S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శే్వత కోకిల

శ్రీమతి శే్వతప్రసాద్ గొప్ప గాయని, సంగీత విద్వాంసురాలు. సాక్షాత్తు ‘రక్తకన్నీరు’ నాగభూషణంగారి మనుమరాలు ఈవిడ. దేశ విదేశాలు పర్యటించి, ఎన్నో గానకచేరీలు ఇచ్చారు. వీరి భర్త రేణుకాప్రసాద్ కూడా గొప్ప సంగీత విద్వాంసులు. మృదంగం వాయిస్తారు. నట్టువాంగానికి ఎంతో పేరు తెచ్చుకున్నారు.
శే్వత మంచి గాయని. తీయని కంఠం, మంచి మనస్సు, తేనెలొలుకు పలుకులు, మనస్సు సున్నితంగల గొప్ప కళాకారిణి. నిండుకుండ తొణకదు అని, వినమ్రంగా ఉంటారీవిడ. వీరి అమ్మాయి ప్రసిద్ధకి వయొలిన్, సంగీతం నేర్పిస్తున్నారు. ఒకవైపు గృహిణిగా, తల్లిగా వ్యక్తిగతంగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు కళలకు ఎంతో సేవ చేస్తున్నారు శే్వత.
బాల్యం: శే్వతప్రసాద్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. నాలుగు సంవత్సరాల చిన్న వయస్సులోనే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు నేతి శ్రీరామశర్మ గారి వద్ద 14 సంవత్సరాల పాటు సంగీతం నేర్చుకున్నారు. అలాగే డా.శ్రీమతి పంతుల రమగారి వద్ద కూడా నేర్చుకున్నారు.
గౌరవాలు: శే్వత అన్నమాచార్య భావనా వాహిని వారు నిర్వహించిన జాతీయ పోటీలలో, బంగారు పతకం గ్రహించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిస్టింక్షన్‌తో సంగీతం డిప్లొమా చేశారు. తరువాత తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. కర్ణాటక సంగీతం చేశారు. వీరికి హనుమాన్‌పేట వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ ‘గానకోకిల’ బిరుదు ఇచ్చి సన్మానం చేశారు. అలాగే గానముకుంద ప్రియ సభ - చెన్నై ‘గానామృత సాగర’ బిరుదునిచ్చారు.
వీరు ఆలిండియా రేడియోలో ‘ఎ’ గ్రేడ్ కళాకారిణి. కర్ణాటక శాస్ర్తియ సంగీత లలిత సంగీతం రెంటిలో నిష్ణాతులు.
ప్రదర్శనలు: శ్రీ తాళ్లపాక 600 జయంతి ఉత్సవాలలో ఎస్‌ఐసిఎ, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ఇంకా శ్రీకృష్ణ గానసభ - చెన్నై ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో ఆడియో కేసెట్లు, సీడీలు రికార్డు చేశారు. అందులో కొన్ని అన్నమాచార్య కృతులు, భగవద్గీత, లలితా సహస్ర నామం, లక్ష్మీసహస్ర నామం, భామాకలాపం మొదలగు ఎన్నో రికార్డులు చేశారు. భరతనాట్యం, కూచిపూడి, విలాసినీ నాట్యం ప్రదర్శనలకు గాత్ర సహకారం అందించారు. నాదనీరాజనం - తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్‌విబిసి ఛానెల్‌లో ప్రదర్శించారు. నంగనల్లూరు త్యాగబ్రహ్మ సంగీత సమాజం, చెన్నై ఆధ్వర్యంలో ప్రదర్శించారు.
ప్ర: మీరు ఎంతోమంది గొప్ప కళాకారులకు గాత్ర సహకారం అందించారు.
జ: నేను దాదాపు పాతిక సంవత్సరాల నుండీ ప్రదర్శనలు ఇస్తున్నాను. పద్మశ్రీ డా.శోభానాయుడు, పద్మశ్రీ శోభన, పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనందాశంకర్ జయంత్, పద్మశ్రీ జయ రామారావు వనశ్రీ, డా.శ్రీమతి అలేఖ్య పుంజాల, శ్రీమతి పూర్వ ధనశ్రీ, శ్రీమతి దీపికారెడ్డి మొదలగు ఎంతోమంది నృత్య ప్రదర్శనలకు గాత్ర సహకారం ఇచ్చాను.
ప్ర: ఏయే దేశాల్లో పర్యటించారు?
జ: నేను ప్రతి సంవత్సరం యుఎస్ వెళ్తాను. చైనా, జపాన్, మలేసియా, బ్యాంకాక్, టర్కీ, స్వీడన్, సిరియా మొదలగు ఎన్నో దేశాలలో కళాసేవ చేశాను. 2000 పైగా ప్రదర్శనలు ఇచ్చాను. 200 పైగా అరంగేట్రాలకు పాడాను. ఎన్నో బాలేలకు సంగీతం కొరియోగ్రఫీ, రూపకల్పన చేశాను.
ప్ర: ప్రావీణ్య అకాడెమీ గురించి చెప్పండి.
జ: నేను, మా వారు రేణుకాప్రసాద్ గారు ప్రావీణ్య అకాడెమీ కళల కోసం స్థాపించాం. ఇక్కడ సంగీతం నేర్పుతాం. వర్క్‌షాప్స్ నిర్వహిస్తాం. కళలు నేర్చుకుంటే, నేర్పితే ప్రపంచం ఎంతో సుందరంగా, ఆనందంగా, అందంగా ఉంటుంది అని ఇక్కడ భావన. సంగీతం, కళలు నేర్చుకుంటే మంచి మనుషులవుతారు. ఉన్నతమైన భావాలు సొంతం చేసుకుంటారు. అందుకే సంపూర్ణ వికాసం, సమగ్రమైన మనిషిగా అవడానికి ఇక్కడ శిక్షణ ఇస్తాము.
ప్ర: మీ అభిరుచులేంటి?
జ: నాకు వంట చేయడమంటే చాలా ఇష్టం.
ప్ర: మీకు బాగా గుర్తుండిపోయిన ప్రదర్శనలు ఏవి?
జ: రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ప్రతి ప్రదర్శన గుర్తుండిపోయిందే. అన్నీ మధురస్మృతులే. ప్రఖ్యాత నర్తకి ఆనందశంకర్ జయంత్‌గారు ఢిల్లీలో రాష్టప్రతి భవన్‌లో ప్రదర్శన ఇచ్చారు. నేను అప్పుడు అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం గారి ముందు పాడటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
అలాగే బాంబేలో (నేడు ముంబై) నటి, ప్రఖ్యాత నర్తకి పద్మశ్రీ శోభనగారితో ప్రదర్శనకి గాత్ర సహకారం అందించాను. అది కూడా మంచి మధురస్మృతి.
ప్ర: కళాకారిణిగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
జ: ఏ రంగంలోనయినా ఇబ్బందులు ఉంటాయి. కష్టపతి, ప్రతిభతో రాణించాలి. కళాసేవ చేస్తూ వ్యక్తిగతంగా ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇది ఏ స్ర్తికయినా, బాలెన్స్‌డ్‌గా ఇంటాబయటా సమతులన చేసుకోవాలి. మా వారు కూడా కళాకారులు కాబట్టి నన్ను చాలా అర్థం చేసుకున్నారు.
ప్ర: మిమ్మల్ని ప్రోత్సహించినవారెవరు?
జ: చిన్నప్పుడు మా అమ్మానాన్న ఎంతో ప్రోత్సహించారు. నేను కష్టపడి నా ప్రతిభతో పైకి వచ్చాను.
ప్ర: సంప్రదాయ కళలకు పాపులారిటీ తగ్గుతోంది. మరి ఎలా రాణించడం?
జ: సినిమాలు, టీవీ, మీడియాకు ఎంతో బాధ్యత ఉంది. భక్తి ఛానెల్, ఎస్‌విబిసి లాంటి కొన్ని టీవీ ఛానల్స్ కళలకు చాలా ప్రాముఖ్యత నిస్తారు. నాదనీరాజనం వంటి ప్రోగ్రామ్స్ పెట్టి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇలాంటివి ఇంకా రావాలి. అప్పుడే కళలకు, కళాకారులకు ఉత్సాహంగా ప్రోత్సాహకంగా ఉంటుంది.
ప్ర: ఎలా అభ్యాసం చేసేవారు?
జ: చిన్నప్పుడు రోజూ నాలుగు లేదా అయిదు గంటలు అభ్యాసం (ప్రాక్టీస్) చేసేదాన్ని. ఒక్కోసారి రోజంతా అభ్యాసం. ఇప్పుడు కూడా, నేను మా వారు కలిసి అభ్యాసం చేస్తాము.
ప్ర: కళాకారులకు మీరిచ్చే సందేశం?
జ: కళని నమ్ముకొని, కష్టపడితే ఏ కళలోనైనా పైకి వస్తాము. అభ్యాసం, కృషి, ప్రతిభ, వ్యుత్పత్తి ఉండాలి. హోంవర్క్, హార్డ్‌వర్క్ నమ్ముకోవాలి. కష్టపడి పైకి రావాలి.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి