S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అద్భుత సృష్టి..ఆనందవృష్టి

కవికోకిల విరచితమే
ఆరుకాండల రసాయనమే
క్రౌంచపక్షుల విరహము
భార్యాభర్తల సంబంధము
పౌలస్త్య వధ - సీతాదేవి చరిత
శ్రీమద్రామాయణ కావ్యంగ లోకానికి ఎరుక.

ఆధ్యాత్మికాంశాలు, ఆనందకాసారాలు
జీవన సారాలు, జవసత్త్వ సౌరభాలు
అనునిత్యం ఎదురయ్యే సంఘటనలు, అల్లికల మాలికలు
జాతీయ నుడికారాలు, అంతర్జాతీయ సూనృతాలు
అవిభక్త బంధాలు, భక్తజన పాలితాలు
సంజీవ ఔషధం.. సజీవ తార్కాణాలు
శ్రీమద్రామాయణం
జ్ఞాన భాండాగారాలు, విజ్ఞాన పారిజాతాలు
అనర్ఘ రత్నాలు, అద్భుత మజిలీలు
తెలుసుకొన్న వారికె తెలుసుకొన్నంత
సమాజ శ్రేయస్సు, ఆర్థిక ప్రోతస్సు
వ్యక్తిత్వ వికాసం, సమిష్టి వినోదము
కుటుంబ సంబంధం, కులసతుల విలాసం
సత్య, ధర్మ, అహింస ప్రబోధితాలు,
పరదారాగ్రహణకు వాలి మరణమే
పెడచెవిన బెట్టే పిదపకాల బుద్ధులు
తెలిసి తెలిసి చేసిన సర్వనాశనములని తెలుపు కథ
రావణ కథాసంగ్రహమే - రామాయణం
కాలాలు మారినా
మారని మూలస్తంభాలు
అరిషడ్వర్గాలు, చతుర్విధ పురుషార్థములు
దేశాలు మారినా
మారని పాలనా ఆదర్శాలు
ప్రాంతాలు మారినా
మారని వ్యక్తిత్వ వికాసాలు
రోజులే మారినా
మారని మహోన్నత గుణపాఠాలు
కవులు, గాయకులు, రచయితలు మారినా
వ్రాసేది వాల్మీకి హృదయమే
ఆరిపోనిది, అంతమే లేనిది
ఆనందసృష్టి.. రామాయణ రసవృష్టి...
శ్రీసీతారాముల వైవాహిక పరిపుష్టి
జగతికి సంతోష దృష్టి.

-లక్కరాజు శ్రీనివాసరావు 9849 166 951