ఆదర్శ బాలలం
Published Tuesday, 22 May 2018గబగబా మనమూ ఎదిగేద్దాం
ఎదుగుతు పనులూ చేసేద్దాం
విరివిగా ఆటలు ఆడేద్దాం
సొగసుగ పాటలు పాడేద్దాం!
విద్యలు ఎన్నో నేరుద్దాం
విలువల నెపుడూ పాటిద్దాం!
ఉన్నత లక్ష్యం చేరేద్దాం
ఉజ్వల భవితను పొందేద్దాం!
అమ్మా నాన్నను గెలిపిద్దాం
అడిగినవిచ్చి పూజిద్దాం
అందరి మెప్పు పొందేద్దాం
ఆనందంగా బ్రతికేద్దాం!