S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జొరమొస్తే భలే ముద్దు..

నా చదువు ఓ ఫార్సు - మూనె్నల్లు వెళ్తానో లేదో, అలా పడకేసేవాన్ని; స్కూలు డుమ్మా... కాకపోతే డబుల్ ప్రమోషన్ గ్యారంటీ - తలనొప్పితో.. ఓసారి ఓ రకం జ్వరం వచ్చేసింది. ఆ ఏడు వదలేసి మర్సటేడు - మెరిట్ పరీక్ష రాయడం - పై క్లాసులో కూర్చోవడం - చెప్పానుగా, నారాయణరావుగారి మేనల్లుడు అని నాకు అదనపు టైటిల్ వుండేది. ఆయనకీ - ఫ్యాక్టరీలో మస్టారు వేసుకుని - ఇంటికాడకి వచ్చి - పనిచేసే బర్నబస్సు - అతి కూతురు త్రయం ఉండేది- ఆలీసు, సువార్త, మరియమ్మ వుండేవాళ్లు... ఓసారి మా బామ్మ బారనబస్సుని పిలిచి - ఓ రబ్బీ నీ పేరేమిటో బస్సో రైలో నాకు వద్దు కాని - పిల్లలు (మా అత్తలు బాబాయిలు) వచ్చేరు - ఈ దావ్బుల్కి ఎన్నోస్తే అన్ని చెక్కలు - పట్రా - అని విజేనగరం బషావు పురమాయించింది. వాడు సారీ అతగాడు (మా క్రిష్న టచ్ ఇది) పోయి తిరిగి తిరిగి వచ్చాడు. చెక్కలేవీ? ఉప్పు చెక్కలు దొరికాయా?..
దొరికినై - బయట ఏసిన-
తెసుకురా - సీసాలో పోద్దువుగాని - ముందా మొహం కడుగు చెమటలు కారుతున్నాయి-
ఎందది? కట్టెలు సీసాలో ఎట్ట మంట వ? అన్నాడు వాడు విస్తుబోయి..
కట్టెలు అంటే అడితికి పోయి కట్టెపుల్లలు తెమ్మన్నవ అనుకోనిన? అన్నాడు. మనిషి దిట్టంగా దిమ్మచెక్కలా వుంటాడు. ఆమె గుండెలు బాదుకుంది. ఒరే, సూరి బాబూ? అంటూ మామయ్య రాంగానే ఫిర్యాదు చేసింది - అసలు స్టోరీ ఏమిటి అంటే? చెక్కలు అంటే ఆ జిల్లాలో పోకవక్కలు - ఉప్పు చెక్కలు - వీటినే వాళ్లు - మా చుట్టలు, నెమరేస్తూనే ఉంటారు. మేము ఇక్కడ వక్కలంటాము - చెక్కలు అంటే మాకు కట్టెలే.. ఓసారి అనకాపల్లి నూకాలమ్మ గుడికి మా బామ్మ తీసికెళితే అమ్మవారి విగ్రహం చూసి ఝడుసుకున్నాను.. అలా వుంటుంది - ఆలీసు.. పెద్దక్క అనాలని, ఓసే ఆలిసు అని పిలవగూడదని మా అమ్మ మా మామయ్యని ప్లీజ్ చెయ్యడానికి చెప్పేది.. నేను తల కాలు గాని కాళ్లు పట్టవా? అనేవాన్ని. పరిశుద్ధ ప్రభువా పరిశుద్ధ ప్రభువా అని పాటలు పాడేది.. వంట వండి మా బామ్మ నైవేద్య అభిషేకం అన్నీ కాంగానే - మామ్మ ఓ సిల్వరుకేరేజీలో పెట్టి అల్లీసు కిస్తే సువార్త అది తీసుకుని - బావి పక్క పెద్ద రోడ్డులో వున్న పెద్దత్తకి పెట్టేది ఆమె, అంటే మా పెద్దత్త. నాకు ఫ్రెండే - గుంటూరట వాళ్లది.. ముక్కామల వాళ్లమ్మాయిట. వీళ్లను? అంటే విలను? ముక్కామలా? అని మా చిన్నాన్నగారి జోకు. మరి ఇంతమంది పనివాళ్లు కావాలి మీకు అంటే వాడికి అంటే మామయ్యకి కేరేజీ పంపొద్దా.. ఇదీ మా సత్యం మేనత్త విసురు.
మా తమ్ముణ్ణి సెంటర్‌లో గాంధీ బొమ్మ వెనకాతల వున్న ఉర్దూ ఇస్కూల్లో వేశాడు (ఇక మీద ఇలా అంటే వాడు మా మామాసురుడేనని గ్రహించాలి. - అలీఫ్, బె, పె, తేతే సే.. చివర చోటియే బడియే - అదే బడి చెప్పేది మరి. శలవుల్లో - అసలు బడికి పోతేగా నేను.. జొరమొస్తే భలే ముద్దు చేస్తారు. రొట్టె పాలు పైగా పజా సెంటర్ బేకరీలో -వెన్న బిస్కట్లు.. ఆరణాలిస్తే నేనే పోయి తెచ్చుకునేవాణ్ణి రహస్యంగా. ఎప్పుడేనా మా సత్యమత్తకి, తమ్ముడికి ఓ ముక్క.. ట్రంకు పెట్టెలో నా బుక్సు - ఇలాంటి రహస్యాలు.
అందుకని, చేతి పని లైఫ్‌లో పనికొస్తుందిట.. నేర్చుకో అని గాంధీ బొమ్మ సెంటర్లో వున్న సత్తార్ భాయ్ తేలారు దుకాణంలో పడేశాడు. అక్కడికి మామాజీ వుండే ఇల్లు అంటే అత్తయ్య వుండే ఇల్లు దగ్గరే. ఆమె ఒక్కత్తె. నేను పారిపోయి వెళితే దాచేసేది నన్ను. గ్రామఫోను పాటలు పెట్టుకునేవాళ్లం.. ‘శాము డ ల్లీ.. ఖిడకీ ఖులీ.. తుం సిటీ బజానా చోద్ దేవ్.. పాట నాకు ఇష్టం. గోప్ హాస్యం డ్రామా.
సత్తారు దర్జీ - బాగా కుడతాడు (మా నాన్నగారి మాట) కాని ‘ఈద్’కిస్తే మళ్లీ ‘ఈద్’కే డెలివరీ.. నాకు పని నేర్పడం కష్టమే. టైలర్‌గానేనా బతికేస్తాననుట.. రెండు అగ్గిపుల్లలు - అరచేతిలో పెట్టాడు ఎడమ అరచేతిలో - సమాంతరంగా ఎడంగా కొంచెం - ఓ అగ్గిపుల్ల ఇలా ఎత్తి పైకి కిందకి దింపి రెండో అగ్గిపుల్ల ఎత్తుకోవాలి ఇలా కాజాలు కుట్టడం నేర్పుతారు.. అతనికి కాజాలు కుట్టే ఛోక్రాలు లేరు. రోజంతా ఇదే పనా?
-మహారాజ్ బొలన నక్కో నారాయణరావు సాబ్ క హుకుం హు యే అనేవాడు. మహరాజ్ అంటే నాన్నగారు. పిట్టంత మనిషి డెలికేట్‌గా ఎర్రగా కోసిన కర్బూజ పండు రంగులో నల్లని కురుల హైక్రాపుతో - వామ్మో నాన్నగారి దస్తూతియా? ముత్యాలకోవ - గోల్డు మెదలిస్టు మా ఫాదర్. ఇలా వంకరగా పడుకోబెట్టిన ఇంగ్లీషు అక్షరాలూ రాస్తారు. తిన్నగా నిచ్చెనలాగ నిలబెట్టిన అక్షరాలూ పొందికగా రాస్తారు. కానీ నా దస్తూరీ - మేనమామ పోలిక వచ్చింది దానికి. ఆంధ్రపత్రికలో చేరిన వెంటనే గొప్పయిపోయి ఇలా పేజీలు పేజీలు రాసేసేవాన్ని. వర్కర్లు కంపోజిటర్లని.. వాళ్లకి నా తెలిగ్రామ్య నిసాని అలవాటైపోయింది. పిటిఐ టెలిగ్రాములు ఈ చేత్తో పాతుకుని - ఊట కలమ్ సిరా బుడ్డితో ముంచడం - గీకటమే. అందులోనూ చైనా వార్త అయితేనా.. ‘... గీకడం పేజీ ఇలా చింపి ట్రేలో పడేయడం - మాకు బళ్లు పెన్నులు - పార్కర్ పెన్నులూ రత్నమ్ ఫౌంటెన్లు లేవు - బల్ల మీద దస్తాన్ గాజు గుంటలలో సిరా పోసేవాడు శంకర్ -వైకి తెలుగు రాదు నతడు - సీరములు చెప్పేడు - సేగ్రం ఇవ్వుమీ అనేవాడు - చెప్పేవారు అనాలిరా అంటే చిన్నగుండు క్రాఫు వాడూను - కొత్త నిబ్బు ఇస్తునా? అనేవాడు. ఏమి నిబ్బు వాడి మూతి (ఇది మద్రాస్ టచ్) - కొంగమూతి పాళీ, లేదా పొట్టి బాతు ముక్కు పాళీ - ఏది అయినా - చొక్కానిండా సిరా పోసుకోవడం నా స్పెషాలిటీ. ఇలా దూరంగా పాతుకుని ఒంకరగా చెయ్యి మెడ పెట్టి ఆఖరాలు చెప్పినట్లు రాసేవాడు ఎమ్మెస్ శర్మగారు. అక్షరాలూ లెక్కెట్టి అయిపోయింది ఇవాళ్టి కోటా అనేవాడు. పేజీ నంబర్లు గల్లంతు చెయ్యకుమీ అని అవన్నీ సరిగ్గా పెట్టుకొని వెళ్లేవాడు - త్యాగరాజు - సీనియర్మోస్ట్ పెద్ద ప్రెస్స్వోర్కరు - అయ్యవార్నే నువ్వుండుమీ అని కసిరే లెవెల్ త్యాగరాజు సర్వీసయిపోయింది.. చేస్తున్నాడు -

(...ఇంకా బోలెడుంది)

--వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com