S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘సెన్స్’ లైట్స్

అర్ధరాతి మంచి నిద్రలో ఉన్నప్పుడు కొంతమంది పెద్దవారికీ, మధుమేహం ఉన్నవారికీ బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు నిద్ర లేచి స్విచ్‌బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్ ఆన్ చేసుకుని బాత్‌రూమ్‌కి వెళ్ళాలి. అంతేకాకుండా ఆ రూములో పడుకున్న మిగిలిన వారికి నిద్రా భంగం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వచ్చిన విద్యుత్ కాంతులే ‘మై లైట్‌డాట్ మి’. ఇవి సెన్సర్ల ద్వారా పనిచేస్తాయి. ఈ లైటును మంచం కింది భాగంలో అమర్చుతారు. దీనికి సంబంధించిన ప్లగ్‌ను బోర్డుకు కనెక్ట్ చేస్తారు. రాత్రిళ్లు నిద్ర లేచి కాలు నేలపై పెట్టగానే లైట్ వెలుగుతుంది. మంచం అడుగుభాగంలో ఉంటుంది కాబట్టి వెలుగు ఎక్కువ వచ్చి పక్కవారికి నిద్రా భంగం కలుగకుండా, కనిపించేంత వెలుగు మాత్రం వస్తుంది. ఈ లైట్లు పూర్తి చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతాయి. ఈ లైట్ ఎంత సేపు వెలగాలన్న సమయాన్ని మనమే సెట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లల్లో ఇలాంటి లైట్లు ఉంటే చాలా మేలు.