అక్షర మాల - అద్భుత జీవితం
Published Saturday, 28 April 2018అ: అనే్వషించడం మొదలుపెట్టు
ఆ: ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు
ఇ: ఇష్టపడటం నేర్చుకో
ఈ: ఈర్ష్యపడటం మానుకో
ఉ: ఉన్నంతలో జీవించు
ఊ: ఊహకందేలా ఆచరించు
ఋ: ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు
ఎ: ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు
ఏ: ఏకాగ్రతను అసలు కోల్పోకు
ఐ: ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు
ఒ: ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది
ఓ: ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో రోజు గెలుపు బాటలు
ఔ: ఔన్నత్యానికి గెలుపోటములు నీకు పునాదులని మరువకు
అం,అః: అందని ఎత్తు కెదగాలంటే.. అహర్నిశలు శ్రమించు
క: కష్టపడి పని చేయాలి
ఖ: ఖచ్చితత్వం అలవరచుకో
గ: గమ్యాన్ని ఎంచుకొని పయనించు
ఘ: ఘాటుగా స్పందించు
ఙ: జ్ఞాపకాలను గుర్తించి మసలుకో
చ: చతురతతో నేర్పుగా వ్యవహరించు
ఛ: ఛత్రపతిలా జీవించు
జ: జగడాలకు దూరంగా ఉండు
ఝ: ఝుమ్మని నాదించు
ణ: జనగణమన గీతాన్ని మరువకు
త: తరతమ భేదాలొద్దు
థ: తదేక ధ్యానంతో జీవించు
ద: దయతో మెలగు
ధ: ధర్మాన్ని సదా పాటించు
న: నట జీవితం నేర్చుకోకు
ప: పరిహాసాలు వద్దే వద్దు
ఫ: ఫలితాలను స్వీకరించు
బ: బలప్రయోగాలు వద్దే వద్దు
భ: భయాన్ని దరిరానీయకు
మ: మర్యాద మన్నన మరువకు
య: యవ్వనం శాశ్వతం కాదు
ర: రంగుల మయం ఈ జీవితం
ల: లక్షణంగా జీవించు
వ: వంచన, దగాలు దరిచేరనీయకు
శ: శరంలా పరిగెత్తు లక్ష్యంవైపు
ష: షడ్రుచులను ఆస్వాదించు
స: సన్నిహితులను ఏర్పరచుకో
హ: హానికర పనులను విడనాడు
ళ: అవహేళన వలదు
క్ష: క్షణికావేశాలకు లోనుకాకు