S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తమాషా

డాక్టర్: దెబ్బ తగిలిన చోట ఈ మందు రెండు పూటలా రాయండి.. ఓ పది రోజుల్లో తగ్గిపోతుంది.
పేషెంట్: నాకు ఈ దెబ్బ మా ఇంటి నుండి సుమారు 100 కి.మీ. వద్ద తగిలిందండి. రోజూ అక్కడికి వెళ్లి రాసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదా?!
* * *
భార్యాభర్తలు అంటే ఎవరు స్వామీ?
- జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్తయితే, భర్తకు భయపడినట్టు నటించి భర్తను భయపెట్టి బ్రతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్లే నాయనా!
* * *
రాజేష్: బాకీ అడుగుదామని కాల్‌చేస్తే రవిగాడు లిఫ్ట్ చేయటం లేదురా?
వెంగళప్ప: నీ సెల్ ఇటివ్వు. నేను చేస్తే గుర్తుపట్టడు.
* * *
తండ్రి: ఏంట్రా? స్కూల్ వదలకుండానే వచ్చేశావ్?
కొడుకు: టీచర్ ఒక ప్రశ్న అడిగారు.
దానికి జవాబు రాదా?
వచ్చు నాన్నా. కానీ చెప్పకుండా వచ్చేశా.
ఇంతకీ ఏం ప్రశ్న అది?
‘నాపై ఈ రాయి విసిరింది ఎవరు..?’
*