S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టోక్స్‌కు 12.5 కోట్లు!

ఈసారి ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అత్యధికంగా 12.5 కోట్ల రూపాయల ధర పలికింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడి చేశాడన్న అభియోగంపై విచారణను ఎదుర్కొంటున్న అతనిని ఈ భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతనిని దక్కించుకోవడానికి చివరి వరకూ పోటీపడ్డాయి. అయితే, 12.5 కోట్ల రూపాయలను చెల్లించడానికి వెనుకంజ వేయగా, ఆ అవకాశాన్ని రాజస్థాన్ తనకు అనుకూలంగా మార్చుకుంది. స్టోక్స్ కనీస ధర రెండు కోట్ల రూపాయలు కాగా, అతనికి ఎవరూ ఊహించనంత భారీ రేటు దక్కింది. కాగా, భారత ఆటగాళ్లలో లోకేష్ రాహుల్, మనీష్ పాండే చెరి పదకొండు కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
రెండు కోట్ల బేస్ ప్రైస్ ఉన్న కేదార్ జాధవ్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.60 కోట్ల రూపాయలను చెల్లించి కొనుక్కుంది. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన కరుణ్ నాయర్ కోసం అదే ఫ్రాంచైజీ 5.60 కోట్ల రూపాయలు వెచ్చించింది.
భారత అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షాను ఢిల్లీ డేర్ డెవిల్స్ 1.2 కోట్లు, అదే జట్టులోని శుభం గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లు, కుల్వంత్ ఖెజ్రోలియాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 85 లక్షల రూపాయలు వెచ్చించి కొన్నాయి. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ సాధిస్తున్న వరుస విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఫాస్ట్ బౌలర్ కమలేష్ నగర్‌కోటిని కోల్‌కతా నైట్ రైడర్స్ 3.2 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవడం విశేషం.

- డి. రవికుమార్