S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచుకొండల్లో మహాయాత్ర (ఆధ్యాత్మికం)

తీర్థయాత్రలు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంచడమే కాదు, మనలో నవ చైతన్యాన్ని ఆవిష్కరిస్తాయి. వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలను పరిశీలించడానికి, ఏకత్వంలో భిన్నత్వాన్ని అవగాహన చేసుకునేందుకు యాత్రలు దోహదం చేస్తాయి. భక్త్భివంతో తీర్థయాత్రలు చేసేవారు ప్రకృతిలో అణువణువునా భగవత్ స్వరూపాన్ని దర్శిస్తారు. అర్థవంతమైన ప్రయాణం ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుందని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు.
వేదభూమిగా వాసికెక్కిన మన దేశంలో హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్రల్లో అత్యంత ప్రధానమైనది ‘చార్‌ధామ్’ యాత్ర. ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మికతకు ఆలవాలమైన హిమాలయ పర్వత పంక్తులపై సాగే సాహసోపేతమైన మహాయాత్ర ఇది. ఏటా మండువేసవిలో మొదలై శీతాకాలం ఆరంభం నాటికి ఈ యాత్ర ముగుస్తుంది. మంచు కురిసే అతి శీతల వాతావరణంలో, ఇరుకైన దారుల్లో, పర్వత సానువుల్లో సాగే ‘చార్‌ధామ్’ యాత్రలో భక్తులు పాల్గొనడం ఒక సాహసమే.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనాన్ని ‘చార్‌ధామ్’గా వ్యవహరిస్తున్నారు. దాదాపు పనె్నండు వేల అడుగుల ఎత్తులో ప్రమాదకరమైన పర్వత సానువుల్లో సుమారు పది రోజుల పాటు పనె్నండు వందల కిలోమీటర్ల దూరాన్ని చుట్టుముడితే ఈ యాత్ర పూర్తవుతుంది. ‘ముక్తియాత్ర’గా అభివర్ణించే ‘చార్‌ధామ్’ యాత్రకు- ‘అక్షయ తృతీయ’ నుంచి దీపావళి మరుసటి రోజున వచ్చే ‘యమ తృతీయ’ వరకూ భక్తులను అనుమతిస్తారు. గంగోత్రిలో, యమునోత్రిలో ఈ నెల 18న, కేదారినాథ్‌లో 29న, బదరీనాథ్‌లో 30న ‘చార్‌ధామ్’ యాత్ర భక్తజనం కోలాహలం మధ్య ప్రారంభమవుతుంది. తొలి దర్శనం సమయంలోను, యాత్ర ముగిసే వేళ జరిగే యజ్ఞాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. భక్తులు యమునోత్రిలో యాత్ర ప్రారంభించి గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌ల సందర్శనతో ముగిస్తారు. యమునోత్రికి చేరుకున్నాక అక్కడి ‘సూర్యకుండం’లో స్నానమాచరించాక యమునాదేవి ఆలయాన్ని భక్తులు సందర్శిస్తారు. ఆ తర్వాత గంగోత్రికి చేరుకుంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకుని భగీరథుడు గంగను భువికి రప్పించిన పుణ్యస్థలమే ‘గంగోత్రి’ అని భక్తుల విశ్వాసం. ఇక్కడి గంగాదేవి ఆలయాన్ని సందర్శించాక, సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరం నడిస్తే గంగ ఉద్భవించిన ‘గోముఖ్’ వస్తుంది. గోవు ముఖం ఆకారంలో ఉన్న పర్వత పంక్తుల నుంచి గంగా ప్రవాహం ప్రారంభమవుతుంది. ఆరోగ్య సమస్యలు లేనివారు, పర్వతారోహణ చేయగలిగిన వారు మాత్రమే ‘గోముఖ్’ చేరుకుంటారు. గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ చేరుకుంటారు. ప్రమాదకరమైన దారుల్లో కాలినడకన, గుర్రాలపై, డోలీల్లో యాత్రికులు ఇక్కడికి వస్తారు. కేదార్‌నాథ్ నుంచి బదరీనాథ్ చేరుకోవడంతో ‘చార్‌ధామ్’ యాత్ర పరిసమాప్తం అవుతుంది. ఎలాంటి అవస్థలు లేకుండా 45 కిలోమీటర్ల మేరకు జోషిమఠ్ నుంచి వాహనాల్లో ప్రయాణించి బదరీనాథ్ చేరుకోవచ్చు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు తమ వెంట అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. ఖర్చుకు వెనకాడని వారైతే డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్‌లో ప్రయాణించి నాలుగు పుణ్యక్షేత్రాలనూ సందర్శించవచ్చు.
హరిద్వార్ నుంచి 236 కిలోమీటర్లు ప్రయాణించి యమునోత్రి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ఉత్తర కాశీ మీదుగా 220 కిలోమీటర్లు ప్రయాణిస్తే గంగోత్రికి వెళ్లొచ్చు. ఉత్తరకాశి, రుద్రప్రయాగ మీదుగా 254 కిలోమీటర్లు ప్రయాణించి కేదార్‌నాథ్‌కు చేరవచ్చు. ఇక్కడి నుంచి రుద్రప్రయాగ మీదుగా 160 కిలోమీటర్లు వాహనంలో ప్రయాణించి బదరీనాథ్‌కు చేరుకోవచ్చు. యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలను ‘యమద్వితీయ’ నాటి నుంచి మూసివేస్తారు. గంగోత్రి ఆలయాన్ని దీపావళి నుంచి, బదరీనాథ్ గుడిని విజయ దశమి నుంచి మూసివేస్తారు.

చిత్రాలు..బదరీనాథ్‌, *కేదార్‌నాథ్, * గంగోత్రి