S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉత్తర వాయవ్య దోషం -- వాస్తు

అంజలీదేవి (ఆత్మకూరు)
ప్రశ్న: మా ఇంట్లో వివాహాలు వాయిదా పడుతున్నాయి. దీనికి పరిష్కారం?
జ: మీ ఇంటికి సంబంధించి ఉత్తర వాయవ్య దోషాలు కలవు. అందువల్లనే శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. మొదటిగా వాయవ్యంలోగల సెప్టిక్ ట్యాంకును తీసివేసి ఉత్తర మధ్యభాగంలోకి మార్చుకోండి. అంతా శుభం జరుగుతుంది.
రామారావు (ఒంగోలు)
ప్రశ్న: మేం కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. కానీ ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగడం లేదు. కారణం తెలీడంలేదు.
జ: మీ వ్యాపార సంస్థకు ఉత్తర వాయవ్యం పెరిగింది. అలాగే పశ్చిమ నైరుతిలో వీధి పోటు కూడా ఉన్నది. అందువల్లనే ఇలా జరుగుతున్నది. దీనికి సంబంధించి పెరిగిన ఉత్తర వాయవ్యాన్ని వేరు చేయండి. అలాగే పశ్చిమ నైరుతి వీధిపోటుకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులున్నాయి.
చలపతిరావు (చదలవాడ)
ప్రశ్న: మేము కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్ కిందనే సెప్టిక్ ట్యాంకు, వాటర్ సంప్ వస్తున్నాయి. అలా వుండవచ్చా? ఉంటే ఏమైనా దోషమా?
జ: స్లాబ్‌ల కింద అలానే మెట్ల కింద ఇంటి లోపల ఇలా గుంటలు ఉండటం చాలా పెద్ద దోషం అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో స్లాబ్ కిందగల గుంటలను పూడ్చివేసి స్లాబ్ కిందకు రాకుండా కొత్తవి ఏర్పాటు చేసుకోండి. మంచి జరుగుతుంది.
లహరి (మంగపేట)
ప్రశ్న: ఒకసారి శంకుస్థాపన చేసిన ఎన్ని రోజులలోపు ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి? దీనికి ఏమైనా నియమాలు పాటించాలా?
జ: శంకుస్థాపన చేసిన రెండవ రోజున ద్వితీయ విఘ్నం లేకుండా ఏదో ఒక పని స్థలంలో చేయించాలి. అదే విధంగా శంకుస్థాపన అయిన 21 రోజుల లోపల కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి. అలా నిర్మాణం మొదలు కాకపోతే తిరిగి మరలా శంకుస్థాపన చేయవలసి ఉంటుంది. చాలామంది చేస్తున్న తప్పు మంచి ముహూర్తాలు ఉండటం లేదు అని శంకుస్థాపన చేసి తర్వాత ఎప్పటికో నిర్మాణం మొదలుపెడతారు. దీనివల్ల ఆ ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోతుంది. ఇది చాలా తప్పు. అలా చేయకూడదు.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28