S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతి వికృతుల సందర్శనమే విశ్వరూప దర్శనం

‘దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం’ అని అంటాడు అర్జునుడు- కృష్ణుడితో విశ్వరూప దర్శన సందర్భంలో. అంటే, సౌమ్యమైన, సాత్వికమైన మానుష రూపానే్న మన మానవ మనస్సు అంగీకరించ గలుగుతుందే తప్ప తామసిక వికృత మానవ రూపాన్ని మన మనస్సు చూడ ఇచ్ఛగించదు. అందుకే దేవ దానవుల ఎరుకకు రాని ఆది స్థితికి ఆకరమైన పురుషోత్తముడైన ఆ కృష్ణుడి విశ్వరూపాన్ని సైతం అర్జునుడు సౌమ్య రూపంలో దర్శించగలిగాడే తప్ప మరో కోణంలో విశ్వరూప వికృత పురుషోత్తమ రూపాన్ని చూడలేక పోయాడు. ఆ వికృతిని భరించలేకపోయాడు.
* * *
విశ్వరూప దర్శనంతో ప్రకృతి, వికృతులను సమాదరించగలిగేది ఒక్క గిక సాధనతోనే. గికవైన అంతఃకరణ ద్వంద్వాతీతంగా ఉంటుంది. కాబట్టి ఆ అంతఃకరణ ముందు ప్రకృతి వికృతుల రూపం అదృశ్యమై విరాట్ తత్వం అంది వస్తుంది. అంటే, ద్వంద్వాల మధ్య మన మనస్సు ఊగిసలాడుతున్నంత కాలం మన దర్శనలు విశ్వరూపానికే పరిమితాలు. ద్వంద్వాతీతం కాగలిగితేనే కాలాతీతంగా విరాట్ తత్వం గిక ప్రజ్ఞగా పరిఢవిల్లేది.
ఒక వంచి ఆకారాన్ని మన అంతఃకరణం ఎటువంటి ఆక్షేపణలు లేకుండా అంగీకరించ గలుగుతుంది. అయితే వికృత రూపం అంతఃకరణాన్ని భయం గుప్పిట్లోకి జారవిడుస్తుంది. వికృతత్వం, అధైర్యాన్ని, అశాంతిని మూటగడ్తుంది. అర్జునుడికి దక్కిన ‘విశ్వరూప దర్శనం’ మనకు ఈ ప్రకృతి వికృతుల ఆంతర్యాన్ని సుస్పష్టం చేస్తుంటుంది.
విశ్వరూప దర్శనం, విరాట్‌తత్వ అనుగ్రహం మనకు లభించేది భగవద్గీతలోని ఏకాదశోధ్యాయమైన ‘విశ్వరూప సందర్శన యోగం’లోనే అయినా పదవ అధ్యాయమైన ‘విభూతియోగం’లో విశ్వాత్మ విభూతులను గురించి విస్తారంగా వివరించటం జరిగింది. ఈ విభూతులలో చాలామటుకు ఆదరణీయ ప్రకృతి అంశలే అర్జునుడి పాంచభౌతిక నేత్రాల ముందు నిలిచిపోయాయి.
అందుకే అర్జునుడు ఆమూలాగ్ర విశ్వరూప దర్శనాన్ని ఆకాంక్షిస్తాడు.
పదవ అధ్యాయం నలభయ్యవ శ్లోకంలో - విశ్వాత్మ అయిన పురుషోత్తముడు -
‘నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం’ - తన దివ్య విభూతులకు అంతం లేదని,
‘యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవమ్’
సృష్టించబడిన ప్రతి అంశ శోభ, శక్తి తన తేజస్సే అని.
‘యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమ్’ అన్ని ప్రాణుల సృష్టి బీజం తానేనని - ఆ పురుషోత్తముడు సెలవిచ్చిన తర్వాత అర్జునుడి ఆర్తి అంతా ఆ విశ్వరూపాన్ని త్వరగా, సమగ్రంగా దర్శించాలనే!
ఇంతకీ ఆ విశ్వ విభూతులు ఎటువంటివి అంటే -
‘వౌనం చైవాస్మి గుహ్యానాం’ - గుహ్యతలోని వౌనం
‘జ్ఞానం జ్ఞానవతాం’ - జ్ఞానులలోని జ్ఞానం
‘నీతి రస్మి జిగీషతామ్’ - విజయులలోని నీతి
‘తేజస్తే జస్వినా మహమ్’ - తేజస్వంతులలోని తేజస్సు
‘సత్వం సత్వవతామ్’ - సత్వ గుణంలోని సాత్వికత
‘అక్షరాణా మకారో’ - అక్షరాలలోని అకారం
‘అక్షయః కాలో’ - క్షీణం కాని కాలం
‘అధ్యాత్మ విద్యా విద్యానాం’ - విద్యలలోని అధ్యాత్మ విద్య
‘వాదః ప్రవదతాం’ - ప్రవక్తల వాద పటిమ
‘సర్గాణా మాది రంతశ్చ మధ్యం’ - సృష్టి ఆది, అంత, మధ్యాలు
‘పవనః పవతామ్’ - పవిత్రపరిచే వాయువు
‘్ధనూ నామ్ కామధున్’ - పశువులలో కామధేనువు
‘మేరుశ్శిఖరిణామ్’ - పర్వత శ్రేణిలో మేరువు
‘ఇంద్రియాణాం మనః’ - ఇంద్రియాలలోని మనస్సు
‘్భతానామ్ చేతనా’ - ప్రాణులలోని చైతన్యం
‘అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ’
సకల ప్రాణుల ఆత్మ, ఆ ప్రాణికోటి ఆదిమధ్యమ అంతాలు-
‘నేనే’ అని ఆ పురుషోత్తముడు సవివరంగా చెప్పిన తర్వాత అర్జునుడికి మిగిలింది ఆ విశ్వరూప దర్శనమే!
యాదవ వంశజుడైన వసుదేవ సుతుడు, పాండవ మధ్యముడైన అర్జునుడు, మునిశ్రేష్ఠులలోని వ్యాసమహర్షి, సిద్ధులలోని కపిలుడు, మహర్షులలోని భృగువు, భూత భవిష్య వర్తమాన కాల దర్శులలోని శుక్రాచార్యుడు, ఆయుధధారియైన పృథ్వీపతి శ్రీరాముడు, పితృదేవతలలోని అర్యముడు, నాగులలోని అనంతుడు, దేవర్షులలోని నారదుడు, గంధర్వులలోని చిత్రరథుడు, రుద్రులలోని శంకరుడు, యక్షులలోని కుబేరుడు, దేవతలలోని ఇంద్రుడు, అదితి సంతానమైన విష్ణువు, ఖగోళంలోని సూర్యుడు, నక్షత్ర మండలంలోని చంద్రుడు - ఆ విశ్వవిభుని విభూతులే!
కాబట్టే, ‘స్వయమేవాత్మ నాత్మానం వేత్థత్వం పురుషోత్తమ’ అంటూ అర్జున ప్రశంసలను అందుకుంటాడు ఆ కృష్ణుడు. మొత్తానికి, విశ్వసృష్టికి ఉపాదానం ఈ విశ్వాత్మనే అని, సృష్టి సర్వం విశ్వాత్మ వల్లనే చైతన్యమవుతోందని, విశ్వాత్మ మహాశక్తిని ఎరుకకు తెచ్చుకుని ఆత్మనిష్ఠతో సంపన్నం కావటమే గికం అని అర్జనుడు గ్రహిస్తాడు.
అర్జున గ్రహణాన్ని గ్రహించిన ఆ పురుషోత్తముడు విశ్వరూప దర్శనానికి కావలసిన దివ్యనేత్రాన్ని అనుగ్రహించి తన విశ్వత్వంలోని ఒక కోణంలో ఆదిత్యుల్ని వస్తువుల్ని, రుద్రుల్ని, అశ్వినీ దేవతల్ని, మరుద్దేవతల్నీ చూపి ఇతర కోణాలలోని తన విశ్వ విభూతులను చూప సమాయత్తమవుతాడు. కృష్ణుడి విశ్వరూపంలో వేయి సూర్యుల తేజస్సును, ఆది మధ్య అంతాలు లేని విరాడ్రూపాన్ని చూసిన అర్జునుడికి నోట మాట లేకుండా పోయింది. సృష్టి స్థితి లయ కారక సంగమాన్ని కృష్ణత్వంలో చూసిన అర్జునుడు ఆ విశ్వాత్మను అవినాశి, పరబ్రహ్మ, సర్వాతీత ఆశ్రమం, సనాతన పురుషోత్తమత్వంగా త్రికరణశుద్ధిగా విశ్వసిస్తాడు.
‘త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్
త్వమవ్యయ శ్శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతోమే’
విశ్వరూప దర్శనంలో ఈ ప్రకృతి కోణమైన, సాత్విక రూపం అర్జునుడ్ని అబ్బురపరచింది. ఆకర్షింపచేసింది. అంగీకృతమైంది. అయితే మరో కోణమైన వికృత తామసిక రూపం అదే అర్జునుడ్ని భయకంపితుడ్ని చేసింది-

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946