ఎంపిక
Published Sunday, 8 April 2018మనల్ని ఎవరూ బలవంతపెట్టలేరు.
ఎవరైనా మనలని కొంత ప్రభావితం చేయగలరు. కొంత సహాయం చేయగలరు. అంతే కానీ ఎవరూ మనల్ని బలవంతపెట్టలేరు.
ఎవరూ మనలని ఈ విధంగా బలవంతపెట్టలేరు.
- ప్రేమించమని లేదా ద్వేషించమని.
- విశ్వసించమని లేదా విశ్వసించకూడదని
- నేర్చుకొమ్మని లేదా నేర్చుకోవద్దని
- ఆశావాహ దృక్పథంతో వుండమని లేదా నిరాశామయంగా ఉండమని
ఇదంతా మనకి మనం చేసుకునే ఎంపిక.
ప్రతి పనికి, ప్రతి చర్యకి ఒక పరిణామం ఉంటుంది.
మనం జీవితంలో ఎక్కడ ఉన్నామో అన్న దానికి ప్రధాన కారకులం మనమే.
వేరెవరూ కాదు.
అందుకని ఎవరినీ నిందించకూడదు.
నిందించి ఫలితం లేదు.
వాళ్లని దూరం చేసుకోవడం మినహా మరేమీ ఉపయోగం ఉండదు.
కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు.
అంతే!
మనం ఎంపిక చేసుకోవడంలోనే తెలివిగా వ్యవహరించాలి.
ఈ విషయం చెప్పడంలో నేను మీకు సహకరిస్తున్నాను.
అంతేకానీ-
ఇందుకు మిమ్మల్ని నేను బలవంతపెట్టలేను.