భెజవాడ తోక.. బందరు తలకాయ!
Published Sunday, 20 May 2018ఆంధ్రపత్రిక ప్రభ స్వతంత్ర స్రవంతి వా హిని లాంటి పత్రికల నుంచి నాకు దొరికిన ఆదరణ ప్రేమా, సన్మాన సత్కారాలన్నీ (14- 15- 16 డోర్ నెంబర్‌కే) ఇక్కడికే వచ్చి పిలిచాయి.
ఈ పేట తరువాత ఇస్లాంపేట ఆనక అది దాటితే తారాపేట - ఈ మూడు దాటితేనే మా ఘనత వహించిన గాంధీజీ హైస్కూలు. దాని తరువాత పెద్ద పోస్ట్ఫాసు నాటి మునిసిపల్ ఆఫీసు.
నిన్ను ఇంటర్వ్యూ చేస్తానయితే అన్నాడు - ‘కాదు ఆగు టైముంది’
రైలుస్టేషన్‌లో లైసెన్స్ కూలీలు రైలు వచ్చినా - పులి బోను ఆట ఆడుతున్నారు చూడు - వాళ్లు కాసిన్ని పైసలిచ్చి బెత్తయిమిచ్చిన సాధారణ (లైసెన్స్ లేని) కూలీ కుర్రాళ్లు సామాన్లు మోస్తున్నారు బయిటికీ.. అదే, పారు (తమిళ్‌లో చూడు) - వాళ్లతో మాట్లాడు.. చెప్పాను. వాళ్లు చాల రిచ్ అన్నాను. వాళ్ల పోర్టర్ల సంఘం స్ట్రాంగ్ - రైలుస్టేషను బ్రిడ్జికి - వన్ టౌన్ వేపు కొండలో దొలిచి కట్టిన ఆంజనేయ స్వామి గుడి వుంది చందాలు వేసుకుని - జీర్ణోద్ధారణ చేస్తున్నారు బ్రదర్..
నా ఇంటర్వ్యూ హిందూలో వేశాడు కాని - మా రాధాకృష్ణ గారికి వొళ్లు మండిపోయిందిట - అప్పుడాయన మద్రాసులోనే వుండేవాడు కాని ఆ రోజు ఇక్కడ ఉన్నాడట. - ఆయనే తరువాత కొన్ని రోజులకి ఈ సంగతి చెప్పాడు. ‘మన పత్రిక పేరు రాయలేదేమి?’ అన్నాడు. ‘రాసేడేమో? అక్కడ డెస్క్ దగ్గర ఎత్తేసి ఉంటారు - మనకీ అది అలవాటేగా. ఓ ఆంగ్ల పత్రిక అంటాము కదా అన్నాను - నవ్వేడాయన.. అది నవ్వా?.. కాదు.
ప్రస్తుతానికిది అప్రస్తుత ప్రసంగం - ఒక కామా;
- వీధి వీధికి ఓ సెక్స్ డాక్టరు బోర్డు ఉంది విజయవాడలో అన్నాడు - పడక మంచములు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డులు ఎన్నో చూడు - ఈ వూరు నిద్రపోని నగరం అన్నాడు రా.ప్ర. నాకు చివుక్కుమనిపించింది - అదంతా ఫ్లోటింగు పాపులేషన్, మేము చాల హేల్దీ అని కోపంగా కృష్ణ నీళ్లు చాల హేల్ దీ - అదే నెక్స్ట్ స్టోరీ చేశాడు - ఈ కథే.
వన్ టవున్ అసలు బెజవాడ; ‘బెట్టర్ కవర్ ఇట్’ అని చెప్పేను. మా ఆఫీసు నుంచి ఫోను చేశాను - రూముకి పోయి (రాజేంద్రప్రసాద్) జిల్లా కలెక్టర్‌కి బందరు - ఫోను చేసాడుట - విజయవాడలో వున్న పెద్ద కచేరీ తాలూకా ఆఫీసే.. - సబ్ కలెక్టరు కార్యాలయం మరొకటి అంతే. అదే రాశాడు హిందూ స్పెషల్ రిపోర్టరు. నేను వుడుక్కుంటే తప్పు లేదు కాని ‘్ఫక్ట్’ అదే - విజయవాడ ఒక తోక అయితే బందరు అనే తలకాయని ఆడించేది ఈ తోకే అన్నాడోసారి - జిల్లా పరిషత్ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావుగారు ‘అగ్రీడ్’ అన్నాను.
ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. ఫీచర్ ఒక్కటి మా వూరు మీద రాయాలి అనుకున్నాను - వెనక్కి బాల్యంలోకి వెళ్లిపోయింది నా గుండె చప్పుడు - ఇంఛిపేటలోని బావి పంపులు - దగ్గరికి వెళ్లింది మనసు - అప్పుడు ‘చెయ్యి -రిక్షాలే (లాగుడు) గాని సైకిలు రిక్షాలు రాలేదు - అంచేత ఇంక జట్కా ఎక్కాల్సిందే. మా అమ్మకి - మామ్మకి కూడా మనిషిని మనిషి మొయ్యడం ఏమిటి? అధర్మం. మేము రిక్షా ఎక్కం అనేవారు - జటకా బండి - గుర్రంలాగే పెద్ద చక్రాల బండి - వాటిని తోలేది ఎక్కువమంది సాయిబులే - మహమ్మదీయులు ముసల్మాన్లు. ముస్లింలు - తురకోళ్లు (ఇది హైదరాబాదు మాట మా పని అమ్మాయి బుచ్చమ్మ నిజాం మనిషి) లాంటి మాటలకన్నా సాయిబులు అన్న మాట మాకు అలవాటు - మా పేటలో అందరూ మమ్మల్ని బొమ్మనా -బ్రహ్మిన్స్ అన్నమాట అనేవాళ్లు - నాన్నగారిని మాత్రం -ఇస్వనాదం మహారాజ్ అని సంబోధించేవాళ్లు. మహారాజ్ అన్నది గౌరవ సూచకం. మా పెద్దమామయ్య సిమెంటు కంపెనీ యార్డ్ సూపరింటెండెంట్ - వైఎస్ సాబ్ అనేవాళ్లు అతన్ని - పీవిఎస్ అనేవారు అతని బాసులు. వాళ్ల ఏకైక చెల్లెమ్మకి అంటే మా అమ్మకి పెద్దన్నయ్య అంటే దేముడే. ఆయన ముందుగా వచ్చేడు వైజాగ్‌లో బాంబులు పడ్డప్పుడు - మా నాన్నగారి ఆఫీసుకి బాసులయిన ఆంధ్ర ఇంజనీరింగు కంపెనీ వాళ్లు - ముందుగా అనకాపల్లికి ఎత్తేసారుట. ఆనక, బెజవాడ.. మా మామయ్య ముందుగా దిగినది సిమెంటు ఫ్యాక్టరీకి దగ్గరలో వున్న కంసాలిపేట. అదో చిత్రం ఖాళీ ఏరియా నాడు. నేడు జాగా కొనలేరు మీరు. అదే రాజరాజేశ్వరీ పేట అయింది మా చిన్నప్పుడే - మమ్మల్ని - అమ్మ తమ్ముడు నేను అన్నమాట - మాటలే గాని అక్షరం ముక్కలకి ఇంకా టైము రాలేదు. మమ్మల్ని అక్కడ దింపాడు మా పెద్ద మామయ్య. పెద్ద ఇల్లు ఏడడుగుల ఎత్తున - కట్టారు - లేదా బుడమేరు మ్రింగేస్తుంది. అదీ సంగతి.
(ఇంకా బోలెడుంది)