S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బరోడా సాధువు

ఒక సాధువు వీధంట వెళుతున్నాడు. అది రాత్రి. ఒక పోలీసు ఆ సన్యాసిని చూసి ‘ఇంత చీకట్లో వెళుతున్నావు. ఎవరు నువ్వు? దొంగవా?’ అన్నాడు.
సాధువు ‘అవును. నేను దొంగనే’ అన్నాడు.
పోలీసు ఆ సాధువును తీసుకెళ్లి జైల్లో వేశాడు. సాధువు ఆ అనుభవాన్ని ఆనందిస్తూ రాత్రంతా గడిపాడు.
ఉదయానే్న పోలీస్ ఆఫీసర్ వచ్చి జైల్లో ఉన్న సాధువును చూసి పోలీసుతో నువ్వు అరెస్టు చేసిన వ్యక్తి సన్యాసి. దొంగ కాడు. ఎందుకని అతన్ని అరెస్టు చేసావు? అతను నాకు తెలుసు. అతను సాధుజీవి’ అన్నాడు.
పోలీసు ‘రాత్రి అతన్ని ఎవరు నువ్వు? దొంగవా? అంటే అవునన్నాడు. అందుకనే అరెస్టు చేశాను’ అన్నాడు.
ఆఫీసర్ ఆ సాధువుకు క్షమాపణ చెప్పి విడుదల చేశాడు. సాధువును ఆఫీసర్ ‘ఎందుకని మీరు నేను దొంగ అని చెప్పారు?’ అని అడిగాడు. సన్యాసి ‘అస్తిత్వం వెనక్కి వెళ్లినపుడు చైతన్యం ముందుకు రానప్పుడు ప్రపంచమే మిగుల్తుంది. ప్రపంచం దొంగల గుంపే అయినప్పుడు నేనూ దొంగనే కదా!’ అన్నాడు.

- సౌభాగ్య, 9848157909