S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరైన సమయం

ఒక సందర్భంలో గొప్ప పర్షియన్ కవి రాసిన గీతాన్ని స్వరపరిచాను. దాన్ని ఆలపించాను. ఎంతో పరవశంతో గానం చేశాను. ఆ గీతానికి అద్భుతమయిన అర్థముంది. అదే సమయంలో ఆ గీతంలో అపూర్వమయిన అర్థం దాగి ఉందని అది నా అవగాహనకు మించిందని అప్పుడు భావించాను.
పదిహేనేళ్లు గడిచాయి. ఆ గీతానికి సంబంధించిన సరైన పోలిక కోసం, దాని అంతరార్థ అవగాహన కోసం అజ్ఞాతంగా నా మనసు తపిస్తూనే ఉంది. ఆ సందర్భం వచ్చింది. నా మనసుకు అందని అజ్ఞాత సందేశం గుండా దాని అవగాహన ఏర్పడింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. పదిహేనేళ్లు వేసిన తాళం ఒక్కసారిగా వూడిపోయింది. ద్వారం తెరుచుకుంది.
ప్రతిదానికీ ఒక సమయం, సందర్భం ఉంటుంది. దానికి కాల నియమం లేదు. అది దాని సమయం వచ్చినపుడే బహిరంగ మవుతుంది. అందుకనే ఒకవేపు ఆ ఆవిష్కారం కోసం మన మనసు ఆరాటపడుతుంది. మరొక వేపు దాని కోసం సహనంగా ఎదురుచూడాలని మన అంతరాత్మ అంటుంది.

- సౌభాగ్య, 9848157909