S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సెంచరీలు.. హ్యాట్రిక్‌లు..

చివరి వరకూ అందరినీ మునివేళ్ల మీద నిల్చోబెట్టిన ఫైనల్ పోరాటంతో అందరినీ ఆకట్టుకున్న పదో ఐపీఎల్‌పై చాలా మంది ఆటగాళ్లు తమదైన ముద్ర వేశారు. కొందరు సెంచరీలతో రాణిస్తే, మరికొందరు హ్యాట్రిక్‌ల మోత మోగించారు. మొత్తం మీద పదో ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు, మూడు హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ పుణేలో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (62 బంతుల్లో 102) చేశాడు. పదో ఐపీఎల్‌లో అదే మొదటి శతకం. ఇండోర్‌లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా శతకం (60 బంతుల్లో 104 నాటౌట్) సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 126), గుజరాత్ లయన్స్‌పై పుణే మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (63 బంతుల్లో 103 నాటౌట్) శతకాలు చేశారు. ముంబయిపై సెంచరీ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు హషీం ఆమ్లా మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై సెంచరీ చేశాడు. అయితే- సంజూ శాంసన్, డేవిడ్ వార్నర్, బెన్ స్టోక్స్ శతకాలు సాధించిన మ్యాచ్‌ల్లో ఆయా జట్లు విజయాలను నమోదు చేయగా, హషీం ఆమ్లా సెంచరీలు చేసిన రెండు మ్యాచ్‌ల్లోనూ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరాజయాలను ఎదుర్కొంది. మొత్తం మీద 2008 నుంచి 2017 వరకూ మొత్తం పది ఐపీఎల్ టోర్నీల్లో 47 సెంచరీలు నమోదయ్యాయి. క్రిస్ గేల్ అత్యధికంగా 5 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ నాలుగుసార్లు శతకాలు సాధించాడు. డేవిడ్ వార్నర్, ఎబి డివిలియర్స్ చెరి మూడుసార్లు, బ్రెండన్ మెక్‌కలమ్, వీరేందర్ సెవాగ్, డేవిడ్ వార్నర్, మురళీ విజయ్, ఆడం గిల్‌క్రిస్ట్, హషీం ఆమ్లా తలా రెండేసి సెంచరీలు తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.
పదో ఐపీఎల్‌లో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు సాధించిన బౌలర్లు చాలా మందే ఉన్నారు. కానీ, మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి, హ్యాట్రిక్‌ను నమోదు చేసిన ఘనత ముగ్గురికి మాత్రమే దక్కింది. ముంబయి ఇండియన్స్‌పై శామూల్ బద్రీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్), సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జయదేవ్ ఉనాద్కత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్) హ్యాట్రిక్స్ సాధించారు.
హ్యాట్రిక్ వీరులు వీరే..
ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ 17 పర్యాయాలు హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. 2008లో లక్ష్మీపతి బాలాజీ (చెన్నై సూపర్ కింగ్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), అమిత్ మిశ్రా (్ఢల్లీ డేర్‌డెవిల్స్/ డక్కన్ చార్జర్స్‌పై), మఖయా ఎన్తినీ (చెన్నై సూపర్ కింగ్స్/ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), 2009లో యువరాజ్ సింగ్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై), రోహిత్ శర్మ (డక్కన్ చార్జర్స్/ ముంబయి ఇండియన్స్‌పై), యువరాజ్ సింగ్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ డక్కన్ చార్జర్స్‌పై), 2010లో ప్రవీణ్ కుమార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ రాజస్థాన్ రాయల్స్‌పై), 2011లో అమిత్ మిశ్రా (డక్కన్ చార్జర్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), 2012లో అజిత్ చండీలా (రాజస్థాన్ రాయల్స్/ పుణే వారియర్స్‌పై), 2013లో సునీల్ నారైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్/ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), అమిత్ మిశ్రా (సన్‌రైజర్స్ హైదరాబాద్/ పుణే వారియర్స్‌పై), 2014లో ప్రవీణ్ తంబే (రాజస్థాన్ రాయల్స్/ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్/ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై), 2016లో అక్షర్ పటేల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ గుజరాత్ లయన్స్‌పై) హ్యాట్రిక్స్ నమోదు చేశారు. కాగా, గత ఏడాది ఏకంగా ముగ్గురు బౌలర్లు హ్యాట్రిక్స్‌తో అదరగొట్టారు. ముంబయి ఇండియన్స్‌పై శామ్యూల్స్ బద్రీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై గుజరాత్ లయన్స్ బౌలర్ ఆండ్రూ టై, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జయదేవ్ ఉనాద్కత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్) హ్యాట్రిక్స్‌తో కదం తొక్కారు.
*

- కాటపల్లి అశోక్ కుమార్