S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒరిజినల్ భెజవాడలో....

హిందూ పత్రిక వాళ్లు కుర్రాళ్లని - పిల్లి పిల్లల్ని త్రిప్పినట్లు రకరకాల ‘బీట్స్’లో వేస్తారు. బీటు అంటే మనం ‘కవర్’చేసే ఏరియా- ఏదో ఒక శాఖ. ఉదాహరణకి పోలీసు బీటులో - పోలీసు కేంద్రాల న్యూస్ వాళ్లే ఇస్తారు - చుట్టబెట్టుకు రావాలి - స్కూళ్ల బీటులో - స్కూల్ రిపోర్టులు ఫంక్షన్స్ ఇదే యాత్రానందం - మనకయితే ఒకడే. ‘ఆల్‌రౌండర్’ ఉంటాడు - వాడే అన్నీ నోల్లెసుకుని రిపోర్టింగ్ చెయ్యాలి.
ఈ అయిదేళ్లల్లో అలా రాటుదేరి - చివరికి ఆంధ్ర బ్యూరోకి సెలెక్ట్ అయ్యాడు మన వాడు. తెలుగు వాడిగా చెలామణీ కాగల వాడే కానీ అరవవాడు అదే ప్లస్ పాయింట్ అతనికి - అందుకని అతన్ని ముందు ఆర్నెల్లు బెజవాడలో (క్రిష్ణ జిల్లా) వేశారు అంతట - వైజాగ్ పిదప కడప అలా తెలుగు నాడు అంతా తిరిగాక హె’బాద్‌కి పోస్ట్ చేస్తారు - సరే - రాజేంద్ర అన్నాడు - యూ మస్ట్ సజెస్ట్.’ అని.. ఎందుకంటే మీ వూరిది అన్నాడు. -కమ్యూనిస్టూల మీద రాయి- అన్నాను. ఊరంతా ఎరుపు కదా అప్పుడు. షో మీ కంట్రీ సైడ్ అన్నాడు - వర్కింగ్ క్లాసుని చూపెట్టు - అడిగాడు. ‘పద’ అన్నాను. అతి పెద్ద రైల్వేస్టేషను దాని బ్రిజ్ దాటి అవతల ప్రక్క దిగాము. ఆ వంతెన మీద రెండేళ్లు ఎక్కీ, దిగీ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీకి వెళ్లినవాన్ని. దాని మీద - ట్రాఫిక్ జామ్స్‌ని చూడాల్సిందే - ముష్టి వాళ్లు ‘సైడ్స్’కి అధిపతులు - ఎదురుగా రెండు గేదెలు - అదేనండీ బర్రెలు - గంతలు కట్టిన గుర్రాల్లాగా - మునే్దముందో చూసుకోకుండా - బుల్‌డోజర్‌లాగ - వచ్చేస్తూ వుంటే - అటువేపు నుంచి సైకిళ్లు.
బ్రిడ్జ్ ర్యాంప్ మీది గారడీ వాడి ప్రక్క నుంచి దిగాము బెజవాడ వెస్ట్ వేపు. -రైలు యార్డు గోడని ఆనుకుని ఉత్తరంగా ఉన్న వీధిలో నడిస్తే రాంగోపాల్ చౌల్ట్రి కమానులు వచ్చాయి - ఈ కమానులు చౌరస్తాలు ‘ట్రై’ రస్తాలు ‘హాయ్’మదులో వున్నట్లు ఇంకెక్కడా లేవు. ఈ చౌల్ ట్రీ అంతా మార్వాడి యాత్రీకులమయం - ఒక సినిమా కోసం వేసిన - షోలే కోసం అక్కడెక్కడో వేసిన బస్తీ సెట్‌లాగా ఉంటుంది. - మా చిన్నప్పుడు ఇక్కడ లోపలి రాస్తాలో - నిజాం నాణేలను మన బ్రిటీషు నాణేలలోకి మార్పిడి సదుపాయం ఉండేది - ఇట్నుంచి అటూ ఎక్సేంజ్‌గా మార్చుకోడానికి - చిన్నచిన్న సందూకు దుకాణాలు ఉండేవి. హైదరాబాద్‌కి పోవాలంటే హల్ది కాయిన్స్ ఎక్స్‌చెంజీ చేసుకుని పోవాలి. డిమాండుని బట్టి ఎక్స్‌చెంజి రేటు - అట్నుంచి ఇటు వచ్చాక నోట్సు కాయిన్స్ కూడా మళ్లీ కమిషన్.. ఇచ్చి మరీ మార్చుకోవాలి నిజాం వేరే రాజ్యం కదా?
కొంతకాలం అయినాక హైదరాబాద్‌లో రెండు రకాలు మన వాళ్ల నాణేలు చెలామణిలో వుండేవిట.
రాజస్తానీ దుస్తుల్ నగల్ - పూసల్ దండలు - అన్నీ - ఈ సత్రం లోపల బయట దొరికేవి ఒక హోటలు కిరాణా కొట్టు వెలుపల వుండేవి - పోస్టల్ డిపార్టుమెంట్ వారి ‘ఆర్‌ఎంఎస్ - రెస్ట్ హవుస్’ ఉండేవి. మార్వాడి యాత్రీకులకు రాంగోపాల్‌లో అన్నీ సౌకర్యాలే. అదో స్వర్గం. బయట లాడ్జింగులు కూడా ఆ వీధిలో సత్రం గదుల్లోనే ఉండేవి - అది వారి ప్రైవేటు మార్గం - గట్టిగా మాట్లాడితే - మూసేస్తారు. మా ఇంచిపేటకి చుట్టూ చాల దూరం తిరిగి రావాలి - నిజాం గేటు వాళ్ల గూడ్స్ షెడ్డు వేరే.. వాళ్ల రైల్వే లైను - దాని మీద యెల్లో దీపాలు స్పెషల్. నిజాం రైల్వే లైను వాళ్లకో ప్లాట్ఫారం - అదో జమానా. ఇదంతా మరో ప్రపంచం కాని - మద్రాస్ కొవం నది అంత పెద్ద మురుగు కాలువ ఇంచిపేట ప్రత్యేకత. అదే చూపించాను గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు - ఇవన్నీ దాటిపోతే అతి పెద్ద ‘లోకో షెడ్డు’ - అవీ చూపించి - ఇక్కడ లోకో షెడ్ - ‘గూడ్సు షన్టింగు యార్డులు ఉండేవి. అటు వేపు ప్రజలు జనాలు పిల్ల జెల్ల - ప్రాణాలకు తెగించి గూడ్సు రైలు పెట్టాలా క్రింద నుంచి దూరిపోతుంటారు - ఒక ఫ్లై ఓవర్ వెయ్యాలి - ఈ పేదలకి నువ్వో ఫీచర్ చేసి హిందూలో వేస్తివో - నవ్వాడు. రాజేంద్రప్రసాద్ అచ్చం అరవ హిందూ రిపోర్టర్‌లాగే, హిందూకి యాడ్లు - బేరాలు - పలుకుబడి ఇవి తేవాలి నేను - నాకు సర్వీస్ క్లబ్ ఫ్రెండ్స్‌ని తాలూకా ఆఫీసు రికార్డు సెక్షన్‌ని పరిచయం చెయ్యి నువ్వు అన్నాడు.
జటకా బండి చూపించి అందులో ఎక్కించాను - మాకోటి ఇలాంటి సొంత జట్కా ఉండేది అని చెప్పాను. సొంతంగా గుర్రం ప్లస్ కార్ట్? - మరి మోటారు కార్లు చూడ్డానికే తక్కువ అన్నాను. మురుగు కాలవలో గునగునా హంసల్లాగా ఈదుకుంటూ పోతున్న చిన్నిచిన్న బాతు పిల్లలని చూపెట్టాను.
వించిపేట ఏరియా అనగా ఒరిజినల్ బెజవాడ. నంబర్ వన్ వార్డు. ఇంకా చెక్కుచెదరని పాతకి నిదర్శనం. ఆంగ్లో ఇండియన్లు - సాయిబులు - లోకోషెడ్ సిమెంటు ఫ్యాక్టరీ వర్కర్లు సిక్కు మతం తీసుకున్న తెల్లుగు బొందిలెలు అంటారు వాళ్లు రకరకల్ రైల్వే సరుకుకి అది ఒక మినీ ఇండియా. మధ్యలో పీర్ల పంజా దగ్గర ఉర్దూ పేపెర్‌ని చేస్తున్న ‘కాలిగ్రాఫర్’ని చూశాము. - సలాం వలెకుం - అన్నాను. వలెకుం సలాం సబ్ ఠీక్ హైనా? అన్నాడు. ఉర్దూకి అప్పుడు టైపు సెట్టింగు లేదు.
ఈ ఏరియాలో ఉంటూ నువ్వు తెలుగు పోయెట్రీ రాశావ్? కథలు, నవలలు రాశావ్? అని ఆశ్చర్యబోయాడు.
ఇదే మాకు రైట్ సెట్టింగు మా తమ్ముడు కార్టూన్లు బొమ్మలు ఈ ఏరియాలో వుండే వేశాడు. మా తమ్ముళ్ల కిది జీవితపు తొలి బడి.. ఇక్కడ మా అమ్మా నాన్న తామరాకు మీది నీటిబిందువులాగా ఉండేవారు. అలాగే మమ్మల్ని పెరగనిచ్చారు. పరిసరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.
కాని, 1964 తో మాకు విచ్‌పేటతో రుణం తీరిపోయింది. న్యూస్ పేపర్ జార్గోన్‌లో చెప్పాలి అంటే బడుగు జీవుల సంఘ జీవితాన్ని, అనుబంధాన్ని, ఇబ్బందులని కూడా వదులుకొని టూ టౌన్ అనే కొత్త విజయవాడకి మా కుటుంబం (అద్దె) నివాసం మార్చేము. 14-15-16, విజయవాడ-1 అంటే ఉత్తరాలు పత్రికలూ కొత్త వ్యక్తులు శ్రమ లేకుండా - వచ్చేసేవారు అదే పెద్ద ‘లాస్’ - పోస్ట్‌మేన్ అనే ఫ్రెండు దూరం అయ్యాడు.

--వీరాజీ. 92900 99512 veeraji.columnist@gmail.com