S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆడుకుంటూ నేర్చుకుందాం!

పిల్లలకు సెలవులున్నప్పుడు స్కూలు గుర్తుకువస్తుంది. ఎందుకంటే స్కూలుతో, హోంవర్కులతో బిజీగా గడిపేయొచ్చు. స్కూలు ఉన్నప్పుడు సెలవులు కావాలనిపిస్తాయి. పసి మనస్తత్వం ఇలాగే ఉంటుంది. పిల్లలు వేసవి సెలవుల్లో ఆటలు ఆడుతూ కనిపిస్తారు. అయితే ఎండ వేడిమికి పిల్లలను బయటకు పంపకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి వీడియోగేమ్స్ ఆడిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే వారు కాస్త ఎక్కువగా ఆడితే తల్లిదండ్రులే విసుక్కుంటూ ఉంటారు. ఎంతసేపూ.. మీకు మొబైల్స్‌తోనేనా పని అని.. పాపం! ఆ పసిమనసులకు ఏం చేయాలో అర్థం కాదు. అలా కాకుండా అమ్మానాన్నలు ఫోన్స్‌లోనే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి పిల్లలకు విజ్ఞానంతో పాటు వినాదాన్ని కూడా అందించవచ్చు. పిల్లలకు విజ్ఞానాన్ని అందించే యాప్ ఒకటి ఉంది. అదే- బ్రెయిన్‌పాప్ ఫీచర్డ్ మూవీ ఆప్. దీనిలో ప్రతినెలా ఒక్కో అంశం లేదా ఒక్కో వ్యక్తికి సంబంధించిన ఆసక్తికరమైన అనేక విషయాలను, వీడియోలను అందిస్తారు. ఈ వీడియోలు చూసి అనేక అంశాలను తెలుసుకోవచ్చు. అంతేకాదండోయ్! ఇందులో క్విజ్ కూడా ఉంటుంది. దీనిలో పాల్గొని మార్కులు కూడా సంపాదించుకోవచ్చు. వీటితోపాటు ఆల్ మూవీస్ ట్యాబ్‌లో సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అనే విభాగాలు కూడా ఉంటాయి. వీటిని ఎంచుకుని మరిన్ని వీడియోలను కూడా చూడొచ్చు, క్విజ్‌లో పాల్గొనవచ్చు.

గణితం
కూడికలు, తీసివేతలు, భాగహారాలు, హెచ్చివేతలు.. ఈ పేర్లు చెబితే పిల్లాడు ముఖం అదోలా పెట్టేస్తాడు. వీటిని చాలా సులభంగా నేర్పించే యాప్- 3డూడుల్ మ్యాథ్స్2 పిల్లలు ఆడుకునే లెగో ముక్కలతో ఈ ఆట ఉంటుంది. ఒకదానిపై 5+4 అని ప్రశ్న ఉంటే.. దాని దిగువన ఉన్న ముక్కల్లో 9, 12, 15, 18 అంటూ కొన్ని సమాధానాలు ఉంటాయి. పై ప్రశ్నకు జవాబును జోడిస్తే ఈ లెక్క పూర్తి అవుతుంది. అలా ఒక్కో లెవెల్లో పది వరకు లెక్కలుంటాయి. లెవెల్స్ పెరిగే కొద్దీ ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ఒక్కో లెవల్ గెలిస్తే పాయింట్స్ వస్తాయి. వాటితో కొత్త లెవెల్‌ని కొనుగోలు చెయొచ్చు.
ఇలాంటిదే మరొక ఆట ఉంది. ఇంట్లో మగపిల్లలు ఉంటే ఎప్పుడూ బాంబర్‌మేన్‌లు, డుష్యుం డుష్యుంలు, గన్‌లతో కాల్చే ఆటలు ఆడుతుంటారు. వాటితో తలనొప్పి వస్తోందంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలాంటి ఆటలు ఇష్టపడే పిల్లలకు మాథ్ మాన్‌స్టర్స్ ఆటను పరిచయం చేయాలి. ఈ ఆటతో పిల్లలకు లెక్కలు కూడా సులువుగా, వేగంగా వచ్చేస్తాయి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయగానే ఓ యువకుడు గన్ పట్టుకుని నడుస్తుంటాడు. ఎదురుగా ఆగంతకులు వస్తుంటారు. ఆ యువకుడి చేతిలో ఉన్న గన్ను పేలాలంటే పిల్లలు ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఎంత త్వరగా పిల్లలు సమాధానమిస్తే వారు అంత త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు.

భాష
పిల్లలు ఆడుకుంటూ భాష నేర్చుకోవడానికీ బబ్బెల్ అనే యాప్ ఉంది. సెలవుల్లో ఆడుతూ పాడుతూ కొత్తగా విదేశీ భాషల్ని సైతం నేర్చుకోవచ్చు. పిల్లలు ఈ యాప్ ద్వారా 14 విదేశీ భాషల్ని నేర్చుకోవచ్చు. ముందుగా ఈ యాప్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే.. నేర్చుకోవాలనుకుంటున్న భాషకు సంబంధించిన పదాలు, వాక్యాలు కనిపిస్తాయి. ఇందులో బిగినర్, ఎక్స్‌పర్ట్ వంటి విభాగాలుంటాయి. ముందుగా బిగినర్‌ను పూర్తిచేసి ఎక్స్‌పర్ట్‌లోకి వెళ్లవచ్చు. భాష కొద్దిగా తెలిసి ఉంటే ఎక్స్‌పర్ట్‌కు వెళ్లవచ్చు. ఇందులో భాష నేర్చుకోవడం ప్రశ్న, జవాబుల రూపంలో ఉంటుంది.
కొంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఎండ్‌లెస్ ఆల్ఫాబెట్ అనే యాప్ ఒకటుంది. దీని ద్వారా పిల్లలకు అక్షరాలు, పదాలు నేర్పించేయొచ్చు. ఇందులో ఇంగ్లీషు అక్షరాల వారీగా కొన్ని పదాలతో ఫొటోలుంటాయి. అంటే ఎ ఫర్ ఆపిల్ లాగా అన్నమాట. ఆ పదం దిగువన కొన్ని అక్షరాలు చిందర వందరగా ఉంటాయి. వాటిని సరైన క్రమంలో అమర్చితే సరి.. ఇలా ఒక్కో అక్షరానికి సుమారు ఐదారు పదాలు ఉంటాయి.

కామిక్స్
కార్టూన్ చానెల్‌ను ఇష్టపడని పిల్లలుంటారా? ఎప్పుడూ కార్టూన్ వీడియోలు చూసే ఆ పిల్లల చేతనే కార్టూన్ వీడియోలు చేయిస్తే.. చాలా బాగుంటుంది కదూ.. పిల్లలు కూడా ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే ఆ కార్టూన్లు చూసేటప్పుడే ఆ చిన్ని బుర్రల్లో బోలెడు ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. వాటికి సమాధానమే కార్టూన్ వీడియో తయారుచేయడం. ఇందుకోసం ముందుగా మొబైల్‌లో గూగుల్ టూన్‌టాస్టిక్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేస్తూనే బోలెడన్ని కార్టూన్ బొమ్మలు పిల్లల కోసం మొబైల్ తెరపై సిద్ధంగా ఉంటాయి. నేపథ్య ప్రాంతం, సంగీతాలను ఎంచుకుని ఆ బొమ్మలను కదుపుతూ పిల్లలతో సరదా సంభాషణలను చెప్పించాలి. తరువాత ఇదంతా కలిసి ఆటోమేటిక్‌గా ఓ కార్టూన్ కథగా రికార్డు అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్లే చేసి పిల్లలకు చూపిస్తే సరి. వాళ్ల మాటలతో కథ తయారైంది కాబట్టి వారు ఎంతో సంతోషంగా ఈ కథ వింటూ ఎంజాయ్ చేస్తారు. దీనితో వారికి స్టేజ్ ఫియర్ కూడా దూరమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పజిల్స్
పత్రికల్లో బోలెడు పజిల్స్ వస్తుంటాయి. వాటిని చూస్తూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ బొమ్మలో ఉన్నవి కనుక్కోండి.. లేదా ఫలానా బొమ్మలో ఉండి, పక్క బొమ్మలో లేనివి ఏంటి? అనే పజిల్స్‌ను పిల్లలు ఆసక్తికరంగా గమనిస్తుంటారు. ఇది పిల్లల్లోని పరిశోధనా తత్త్వాన్ని పెంచుతుంది. ఇలాంటివే ఇంకా బోలెడన్ని పజిల్స్‌ను అందించేది కయిల్లో సెర్చ్ అండ్ కౌంట్ యాప్. ఇది ఓపెన్ చేయగానే తెరపై ఓ ఈతకొలను కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక వస్తువును చూపించి ఆ ఫొటోలో ఫలానా వస్తువులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అని అడుగుతుంది. అలా ఒక్కో ఫొటోలో ఆరు రౌండ్లు ఉంటాయి. ఫొటోలను గుర్తుపట్టిన తర్వాత యాప్‌లోని ఒక వ్యక్తి వాటిని లెక్కించి పిల్లలకు వినిపిస్తాడు. యాప్‌లో తొలి పజిల్ ఉచితంగా లభిస్తుంది. మిగిలిన వాటిని కొనుగోలు చేయాలి.

పండ్లు
చిన్నపిల్లలకు పండ్ల పేర్లను పరిచయం చేయడానికీ ఓ యాప్ ఉంది. పళ్లరసాలు తయారుచేసుకునేలా, జంతు ప్రదర్శనశాలకు వెళ్లి అక్కడి జంతువులకు రకరకాల పండ్లను ఆహారంగా వేసేలా.. ఒక ఆటను రూపొందించారు. దీనిపేరు పిబిఎస్ ప్లే అండ్ లెర్న్. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే పిల్లలను- 3జూ2కి వెళతారా? జూస్ చేస్తారా? అనే ప్రశ్న ఎదురవుతుంది. పిల్లల ఆసక్తిని అనుసరించి ఎంపిక ప్రాంతం, ఫలాల పేర్లు, వాటి పరిమాణాల గురించి చెప్పేలా వీడియోలు ఉంటాయి. వీటిని పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుంటారు.

పోటీలు
ప్రపంచంలో చాలా పక్షులు, జంతువులు ఉంటాయి. వాటి శరీరాకృతి, అవయవాలు, నడిచే పద్ధతి, ఆహార సేకరణ, తినడం, వాటి జీవనశైలి ఇలా ప్రతీదీ ఆసక్తికరమే.. వాటిని పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు కూడా. వీటి గురించి తెలుసుకోవడానికి యానిమల్స్ ఎన్‌సైక్లోపీడియా అనే యాప్ ఉపయుక్తం. ఇందులో అనేక జంతువుల సమాచారంతో పాటు పజిల్, క్విజ్ వంటి ఆప్షన్లు కూడా అనేకం ఉంటాయి. తొలుత వీటి గురించి సమాచారాన్ని మొత్తం తెలుసుకోవాలి. తరువాత క్విజ్‌లోని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చి పాయింట్లను గెలుచుకోవచ్చు. ఇలా వివిధ కేటగిరీలలోని జంతువుల గురించి తెలుసుకుని వాటికి సంబంధించిన క్విజ్‌లలో పాల్గొని పాయింట్లను సంపాదించుకోవచ్చు.