S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కన్నీరుమున్నీరుగా (తెలుగు జాతీయాలు)

కంటి నుండి బాధ కలిగినప్పుడు దుఃఖం సంభవించినప్పుడు వచ్చే నీటిని కన్నీరంటారు. మున్నీరంటే సముద్రపునీరు. ఈ రెంటి నీటి లోపలా ఒకే గుణమున్నది. కన్నీటిలోను ఉప్పు ఉంటుంది. మున్నీటిలో ఉప్పు ఉంటుంది. అయితే మున్నీరు అపార పరీవారము అంటే ఎక్కువ ‘‘ ఆమె తన భర్త చనిపోతే కన్నీరుమున్నీరుగా ఏడ్చింది’’ అని అంటే ఎక్కువగా దుఃఖించిందని, ఎడతెరపి లేకుండా దుఃఖించిందని అర్థము.
కంకణము కట్టుకొను:
ప్రతిజ్ఞపూను అని అర్థము.
కంకణము పవిత్రమైన సూత్రాలతో తయారుచేయబడుతుంది. దానికి మధ్య మామిడాకు మడిచి కడతారు. అది పూజా కార్యాలయాల్లో, పెళ్లి సందర్భాల్లో, పూజలు జరిగేటప్పుడు ఈ కంకణాలు కట్టడం ఆచారం. ఇది పుణ్యాచారము. దేవతార్చన కార్యక్రమాల్లో ఈ కంకణధారణ జరుగుతుంది. ఈ కంకణ ధారణ ఒక పవిత్ర భావన నిర్మాణానికి, ఒక పవిత్ర కట్టుబాటుకు, ఒక పరిపూర్ణ కార్యాచరణకు ఒక ప్రత్యేక నిర్ణయానికి సంబంధించి ఉంటుంది. ఇంతేకాక యజ్ఞ సమయాలలో కంకణధారణ చేస్తారు. పెళ్లి కార్యాల్లో కూడా ప్రత్యేక శ్రావణ పౌర్ణమినాడు అక్కలు, చెల్లెలు అన్నదమ్ములకు కంకణధారణ చేస్తారు. దీనే్న రాఖీ కట్టడమంటారు. ఈ రాఖీ బంధం, అన్నాచెల్లెళ్ల, అక్కాతముళ్ల బంధం, అక్కలకోసం, చెల్లెల్ల కోసం ఎంతో సాహసం చేస్తారు, రక్షిస్తారు. హిందూ స్ర్తీలు ముస్లిం సోదరులకు రాఖీ కడితే వారు యుద్ధరంగాల్లో ధైర్యంతో పోరాడి పరరాజులనోడించిందీ రాఖీయే.

-యం.వి.నర్సింహారెడ్డి