S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదృష్టం

అమావాస్య, అష్టమి లాంటి రోజుల్లో ఏదైనా పని చేయడానికి చాలామంది ఇష్టపడరు. అలాగే మంగళవారం కొంతమంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు.
ఈ అభిప్రాయాలు కొన్ని రాష్ట్రాలలో వున్న ప్రజలకి మాత్రమే పరిమితం. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు. ఇట్లాగే తేదీల మీద కూడా చాలామందికి ఇవే అభిప్రాయాలు. ఇవి విశ్వాసాలు, నమ్మకాలు. వీటిల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు. కానీ వయస్సు వచ్చినా కొద్దీ చాలామందిలో ఈ అభిప్రాయాలు బలపడటానికి అవకాశం ఉంది.
నేను మేజిస్ట్రేట్‌గా మే 1వ తేదీ 1989లో చేరాను. నేనే కాదు. మా బ్యాచ్‌మేట్స్ అందరూ అదే రోజు ఉద్యోగాల్లో చేరారు. దానికి కారణం - హైకోర్టు మాకు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆ తేదీన అందరినీ జాయిన్ కమ్మని ఆదేశించారు. అందుకని తేదీని, రోజుని టైంని చూసే అవకాశం లేదు. ఎవరైనా సమయం చూసుకోవాలంటే వాళ్లకి ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 10.30 ని.ల వరకి సమయం ఉంది. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఉదయం 10.30 ని.లకి మొదలవుతాయి. నేను ఎలాంటి టైం చూసుకోలేదు.
ఆ విధంగా నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత కూడా ఎప్పుడూ తేదీని రోజుని, టైంని పట్టించుకోలేదు. ఓ ఇరవై ఏళ్లు గడిచిన తరువాత మంచిరోజున జాయిన్ కమ్మని మా ఆవిడ చెప్పేది. అట్లాగే చేశాను. కానీ నిజంగానే మంచి రోజులు చెడ్డ రోజులు వున్నాయా? మనకు అనుకూలంగా వున్న రోజు మంచిరోజు కాదా? చాలామంది ఎన్నో గడియలు చూసుకుంటారు. కానీ ఎంతో ఇబ్బందుల పాలైన వాళ్లని చూశాను. ఇలాంటి మూఢమైన అభిప్రాయాలు ఉండటం ఎంతవరకు సమంజసం?
ప్రతిరోజు నిన్న గడిచిన మరో రోజు లాంటిదే.
మనం కష్టపడి పని చేయడానికి మనకి లభించిన మరో రోజు.
మనం నిత్యం విద్యార్థులమే. జీవిత పాఠాలు నేర్చుకోవడానికి మనకు లభించిన మరో రోజు. మన అదృష్టం తేదీల మీద, సమయం మీద ఆధారపడి ఉండదు.
మనం ప్రతిరోజూ చేసే పనినిబట్టి కృషిని బట్టి మన అదృష్టం మారుతుంది.
అదృష్టం అనేది ఒక శాతం మాత్రమే. 99 శాతం మనం చేస్తున్న శ్రమ, పరిశ్రమ.
అంతే!