S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోధుమతో గొప్ప ప్రయోజనాలు

ప్రశ్న: గోధుమల గురించి వివరాలు తెలియజేయండి సార్.
జ: ప్రపంచ మానవులు అత్యధికంగా తీసుకునే ఆహార ధాన్యం గోధుమలు. తక్కిన ధాన్యంతో పోల్చినప్పుడు అనేక విలక్షణత లున్నాయి. గోధుమలు మనుషులకు తిండి పెట్టడానికే పుట్టాయి. మనిషి వౌలికంగా మాంసాహారి. కేవల మాంసాహారిగా జీవితాన్ని ప్రారంభించి, తిండి గింజల్ని, పప్పు గింజల్నీ, కూరగాయల్నీ తినటం నేర్చుకుని శాకాహారిగా మారడానికి అతనికి ఎక్కువగా సహకరించినవి గోధుమలే! సమస్త జీవరాశులనూ మాంసాహారుల చేతుల్లో చావు నుండి కొంతైనా తప్పించటానికి గోధుమలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు అందించింది ప్రకృతి.
గోధుమ ఉత్తర భారతీయులకూ, వరి బియ్యం దక్షిణాది వారికీ ధారాదత్తం అయినట్టు ఒక అభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది. 15-16 శతాబ్దాల నాటి దక్షిణాదిలోని ఆయుర్వేద వైద్యులు వ్రాసిన గ్రంథాలలో కూడా గోధుమ వంటకాల గురించి గొప్ప సమాచారం ఉంది. సింధూ నాగరికతా కాలంలో సమాంతరంగా తెలుగు నేలపైన జీవించిన మనుషులు గోధుమలను కూడా పండించుకున్నారని వృక్ష పురావస్తు శాస్తవ్రేత్తలు చెప్తారు.
గోధుమ పేరు తలచుకోగానే, రోటీ, చపాతీ, పూరీలు గుర్తుకొస్తాయి. ఇంకొంచెం లోతుగా వెళితే, పాష్టాలు, క్రాకర్లు, కేకులు, బిస్కత్తులు, బ్రెడ్డులూ కళ్లలో మెదలుతాయి. గోధుమలు గుండె జబ్బుల్లో ఉత్తమ ఆహారంగా శాస్తవ్రేత్తలు చెప్తారు. కానీ, గోధుమలతో తయారయ్యే ఆహార పదార్థాలు గుండెని మండించేవిగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే! అలాంటివి బజార్లో దొరుకుతాయేమోనని వెదక్కండి. ఆరోగ్యాన్ని డబ్బు పోసి మార్కెట్‌లో కొనాలని చూసే ఆలోచనా విధానం వల్లనే మామూలు రోగాలు కూడా దీర్ఘరోగాలుగా మారిపోతున్నాయి.
గోధుమల్ని పోషకాల పునాది foundation of nourishment అంటారు. రిఫైన్డ్ గోధుమపిండికన్నా గోధుమలను మరాడించిన పూర్తి గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గటానికి మనం స్వంతంగా మరపట్టించుకున్న గోధుమ పిండి whole grain wheat నే వాఢుకోవాలని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. షుగరు వ్యాధి అదుపు కూడా దీనివలన సాధ్యమవుతుంది. గాల్‌స్టోన్స్ వ్యాధిలో కూడా వరి అన్నం కన్నా పూర్తి గోధుమ పిండిని వాడుకోవటం వలన ఎక్కువ మేలు కలుగుతుంది.
రోజుకు 3 కప్పుల పూర్తి గోధుమ పిండి whole grain wheat ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. ఆమేరకు వరి తినటం తగ్గిపోతుంది. గ్యాసు, ఉబ్బరం లాంటి జీర్ణకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి. శారీరక శ్రమ తగ్గిపోయిన నేటి కాలమాన పరిస్థితుల్లో వరికన్నా గోధుమ పిండికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం అవసరమే!
గోధుమపిండి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచి రొమ్ము కేన్సర్ లాంటి వ్యాధులు రాకుండా సహకరిస్తుంది. పిల్లల్లో ఉబ్బస వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్లకు వరిని తగ్గించి గోధుమ పెట్టి చూడండి. వ్యక్తిగతంగా గోధుమ సరిపడే వారికి ఉబ్బస తీవ్రత త్వరగా తగ్గుతుంది. మెనోపాజ్ వయసులోకి వచ్చిన ఆడవాళ్లు తప్పనిసరిగా గోధుమ తినటానికి అలవాటు పడటం మంచిదని శాస్తవ్రేత్తల సూచన. కీళ్లవాతం, గౌట్, మోకాళ్లనొప్పులు, నడుము నొప్పి వ్యాధుల్లో కూడా గోధుమ పిండి పదార్థాలే మేలు చేసేవిగా ఉంటాయి.
అయితే గోధుమల్లో ఉండే గ్లూటెన్ పదార్థం చాలామందికి సరిపడక అనేక జీర్ణకోశ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అలాంటి వారు తప్ప అందరికీ, అన్ని వయసుల వారికీ, అన్ని వ్యాధుల వారికీ గోధుమలు అనుకూలంగా పనిచేస్తాయి. మైదాతో కాకుండా పూర్తి గోధుమపిండితో చేసిన వంటకాలు ఆరోగ్యదాయకం.
గోధుమల్లో చాలా రకాలున్నప్పటికీ, మనకు దొరుకుతున్న వాటిలో రవ్వ గోధుమలూ, పిండి గోధుమలూ ముఖ్యమైనవి. పిండి గోధుమల వాడకం మనకు ఎక్కువ. వీటిలో పిండి పదార్థాల పాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రోజువారీ వాడకానికి పిండి గోధుమనే వాడుతుంటారు. రవ్వ గోధుమలు గట్టిగా ఉంటాయి. తక్కువ పిండి ఉంటుంది. అందుకని వాణిజ్య పరంగా రవ్వ కోసం తప్ప ఇతర అవసరాలకు ఈ గోధుమలను వాడటం అరుదు. రవ్వ గోధుమలు ఖరీదైనవి కావటం కూడా ఇందుకు ఒక కారణం.
రవ్వ గోధుమల్ని ‘దురుం గోధుమలు’ అనీ, మకరోనీ గోధుమలనీ పిలుస్తుంటారు. ట్రిటికం దురమ్ అనేది దీని వృక్ష నామం. దురుమ్ అంటే లాటిన్ భాషలో గట్టిగా ఉండటం అని అర్థం. చాలా ప్రాచీనమైన పంట ఇది. పిండి గోధుమలకన్నా ఈ గోధుమల్లో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. గ్లుటెన్ పదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి, షుగరు వ్యాధిలోనూ, స్థూలకాయంలోనూ పిండి గోధుమలకన్నా రవ్వ గోధుమలు ఎక్కువ మేలు చేస్తాయ.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com