S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సామెతలు

* అంగట్లో అరువు తల మీద బరువు
* అంగిట్లో బెల్లం, ఆత్మలో విషం
* అంటక ముట్టక దేవుడికి పెడుతున్నాను. ఆశపడకండి బిడ్డల్లారా! అవతలికి పోండి అన్నాడట.
* అంటుకోను ఆముదం లేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
* అంటే ఆరడి అవుతుంది. అనుకుంటే అలుసవుతుంది
* అండ వుంటే కొండ బద్దలు కొట్టవచ్చు
* అంతంత కోడికి అర్ధశేరు మసాలా
* అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పు
* అంత పెద్ద పుస్తకం చంకలో వుందే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు
* అంతము లేని చోటు లేదు, ఆదిలేని ఆరంభం లేదు
* అంత వురిమీ - ఇంతేనా కురిసింది
* అంతా అన్నీ తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు
* అంతా ఆడపిల్లలే వుంటే అన్నీ అబద్ధాలే చెప్పాలట
* అంతా మనవాళ్లేగాని, అన్నానికి రమ్మనే వాళ్లే లేరు
* అందముంటే అయెనా? అదృష్టం వుండద్దా?
* అందరి కాళ్లకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు
* అందరినీ మెప్పించడం అలవిగాని పని
* అందానికి దాల్చిన ఆభరణం ఆపదలో ఆదుకుంటుంది
* ఉంటే అమీరు, లేకుంటే ఫకీరు
* ఉట్టిమీద వెన్న పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు
* ఉడుత ఊపులకు కాయలు రాలునా?
* ఉత్త కుండకు ఊపెక్కువ
* ఉత్తరం చూసిన మేడ ఇంటికాన్న దక్షిణం చూసిన మట్టి కొంప మిన్న
* ఊరు ఉసిరికాయంత తగువు తాటికాయంత
* ఊహలు ఊళ్లేలుతుంటే ఖర్మం కట్టెలు మోస్తుంది, బుద్ధి భూములేల్దామంటే రాత గాడిదలను కాస్తానంటుంది
* ఋణ శేషం, వ్రణ శేషం, అగ్నిశేషం, శత్రు శేషం ఉండరాదు
* ఋణ మూలం, నదీ మూలం, స్ర్తి మూలం విచారించకూడదు.
*