S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాక్సినే్ల శ్రీరామరక్ష..

గర్భిణి తొమ్మిది నెలలలో ధనుర్వాతం రాకుండా రెండు, మూడు డోసులు టెటనస్ వాక్సీన్ తీసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే.. ఒక డోసుకి, రెండో డోసుకి మధ్య నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి ఉండాలి. ఆఖరి ఇంజక్షన్ (టి.టి.)ప్రసవానికి ఎంత దగ్గరగా తీసుకుంటే అంత మంచిది. జబ్బకిగానీ, తుంటికిగానీ తీసుకోవాలి ఈ ఇంజక్షన్.
ఇంకొక మంచి ఇంజక్షన్ ఇన్‌ఫ్లుయెంజా.. ఇది ఒకటే డోసుగా ఆరు నుంచి ఏడు నెలల మధ్య ఇవ్వాలి. దీనివల్ల తల్లికేగాక పాపకి కూడా న్యుమోనియా, ఫ్లూ జ్వరం రాదు. ఇది టి.టి. ఇంజక్షన్ కంటే ఖరీదు ఎక్కువే కానీ దీని లాభంతో పోలిస్తే ధర భరించడం తప్పు లేదు.
హెపటైటస్, కలరా, టైఫాయిడ్ వంటి వాక్సినులు ప్రసవానంతరం ఇవ్వడం మంచిది. గర్భిణీ లను ఈ వ్యాధిగ్రస్తులకి దూరంగా పెట్టి కాపాడుకోవాలి. మిగతా వైరల్ ఇనె్ఫక్షన్లని నివారించడానికి ఉద్దేశించిన వాక్సిన్లు గర్భిణీలకు ఇవ్వకూడదు. ఉదాహరణకి మీజిల్స్, స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ వంటి వాక్సిన్లు.
అసలు బాల్యంలోనే ఈ వాక్సిన్లు పోలియో ట్రిపుల్ ఆంటిజన్లు మొదటి ఒకటి లేదా రెండు సంవత్సరాల వయస్సులోనే ఇవ్వాలి. ఏదైనా ఎపిడమిక్ వంటిది వస్తే గర్భిణీలు వారికి దూరంగా ఉండాలి. స్మాల్‌పాక్స్ ఇరాడికేషన్ ఫలించిందిగానీ చికెన్‌పాక్స్ ( ఆటలమ్మ) గర్భిణీలకు రావచ్చు. ఎలాగంటే వారికి ఒక చిన్నపాప ఉండి ఆ పాపకి ఆటలమ్మ వచ్చినప్పుడు తల్లిగా పిల్లతో ఉండి సంరక్షణ చెయ్యాలిగదా.. అప్పుడు వచ్చే అవకాశం ఉంది. లేత నెలలప్పుడు వస్తే కడుపులోని శిశువుకు అవయవలోపాలు రావచ్చు. నెలలు కాకుండా ప్రిమెచ్యూర్ ప్రసవం, విపరీతమైన రక్తస్రావం కలిగే ప్రమాదం ఉంటుంది. కనుక మొదటి నెల నుంచి ప్రసవం అయ్యేవరకు స్ర్తీ జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కకాటుకి ఇచ్చే రేబిస్ వాక్సిను కూడా మంచిది కాదు. అందుకని గర్భిణిలు కుక్కలకి కూడా దూరంగా ఉండటం ఉత్తమం.