పటికి చీకటి పడింది. తమ గ్రామం చేరాలంటే అడవి మార్గం మినహా మరో దారి లేదు. ప్రతాప్ అడవి దారి వెంట భయంభయంగా వెళ్తున్నాడు. ఆ అడవిలో చింతచెట్టు మీద రెండు భూతాలు నివాసముంటూ వచ్చేపోయే వారిని తెగ వేధిస్తూంటాయని గ్రామస్థులు చెప్పగా విన్నాడు. అందుకే చీకటి పడిందంటే ఆ అడవి మీదుగా రావటానికి ఎవరూ సాహసించరు. కానీ ప్రతాప్‌కి తప్పలేదు. చకచకా నడుస్తున్నాడు. ఇంతలో చింతచెట్టు భూతాలు ఎదురు పడనే పడ్డాయి. భూతాల్ని చూట్టంతోనే ప్రతాప్ పైప్రాణాలు పైనే పోయాయి. అయినా ధైర్యం తెచ్చుకొన్నాడు. తమని చూసి ఏ మాత్రం భయపడని ప్రతాప్‌ని ఉరిమిచూస్తూ ‘ఎవర్నువ్వని?’ ప్రశ్నించాయి. ప్రతాప్ బుర్రలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. జేబులోంచి ఓ సీసాని బయటికి తీసి ‘నా గురించి మీకు తెలియదా? నా పేరు ప్రతాప్. భూతాల్ని సీసాలో బంధించే విద్యలో నన్ను మించిన మొనగాడు ఈ చుట్టుపక్కల మరొకడు లేడు. ఇప్పుడు మిమ్మల్ని మంత్రం వేసి ఈ సీసాలో బంధించ బోతున్నాను.’ అన్నాడు.
దాంతో భూతాలు గజగజ వణికిపోయాయి. వెంటనే అవి అతణ్ణి ప్రాధేయపడ్డాయి. ‘మమ్మల్ని సీసాలో బంధించకుండా వదిలేస్తే మేం చెరొక వరాన్ని ఇస్తాం’ అని వేడుకొన్నాయి. తన పథకం పారినందుకు ప్రతాప్ లోలోన సంతోషించాడు. ‘వెయ్యి వరహాలుగాని ఉంటే తను ఈ క్షణంలో ఏదైనా మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు’ అని మనసులో అనుకొని మొదటి భూతాన్ని వెయ్యి వరహాలు కావాలని కోరాడు. వెంటనే ఆ భూతం అతడు కోరినట్టే వెయ్యి వరహాలున్న మూటని అందించింది. ఆనందభరితుడైన ప్రతాప్ ఆ వరహాల మూటని జేబులో భద్రపరచుకొన్నాడు.
‘ఏం వరం కావాలో కోరుకో’ అంది రెండో భూతం. ప్రతాప్ ఆలోచనలో పడ్డాడు. ‘ఈ వెయ్యి వరహాలని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి హాయిగా జీవించవచ్చు. కాబట్టి తనకి మరొక వరం అవసరం లేదు. రెండో వరాన్ని తోటి వారికోసం వినియోగించాలి. ఈ దారిన పోయే బాటసారులు ఈ భూతాల బారిన పడి ఎన్నో బాధ పడుతున్నారు. కాబట్టి ‘మీరు ఈ క్షణమే ఈ చెట్టుని ఖాళీ చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపొండి. ఇదే నేన కోరే రెండో వరం’ అన్నాడు.
అతడి మాటలు విన్న ఆ రెండు భూతాలు గత్యంతరం లేక లోలోపల బాధపడుతూ ఆ చింతచెట్టుని శాశ్వతంగా విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయాయి. ఆ విధంగా ప్రతాప్ కోరిన రెండవ వరం వల్ల బాటసారులకు భూతాల పీడ విరగడైంది.
సమయస్ఫూర్తితో వ్యవహరించి భూతాల్ని అక్కడ నుండి తరిమెయ్యడమే కాకుండా వ్యాపారం చేసుకోడానికి అవసరమైన వెయ్యి వరహాలను కూడా సంపాదించుకున్న ప్రతాప్ ఆనందంగా ఇంటిదారి పట్టాడు.
==============

సంగీత వాయిద్యాలు

సంతూర్
సంతూర్ పర్షియా నుండి వచ్చిన వాయిద్యం. ఇందులో 70 తీగలుంటాయి. రెండు సెట్ల బ్రిడ్జీలుంటాయి. పర్షియన్ సంతూర్‌లో 72 తీగలుంటాయి. భారతీయ సంతూర్ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. సంతూర్‌ని ఒడిలో పెట్టుకుని రెండు చేతుల్ని ఉపయోగించి తీగల మీద మారెట్‌తో సుతారంగా మీటుతూ వాయిస్తారు. వ్రేళ్లతో వాయించే హార్స్ లేదా పియానో సంగీతం వింటున్నట్టే ఉంటుందీ సంగీతం.
సారంగి
హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో ముఖ్యమైంది తీగల మీద వాయించే సారంగి వాయిద్యం. ఇది ఉత్తరభారతంలోనూ, పాకిస్తాన్‌లోనూ కనిపిస్తుంది. అన్ని భారతీయ వాయిద్యాల్లోకి గాత్రానికి సరిగ్గా సరిపోయే వాయిద్యం సారంగి. ఒకే చెక్కతో ఒంపుగా తయారుచేసే సారంగి బాక్స్ ఆకారంలో ఉంటుంది.
ఘటం
ఘటం అంటే కుండ. ఇది కర్ణాటక శాస్ర్తియ సంగీతంలో వాడే వాయిద్యం. కుండ పైభాగాన చేతులతో, చేతివేళ్లతో తడుతూ ఘట కళాకారుడు వాయిస్తాడు. కుండపైన వివిధ ప్రదేశాల్లో తట్టడం ద్వారా వివిధ శబ్దాలను పలికించవచ్చు. ఘటాన్ని సామాన్యంగా మృదంగానికి పక్క వాయిద్యంగా వాయిస్తారు. ఘటం చూడటానికి ఇళ్లల్లో వాడే కుండలాగానే ఉంటుంది కానీ వాయిద్యం కోసమై ప్రత్యేకంగా తయారుచేస్తారు.

========

శుభ్రం చేయాలి

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

‘అమ్మా! మనం మాల్‌కి వెళ్దామా? పండుగ కాబట్టి పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నారట’ ధనిక తల్లిని అడిగింది.
‘అలాగే. ముందు ఏం కావాలో చూసుకోవాలి. ఫ్రిజ్‌ని శుభ్రం చేసి అందులో అయిపోయినవి జాబితా రాయి’ తల్లి సూచించింది.
ధనిక తల్లి చెప్పినట్టు ఫ్రిజ్ తెరిచి అందులోనివి బయటపెట్టసాగింది.
‘్ధనికా! నువ్వు నీ ఫ్రెండ్ దియాని కూడా మనతో రమ్మని పిలవచ్చుగా?’ తల్లి సూచించింది.
‘పిలవను’ చెప్పి ధనిక బూజు పట్టిన వంకాయలని చెత్తబుట్టలో పడేసింది.
‘ఎందుకని?’ తల్లి ఆశ్చర్యంగా అడిగింది.
‘ఇవాళ బహుశా జూలీ ఇంట్లో ఉండి ఉంటుంది. దియా ఇప్పుడు జూలీ ఫ్రెండ్’ ధనిక నిరసనగా చెప్పింది.
‘దియాకి ఒకరి కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండకూడదా? జూలీని కూడా పిలు’
‘పిలవను. జూలీ అంటే నాకు ఇష్టం లేదని దియాకి తెలుసు. కొన్ని నెలల క్రితం జూలీ నా గురించి చెడ్డగా మాట్లాడింది..’ ఏమిటీ చెడు వాసన?’ ధనిక మొహం అసహ్యంగా పెట్టి అడిగింది.
‘ఏదో పాడైన దాని మీది మూతని తీసి ఉంటావు’
‘అవును. ఇది ఎప్పుడో చేసిన ఆమ్లెట్’
‘వెంటనే పారెయ్’ తల్లి సూచించింది.
ఫ్రిజ్‌ని తుడిచి శుభ్రం చేశాక తల్లి వంట గదిలో ఏర్ ఫ్రెష్‌నర్‌ని చల్లింది.
‘మనం ఫ్రిజ్‌ని తరచూ క్లీన్ చేస్తూండాలి. లేదా చెడు వాసన వేస్తుంది’ ధనిక చెప్పింది.
‘అవును. కొన్ని ప్రవర్తనలు కూడా’
‘అంటే?’
‘పాత పోట్లాటలు చెడు వాసన వేస్తాయి. దాదాపు ఏడాదిగా నువ్వు జూలీ మీద కోపాన్ని శుభ్రం చేయకుండా ఉంచుకున్నావు’
‘కానీ అమ్మా! జూలీ ఏమందంటే..’
‘నాకు తెలుసు. నువ్వు చెప్పావు. జూలీ గురించి చాలా చెడ్డ మాటలు కూడా చెప్పావు’
ధనిక ఓ గుటక వేసింది. అది తన తల్లికి గుర్తుందని అనుకోలేదు.
‘నీ పోట్లాటని బయట పారేసే సమయం రాలేదా?’ తల్లి మృదువుగా అడిగింది.
దనిక గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, చేతులు కడుక్కుని, తుడుచుకుని సెల్ ఫోన్ తీసుకుంది.
‘జూలీ! మా అమ్మతో మాల్‌కి వెళ్తున్నాను. దియాని కూడా అడుగుతాను. నువ్వూ వస్తావా?’
ఆమె మాటలు విన్న తల్లి తృప్తిగా నవ్వింది.
డోంట్ హోల్డ్ గ్రడ్జెస్

-కోనే విజయ్‌కుమార్