S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాల్మీకి మరో పేరేమిటి?(క్విజ్ )

1.‘వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా’ వాల్మీకి మరో పేరేమిటి?
ఎ.కోశలడు బి.ఋష్యశృంగుడు
సి.ప్రాచేతనుడు డి.వేదాంతుడు

2.అయోధ్యకున్న మరో పేరేమిటి?
ఎ.కోసల బి.సాకేత
సి.రాణిఖేత్ డి.విదిశ

3.అయోధ్య ఇప్పుడు ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?
ఎ.్ఫరోజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
బి.ఫైజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
సి.్ఫరుక్వాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
డి.రాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్

4.సీతాదేవి గడిపిన అశోకవనం ఉన్న దేశాన్ని మునుపు ఏమని పిలిచేవారు?
ఎ.సియామ్ బి.జాఫ్నా
సి.సిలోన్ డి.రత్నపురం

5.జనకుడు పాలించిన రాజ్యం పేరేమిటి?
ఎ.విదేహా బి.మిథిల
సి.త్రిరభుకి డి.పైవన్నియు

6.జనకుడు పాలించిన రాజ్యం ఇపుడు ఏ ప్రాంతంలో ఉంది?
ఎ.బీహార్
బి.ఝార్ఖండ్ మరియు బీహార్
సి.బీహార్, ఝార్ఖండ్ మరియు నేపాల్
డి.ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ మరియు బీహార్

7.సుగ్రీవుడు పాలించిన కిష్కింధ ఇప్పుడు ఏ ప్రదేశంలోకి వస్తుంది?
ఎ.కర్ణాటక మరియు కేరళ బి.తమిళనాడు
సి.కేరళ డి.కర్ణాటక

8.సంజీవని మూలికలు కోసం హనుమంతుడు వెళ్లిన పర్వత శిఖరం పేరు?
ఎ.నీలకంఠ బి.నందాదేవి
సి.పంచచులి డి.దునగిరి

9.హనుమంతుడు సంజీవని కోసం వెళ్లిన పర్వత శిఖరం, కొండ పెకిలించిన ద్రోణగిరి గ్రామం ఇప్పుడే ప్రదేశంలో ఉంది?
ఎ.ఉత్తరాంచల్ మరియు నేపాల్
బి.ఉత్తరాంచల్
సి.ఉత్తరాంచల్ మరియు చైనా
డి.ఉత్తరాంచల్ మరయు టిబెట్

10.రామసేతువుని శ్రీలంకలో ఏ పేరుతో పిలుస్తారు?
ఎ.ఆడమ్స్ బ్రిడ్జ్ బి.రావణ సేతువు
సి.లక్షణ ఝుల డి.ఈప్స్ లింక్

*
గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.బి సి.ఎ 4.సి 5.డి 6.బి 7.డి 8. 9.ఎ 10.ఎ

-సునీల్ ధవళ 97417 47700