S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెండాట

చెండు అంటే బంతి. దీనిని పాత గుడ్డలతో తయారు చేసుకొంటారు. చెండులాగా తయారైన ఈ బంతితో ఆడుతారు కనుక దీనిని చెండాట అంటారు. కాని ఈ కాలంలో బంతులు రబ్బర్ బాల్, కార్క్ బాల్, లేక పుట్‌బాల్ అని, వాలీబాల్ అని, ఫ్లాస్టిక్ బాల్ ఇలా రకరకాలు బాల్స్ అంటే బంతులు వచ్చి ఈ ఆట మరుగున పడిపోయింది. కాని ఇప్పుడున్న బాల్ లేక బంతులతో ఆ చెండాటను ఆడితే లేనిపోనీ ప్రమాదాలు ఏర్పడుతాయి.
చెండాట ఆడే విధానం: బట్టముక్కలతో తయారు చేసుకొన్న బంతిని ఐదారుగురు పిల్లలు కలసి ఆడుతారు. ఈ బంతిని ఒకరు మరొకరి మీదకు విసురుతారు. ఆ చెండు తగలకుండా మళ్లీ ఆ చెండను పట్టుకోకుండానూ ఇంకొరి మీదకు విసరాలి. ఇలా విసురుతూ ఉన్నప్పుడు పొరపాటున ఎవరికైనా చెండు తగిలితే వారు ఔట్ అయినట్టు అవుతుంది. ఇలా చాలా సేపు చెండాటను ఆడుతారు. బట్టముక్కలతో చేసిన బంతి కనుక ఇది తలపైన తగిలినా ప్రమాదమేమీ ఉండదు. నేటి బంతులతో మాత్రం ఇది ఆడడం తగదు.
ఇలా చెండాట తో ఒకరిపైకి ఒకరు విసరడం వల్ల వారికి గురి చూసి వేసే నేర్పు అలవడుతుంది. చెండు తగలకుండా పక్కకు వెళ్లి మళ్లీ ఆ చెండును మరొకరరిపైకి విసరడం వల్ల గురిని తప్పించుకునే నేర్పు పరుగెత్తడం ఇవన్నీ కలసి పిల్లలకు మంచి వ్యాయామం చేసినట్టు అవుతుంది.
కాని ఈ ఆటను పిల్లల చేత ఎవరూ ఆడించడం లేదు. పైగా అంత స్థలమూ కూడా ఇపుడు పిల్లలకు ఉండడం లేదు. చెండ్లు కూడా లేవు కనుక ఈ ఆట మరుగున పడిపోతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనపైన ఉంది. మన గ్రామీణ ఆటలన్నీ పిల్లలకు మంచి వ్యాయామాన్నిచ్చేవే అయి ఉన్నాయి కనుక వీటిని ఇప్పటి తరానికి నేర్పించాలి. అపుడే మరో తరానికి అవి అందే వారధి ఏర్పడుతుంది.

-జంగం శ్రీనివాసులు