S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెవులకు తలుపులు

ఒక పడవలో ఒక వివేకవంతుడు, అతని పక్కనే ఒక మామూలు మనిషి ప్రయాణిస్తున్నారు. మామూలు మనిషి ఎగసి పడుతున్న అలల్ని, అవి చేసే ధ్వనుల్ని భరించలేక పోతున్నాడు. వివేకవంతుడు నిర్మలంగా కూచున్నాడు.
మామూలు మనిషి, ‘ఈ అలల శబ్దం ఎంత కర్ణకఠోరంగా ఉంది. ఎంత దారుణంగా ఉంది. దీన్ని భరించలేకపోతున్నానంటే నమ్మండి’ అంటూ చిరాకు ప్రకటించాడు.
వివేకవంతుడు ‘అవునా?’ అన్నాడు.
మామూలు మనిషి ‘రాత్రింబవళ్లు ఈ శబ్దం వింటూ నాకు పిచ్చెక్కేట్లు ఉంది’ అన్నాడు ఆందోళనగా.
వివేకవంతుడు ‘అలాగా! నువ్వు గుర్తుచేసేదాకా నేను ఆ శబ్దాన్ని విననే లేదు. నాకు వినాలనిపించినపుడు దాన్ని వింటాను, నాకు వినాలని లేనప్పుడు దాన్ని వినను’ అన్నాడు.
అసలు సంగతి అది. ఇద్దరికీ వినికిడి జ్ఞానముంది. గ్రహణశక్తి వుంది. ఒకతనికేమో వినడం తెలుసు, వినకపోవడం తెలుసు. చెవుల్ని మూయడం తెలుసు, తెరవటం తెలుసు. ఇంకొకతనికి తెరవడం తెలుసు, మూయడం తెలీదు.

జంతు తత్వం
ఒకరోజు ఒక కుక్క పట్టణానికి బయల్దేరింది. అది వున్న గ్రామం నుంచి పట్టణానికి వెళ్లాలంటే రొండు మూడు రోజులకు తక్కువ పట్టదు. కానీ అది ఒక రోజులోనే చేరింది. ఆ రోజు సాయంత్రంకల్లా పట్టణం చేరింది.
పట్టణ పొలిమేరల్లో వున్న కుక్కలు ఆయాసపడుతున్న ఆ కుక్కని చూసి ఆశ్చర్యపోయాయి. ఉదయం బయల్దేరి సాయంత్రంకల్లా వచ్చానని చెబితే విస్తుపోయాయి. ‘అంత వేగంగా ఎలా వచ్చావు?’ అన్నాయి.
ఆ కుక్క ‘నిజానికి నేను బయల్దేరింది మధ్యమధ్యలో కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుందామనే బయల్దేరాను. ఒక గ్రామంలోకి వస్తే అక్కడ విశ్రాంతి పొందుదామంటే ఆ వూరి కుక్కలు నన్ను తరిమాయి. అక్కడి నుంచి యింకో పల్లె మీదుగా వెళితే ఆ పల్లెలోని కుక్కలు నా వెంట పడ్డాయి. అందువల్ల నాలుగు రోజులు పట్టే ప్రయాణం ఒక్కరోజులో ముగిసింది’ అంది ఆయాసపడుతూ.

- సౌభాగ్య, 9848157909