S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

(3--6--2018 నుంచి 9--6--2018 వరకు)

(3-6-2018 నుంచి 9-6-2018 వరకు)
==========================
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమవారాల్లో అధికారిక వ్యవహారాలపై దృష్టి. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పనుల ఒత్తిడులుంటాయి. పదోన్నతుల విషయంలో నిరాశ. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాదులపై దృష్టి. సౌఖ్యాలు, సౌకర్యాలు కొంత అనుకూలం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. మంగళ బుధ గురువారాల్లో లాభాలపై దృష్టి. ఆశించిన ప్రయోజనాల విషయంలో కొంత చికాకు తప్పదు. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. సంతాన వ్యవహారాల్లో అనుకూలత. నూతన ఆలోచనలు, కొత్త రూపకల్పనలు, క్రియేటివిటీ, విద్యాత్మక వ్యవహారాలుంటాయి. శుక్ర శనివారాల్లో ఖర్చులు పెట్టుబడులుంటాయి. విందు వినోదాలపై దృష్టి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమవారాల్లో ఉన్నత వ్యవహారాలుంటాయి. సంతృప్తి లభిస్తుంది. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. పూర్వ పుణ్యం పెంచుకుంటారు. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. వ్యాపార వర్గంతో ఒత్తిడులుంటాయి. ప్రయాణాదుల్లో ఇబ్బందులు. మంగళ బుధ గురువారాల్లో అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. అధికారుల ఆదరణ, పదోన్నతుల వల్ల సంతోషం. సామాజిక గౌరవం పెరుగుతుంది. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. విద్యాత్మక వ్యవహారాల్లో జాగ్రత్త. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో లాభాలుంటాయి. పెద్దల అనుకూలత కోసం ప్రయత్నం. ప్రయోజనాలపై అతి దృష్టికూడదు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమవారాల్లో ఊహించని ఇబ్బందులు. కార్యక్రమాల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. ఆరోగ్య లోపాలుండవచ్చు. నిర్ణయాల వాయిదా. శ్రమరహిత ప్రయోజనాలపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాటల్లో చమత్కారం. నిల్వధనం పెంచుకుంటారు. మంగళ బుధ గురువారాల్లో ఉన్నత వ్యక్తుల పరిచయం. పుణ్యబలం పెంచుకునే భావాలు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. సంతృప్తితో వ్యవహరిస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. సంప్రదింపుల్లో జాగ్రత్త. అధికారుల వల్ల ఒత్తిడులకు అవకాశం. శుక్ర శనివారాల్లో వ్యాపార, వృత్తి, ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. అధికారుల వల్ల సమస్యలు. గౌరవం తగ్గే సూచనలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమవారాల్లో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, అనుబంధాల వల్ల సమస్యలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. మంగళ బుధ గురువారాల్లో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రమరహిత లాభాలపై దృష్టి వద్దు. పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో అనుకూలత. అధికారిక ధోరణులు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. నూతన వ్యవహారాలు. ఫలితానుభవంలో సంతృప్తి ఉంటుంది. కార్యనిర్వహణలో కీర్తిప్రతిష్ఠలుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమవారాల్లో పోటీలు, ఒత్తిడులుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యతిరరేక ప్రభావాలు అధికం. గుర్తింపు కోసం ప్రయత్నం. కార్యనిర్వహణలో ఒడిదుడుకులు. ఖర్చులు, పెట్టుబడులకు అనుకూలం. విహారాలు, విందులుంటాయి. ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. మంగళ బుధ గురువారాల్లో కొత్త పరిచయాలతో జాగ్రత్త. స్నేహానుబంధాల్లో ఒత్తిడులు. వ్యాపార, జీవన భాగస్వాములతో అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం. కార్యక్రమాల నిర్వహణలో తలమునకలవుతారు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. కొత్త నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. ఊహించని ఇబ్బందులు, సమస్యలు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతోషాదులు. కొత్త పనులపై దృష్టి. కార్యక్రమాల రూపకల్పన. సృజనాత్మకత. ఉత్సాహంగా ఉంటుంది. విద్యా వ్యవహారాలకు అనుకూలం. ప్రయోజనాలు ఆశించిన విధంగా ఉండవు. లాభాలపై ఎక్కువ దృష్టి వద్దు. మంగళ బుధ గురువారాల్లో పోటీలు ఒత్తిడులున్నా అధిగమిస్తారు. వ్యతిరేక ప్రభావాలను ఎదుర్కొంటారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు. ఖర్చులు పెట్టుబడుల్లో కొంత ఒత్తిడి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. విందువినోదాలపై దృష్టి. శుక్ర శనివారాల్లో పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాలతో కొంత జాగ్రత్త. అనుబంధాల్లో ఒత్తిడులుంటాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమవారాల్లో సౌకర్యాలు మెరుగుపరచుకుంటారు. గృహ వాహన వ్యవహారాల్లో అనుకూలత. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆహార విహారాలుంటాయి. విద్యాత్మక రంగంలో అనుకూలత. అధికారులతో జాగ్రత్త. పితృవర్గ సమస్యలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా శ్రమతో గౌరవం. మంగళ బుధ గురువారాల్లో మనోభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నాలు. సంతాన వ్యవహారాలపై దృష్టి. నూతన కార్యక్రమాల రూపకల్పన. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. లాభాల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రయోజన లోపాలు, శుక్ర శనివారాల్లో పోటీ రంగంలో సమస్యలు. వ్యతిరేకతలు అధికం. సామాజిక ఒత్తిడులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమవారాల్లో సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. సహకార లోపాలకు అవకాశం. సేవకవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. ఆధారపడటం తగ్గించుకోవాలి. సోదరులతో ఇబ్బందులు. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలు, ఆధ్యాత్మిక యాత్రలు, పుణ్య కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. మంగళ బుధ గురువారాల్లో సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. ముందు జాగ్రత్తలు అవసరం. గృహ వాహనాదుల్లో కొంత ఒత్తిడులు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారుల ఆదరణ, పదోన్నతి. శుక్ర శనివారాల్లో మనోభీష్టాలు నెరవేర్చుకుంటారు. కొత్త పనుల రూపకల్పన. ఆలోచనాత్మక వ్యవహారాలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమవారాల్లో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో తొందరపాటు కూడదు. వాగ్దానాల వల్ల సమస్యలు. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు. అనుకోని ప్రయోజనాలున్నా జాగ్రత్త అవసరం. ఊహించని సంఘటనలు. అప్రమత్తంగా మెలగాలి. మంగళ బుధ గురువారాల్లో సంప్రదింపుల్లో సమస్యలు. సహకార లోపాలు. సేవక వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. సోదరుల వల్ల ఒత్తిడులు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలత. సంతృప్తి. శుక్ర శనివారాల్లో సౌకర్యాలు మెరుగుపరచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమవారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనుల్లో అనుకూలత. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. ఉత్సాహంగా ఉంటుంది. విజయసాధనపై దృష్టి. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి. పరిచయాలు. అనుబంధాల్లో జాగ్రత్త వహించాలి. అందరితో అనుకూలంగా వ్యవహరించాలి. మంగళ బుధ గురువారాల్లో కుటుంబంలో ఆనందం. అందరితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక నిల్వలు పెంచే సూచనలు. మాట విలువ పెరుగుతుంది. అనుకోని సమస్యలు కొన్ని ఎదురుకావచ్చు. జాగ్రత్త. శుక్ర శనివారాల్లో సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. సహకార లోపాలకు అవకాశం. దగ్గరి ప్రయాణాల్లో ఒత్తిడులుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమవారాల్లో ఖర్చలు పెట్టుబడుల వల్ల సంతృప్తి. విహార యాత్రలకు అవకాశం. సంతోషం కోసం కాలం ధనం వెచ్చిస్తారు. దానధర్మాదుల వల్ల మరింత మేలు. వ్యతిరేక ప్రభావాలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. పోటీరంగంలో ఇబ్బందులను అధిగమించాలి. శ్రమ ఉన్నా సంతృప్తి. మంగళ బుధ గురువారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. కొత్త కార్యక్రమాల నిర్వహణ. అన్ని పనుల్లో ఉత్సాహం. కార్యనిర్వహణ వల్ల అలసిపోతారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఒత్తిడులు. శుక్ర శనివారాల్లో కుటుంబంలో ఒత్తిడులు. మాట్లాడే ధోరణిలో జాగ్రత్త. తొందరపాటు కూడదు. గౌరవం పోయే అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ వారాల్లో లాభాలు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రయోజన దృష్టి తగ్గించుకోవాలి. కొంత దానధర్మాదుల వల్ల మేలు. సంతాన వర్గంతో అనుకూలత, అభీష్టాలు నెరవేరుతాయి. కొన్ని ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మక శక్తి. మంగళ బుధ గురువారాల్లో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. కాలం ధనం వ్యర్థంగా గడిచే అవకాశం. అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. పోటీ రంగంలో గుర్తింపు. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శుక్ర శనివారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మనోల్లాసం, కార్యనిర్వహణపై ఉత్సాహం. అన్ని పనుల్లో పాల్గొంటారు.