S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వింత వింత దిండ్లు

‘ఛ.. ఛీ.. ఏంటి సోఫాపైన చేపను పెట్టారు? ఈ కోడి ఎక్కడి నుండి దాపురించింది.. మంచంపైకి చేరింది? ఈ దరిద్రపు బల్లులు టీపాయ్ మీద ఏం చేస్తున్నాయ్? అయినా ఇంత పెద్ద బల్లులున్నాయేమిటి మీ ఇంట్లో?’ ఇలా... చాలా చాలా కామెంట్లే వస్తాయి ఇలాంటి దిండ్లను చూస్తే.. ఇంటికి వచ్చిన వారెవరైనా సరే ఒక నిముషం పాటు ఆగిపోవాల్సిందే వీటిని చూసినప్పుడు. కోడి, చేప.. ఏంటి?
యాంగ్రీ బర్డ్స్, పోకేమన్ వంటి కార్టూన్
కారెక్టర్లు, పండ్లు, కూరగాయలు, జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు.. ఇలా ఒకటేమిటి? మన సృజన విస్తరించిన మేరకు రకరకాల దిండ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. త్రీడీ ప్రింటెడ్ కుషన్లను చూసేందుకు ఇప్పుడు రెండు కళ్ళూ సరిపోవడం లేదు. మీ సృజనాత్మక తగినట్లు దిండ్లను కొని హాల్లో అలంకరించేయండి మరి!