S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉన్నతం

ఆ శుభముహూర్తం రానే వచ్చింది. నేను, నా భార్యా పిల్లలు కొత్తగా కొన్న ఫ్లాట్‌లోకి శ్రీహరి పటంతో.. పవిత గంగా సమాన తీర్థ వెండి కలశంతో మా చెల్లి వెంటరాగా గృహప్రవేశం చేశాం. అదే ముహూర్తానికి మా ఎదురు ఫ్లాట్‌లోకి లింగమూర్తిగారు కూడా దంపతీ సమేతంగా గృహప్రవేశం చేస్తున్నారు. ఆయన తెల్లపాంటు, తెల్ల షర్టులో పెదవులపై చెరగని చిరు మందహాసంతో నా వైపు చూశారు పలకరింపుగా.. నేనూ స్పందిస్తూ వారివైపు చూశాను పలకరింపుగా నవ్వు తెచ్చుకుని.. నాకంతగా కొత్త కొత్త వాళ్ళతో తొందరగా కలిసిపోవడం చాలా తక్కువ. అలవాటైన వాళ్ళతో మాత్రమే మాటామంచీనూ.
ఎదురింటి లింగమూర్తిగారు పేరుకు తగ్గట్టు శివార్చకులు. ఆట్టే పూజ, పునస్కారాదులు చేయరుగాని భోళాశంకరుడిలా అందరికీ తల్లో నాలుకగా వుంటారు. చుట్టుపక్కల వారు తలో నాలుక అయినా కూడా మరి.. అదనమాట ఆయన నైజం. ఆయన సతీమణి సుభద్ర గారు కూడా సుమారుగా అంతే.. మృదుస్వభావం. ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఆమెకు శోభనిస్తుంది.
‘‘చేసేది ఏమిటో చేసెయ్.. సూటిగా వేసేయ్ పాదు ఈ తోటలో.. ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని.. ఓ బాబయ్యా..’’22 ముసలి (మారు) వేషంలో తోట పనిచే సూత పాట పాడ్తున్నాడు.. ఏ.ఎన్.ఆర్. తెనాలి రామకృష్ణ సినిమాలో. టీవీ చూస్తూ ఠీవీగా కూర్చుని వింటూ చూస్తున్నారు లింగమూర్తిగారు. పక్కనే ఆయన సతీమణి సుభద్రగారూనూ.
34 ‘‘ఎక్స్‌క్యూజ్‌మి..’’22 నేను వాళ్ళ వాకిట నిలబడి అన్నాను. ఆ వెంటనే యిలా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. 34‘‘నా పేరు వాసుదేవరావు.. అందరూ వాసు అంటుంటారు. మరి ముద్దుగానో.. హద్దుగానో.. బహుశా పూర్తిగా పిలవటానికి పెద్దగా అభ్యంతరం ఏమీ కాదుగానీ.. బరువుగా ఫీలవుతారేమో’’22 అంటూ చేయి ముందుకు చాపాను. అదే చిరునవ్వుతో దంపతులిద్దరూ లోపలికి ఆహ్వానించారు నన్ను. అట్లా యిద్దరం రమారమి ఇరుగుపొరుగుగా పరిచయమయి కలిసిపోయామనే చెప్పాలి వాస్తవానికి. ఆ తర్వాత రాకపోకలు మొదలయ్యాయి.
ఆ తరువాత తెలిసిందేమంటే లింగమూర్తిగారు హోమ్‌శాఖలో, ఎడ్మిన్‌లో ఆఫీసరుగా చేస్తున్నారు. నేను కూడా పి.డబ్ల్యుడిలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగినే.. యిది వృత్తిపరంగా. ప్రవృత్తిపరంగా లింగమూర్తిగారు నాటకాలు వేయడం, రాయడం, దర్శకత్వం చేయడం లాంటివి చేస్తుంటారని నాకూ వాటిలో అంతో ఇంతో ప్రవేశము, అభినివేశము వుండటం చేత మా పరిచయం కొంచెం పెనవేసుకుని, ముడివేసుకున్నది. మా పక్కనే వుంటున్న ఈశ్వర్, మహేశ్వర్ కూడా మా గూటి పక్షులే. వాసన పసిగట్టి మాతో జట్టు కట్టారు. మా తాటికి కట్టబడ్డారు.
ఇహ అక్కడనుండి చిన్నసైజు సాహితీ చర్చలు, కవి సమ్మేళనాలు.. యిష్టాగోష్టులు.. సినిమా కళాకారులు, కవులు, రచయితలు.. వారి వారి వ్యాసంగాలు.. సంభాషణల్లో మెలకువలు, ప్రయోగాలు, చలోక్తులు, చమత్కారాలు.. మా కాలక్షేపంగా సాగింది లింగమూర్తిగారింటో.. ఎందుకంటే వారే మూలంగా వుండేవారు. అందుకని అందరం అక్కడికే చేరే వారము.. ఆఫీసుకి టైమ్ అయ్యేవరకు సినిమా స్పృహ తప్ప వేరే ఆలోచనకు చోటుండేది కాదు. యిక సెలవు రోజుల్లో చెప్పపనే లేదు.
ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచినయ్.. ఒకరోజు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి లింగమూర్తిగారి భార్యకి హైబీపీ వచ్చి ప్యారలైజ్ అయ్యారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అది తెలిసి అందరం చలోమని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాం. పరామర్శ ఊరట కలిగిస్తుందా చెప్పండి.. ఎవర్నివారే ఊరడించుకోవాలి.
లింగమూర్తిగారికి పిల్లల్లేరు. ఈమెకి అదే దిగులు. దృఢము. స్థిరస్వభావము లింగమూర్తిగారిది.. తొణకలేదు, బెణకలేదు. వెంటనే ఒక నిర్నయానికొచ్చి, తన తమ్ముడి కొడుకు శ్రవణ్‌ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. శ్రవణ్ బి.కామ్. చదువుతున్నాడు. పూర్తి అయిపోగానే ఎం.బి.ఏ.లో చేరాడు. బెంగుళూరులో ఏదో ఉద్యోగం ఆఫర్ వచ్చింది. చదువు పూర్తయ్యాక అని వాయిదా వేసుకున్నారు.
ఆ తర్వాత నాకు ఏలూరుకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది ప్రమోషన్ మీద. మొదట నేను వెళ్ళాను. తర్వాత సంవత్సరం ఫ్యామిలీ తెచ్చేశాను. పిల్లల్ని కాలేజీల్లో చేర్పించాను. ఆ తర్వాత రాకపోకలు తగ్గిపోయి, లింగమూర్తిగారి విషయాలు బొత్తిగా తెలిసేవి కావు. మా పిల్లల చదువులు, ఉద్యోగాలు.. తదుపరి వాళ్ళ పెళ్ళిళ్ళు.. పురుళ్ళు, పుణ్యాలు యిలా బిజీ అయిపోయాను. ఆ తర్వాత రిటైర్మెంట్ వగైరాలు. ఇంతేగా మరి గానుగ చుట్టూ తిరుగాడే మధ్యతరగతి జీవితాలు. అప్పటికీ రెండు, మూడు సార్లు ఈశ్వర్, మహేశ్వర్‌లె కలిశారుకానీ లింగమూర్తిగారి గురించి అడిగే తెలుసుకునే వ్యవదానం దొరకలేదు మా బిజీలైఫ్‌లో..
నాకు రిటైర్మెంట్ వృత్తిపరంగా దొరికింది కానీ సంసారపరంగా పిల్లలతో అటూ ఇటూ తిరుగుతుండటం వల్ల కూడా ఆ కళా చర్చలు.. కళారాధనలు.. సాహితీ సుమసౌరభాలు.. సినీ ముచ్చట్లు అటకెక్కినయ్.
ఈశ్వర్ ఏదో పెళ్ళిలో కలిశాడు. అప్పుడు లింగమూర్తిగారి గురించి ప్రస్తావించాను. ఒక నిట్టూర్పు విడిచి ఈశ్వర్ ‘‘ఆఁ! ఏం లింగమూర్తిగారండీ బాబు.. మొండి మనిషి..’’ అన్నాడు. అదేంటి.. ఈ పెద్దమనిషి.. ఆ పెద్దమనిషిని.. ఇలా అంటున్నాడు అనుకుని విస్తుపోయాను. ఆ తర్వాత తనే చెప్పుకుపోతున్నాడు.
‘‘ఆయన భార్య చనిపోయి సంవత్సరమైంది. సంవత్సరీకాలు అయినవో, లేవో వెంటనే మళ్ళీ ఆయన తన వయసుకి చేరువలో ఉన్న ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఈ వయసులో ఆ వయసామెతో పెళ్ళేమిటి? మీరు చెప్పండి’’22 అంటూ ముగించాడు ఈశ్వర్. అది విన్న నేను అవాక్కయి క్షణకాలం నిరుత్తరుడినే అయ్యాను.
అప్పటివరకు నా మనసులో హిమాలయ శిఖరాల ఎత్తున వున్న లింగమూర్తిగారు మంచులా కరిగిపోయి నేలనుపారారు. అంతటి ఔన్నత్యము యిలా కరిగిపోయిందేమిటా అని పరిపరివిధాల ఆలోచనలకందనంత అయోమయమయిపోయింది, నా మెదడు మొద్దుబారిపోయి. అప్పటినుండి దాదాపు లింగమూర్తి గురించి ఆలోచించడం మానేశాను.
యాంత్రికంగా సాగిపోతున్న నా జీవన పయనంలో.. ఓ రోజు మళ్ళీ నా ఆలోచన శరపరంపరగా లింగమూర్తిగారిపైకి మళ్ళింది. మా ఇంటి సమీపంలో ఓ చిన్న పార్కు ఉంది. రోజూ సాయంకాలం కాసేపు గడిపి వస్తుంటాను. ఆ రోజు గాలి విసురుగా వీస్తూ ఉంది. వానగాలి వస్తుందేమోనని లేవబోతుంటే గాలికి కొట్టుకొస్తున్న ఆ రోజుటి న్యూస్‌పేపర్ నా కాలికి తగిలి ఆగిపోయింది. చేతిలోకి తీసుకుని చూశాను. ఆ పేపరులో చోటుచేసుకున్న వార్త. ‘‘లింగమూర్తిగారి మరణం.. రేపే అంత్యక్రి యలు..’’22 ఆ ప్రకటన ఇచ్చింది మరెవరో కాదు శ్రవణ్ మరియు కొత్తగా ఇల్లాలైన ఆయన శ్రీమతి. వడివడిగా నడిచాను బస్టాండ్‌వైపు నేను యింటికి ఫోన్ చేస్తూ..
నేను వెళ్ళేటప్పటికే లింగమూర్తిగారి పార్థివదేహానికి అంతిమ సంస్కారం జరుగుతోంది కళ్యాణ్ చేతుల మీదుగా.. జనం తండోపతండాలుగా వచ్చారు. లింగమూర్తిగారి ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, మానవీయతని వేనోళ్ళ పొగుడుతున్నారు.
ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులను వృధ్ధాశ్రమానికి వెచ్చించిన విషయం.. బీద నాటక కళాకారులకు 3‘‘నిధి’’2ని ఏర్పాటు చేసిన విషయం.. చివరాఖరికి తను రాలిపోయే పూవని తెలిసి, ఓ అనాథ స్ర్తీకి నాథుడై ఆయన పెన్షన్‌కి అర్హురాలిని చేసినది చెప్పుకుంటూ.. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉందని కన్నీరుమున్నీరవుతున్నారు వారందరూను.
ఆయన నమ్మిన సిద్ధాంతం ‘‘దైవత్వం కంటే మానవత్వం గొప్పదని.. మంచి పంచుకుంటూ వెళ్తే దేవుడే అన్నీ చూసుకుంటాడని’’ ఆ విశ్వాసంతోనే ఆయన జీవించారు. ఎందరో ఎన్నో రకాల దానాలు చేస్తారు కానీ పెన్షన్‌ని కూడా దానమియ్యవచ్చని లింగమూర్తి చేసి చూపించారు.
34‘‘చేసేది ఏమిటో చేసేయ్ సూటిగా..’’22పాట వినిపిస్తోంది. తృప్తి నిండిన.. ఆశయాలు పండించుకున్న లింగమూర్తిగారి వదనం కనిపిస్తోంది..
ఆయన వదనం (ఓ) విరిసే కమలం22

-ఆచార్య క్రిష్ణోదయ