S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వనరులు

టామ్ మోరీస్ రాసిన కథ ఒకటి ఈ మధ్య చదివాను. మన వనరుల ఉపయోగం గురించిన కథ అది. నాకు బాగా నచ్చింది. కథలో లాంటి వ్యక్తులు మనకు ప్రతి ఊర్లోనూ కన్పిస్తారు.
ఒక ఊర్లో ఓ వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆస్తిని జమ చేయడం చాలా ఇష్టం. బంగారం, వెండి, వజ్రాలు, విలువైన వస్తువులని జమ చేసేవాడు. ఆయన బెడ్‌రూంలో ఓ అటకని ఏర్పాటు చేసి అందులో వాటిని ఉంచేవాడు. విలువైన వస్తువుల్లో కత్తులు కఠారులు లాంటివి కూడా ఎన్నో ఉండేవి. ప్రపంచమంతా తిరిగి వాటిని సేకరించి తన అటక మీద పెట్టుకునేవాడు.
అతను సేకరించిన వస్తువుల బరువు ఎక్కువై అటక శబ్దం చేసేది. ఆ విషయాన్ని అతను పట్టించుకోలేదు. అదే విధంగా సేకరిస్తూ పోయాడు.
ఓ రోజు అర్ధరాత్రి అటక కూలి అతని మీద పడింది. ఆ బరువుకి అతనికి శ్వాస ఆడక వెంటనే మరణించాడు.
అతను జమ చేసిన విలువైన వస్తువులు బంగారం, అన్నీ చెల్లాచెదురై పోయేయి.
ఆ విలువైన వస్తువులని ఇంట్లో అలకరించుకొని అతను అనుభవించలేదు.
బంగారం వెండితో ఆభరణాలు చేయించుకోలేదు.
అవి అట్లా నిరుపయోగంగా ఉండిపోయాయి.
అవి ఉపయోగించుకునే సామర్థ్యం వున్న వ్యక్తుల చేతుల్లో పడితే పరిస్థితి మరో రకంగా వుండేది.
అవి వున్నా లేని పరిస్థితిగా మారిపోయింది.
అందరిలో కూడా కొన్ని వనరులు ఉంటాయి.
అవి బంగారం వెండి కాదు.
మన వనరులని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఉపయోగించుకుంటే అవి వృధా కావు.
ఉపయోగించుకోకుంటే అవి వృథా అయిపోతాయి.
మనం చనిపోయినట్టుగా ఉంటుంది.
మన శక్తిసామర్థ్యాలని గుర్తించాలి. వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి.

- జింబో 94404 83001