S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎండిన చెరువు అలక

సీ॥ వేసవి తాపంపు విజయకేతనముకు
బుడుతల ఈతల పులకరింత
కాగితాల పడవ గమనము జూచెడి
బుడుగుల కేరింతలడుగులేవి?
గేలము వేయుచు మీలను బట్టెడి
పల్లెకార్లును బాడుపాటలేవి?
మఱ్ఱి మానులపైన మిఱ్ఱిమిఱ్ఱియు జూచు
తొఱ్ఱలో ఉడుతల తోషమేవి?
ఆ॥ తుమ్మపువ్వులెన్నో తురుముకు గట్టున
మేకమందలున్నమేది నెచట?
మలిన వలువలుతుకు మడివేలు కష్టమ్ము
కొంగ రెక్కమించులుంగలెచట?

ఆ॥ అనుచు మధనపడుచు నలిగెను చెరువుయు
మాటరాని వౌనబాట బట్టి
తేటతేనెలున్న తీయని నీటిని
కలుషితమ్ము జేయ కనలుచుండె

-బిహెచ్‌వి రమాదేవి 9441599321