S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవించడం..

జీవితంలో కొన్ని సత్యాలు వుంటాయి. అవి ఎప్పుడూ మారవు. ఈ విషయాన్ని మనలో చాలామంది గుర్తించరు. గుర్తించినా అంతగా పట్టించుకోరు.
జీవితంలో ఏది వచ్చినా రాకపోయినా మరణం మాత్రం తప్పక వస్తుంది. సృష్టిలో వున్న ప్రతి జీవికి ఇది తప్పదు.
ఇది నిశ్చయం.
మనందరికీ ఈ విషయం తెలుసు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ అన్న విషయం మాత్రం తెలియదు. కానీ ఇది తప్పదు.
ఈ విషయం గురించి ఆలోచించడం చాలా మందికి నచ్చదు. ఇది సహజం.
మరణం మన చేతుల్లో లేదు.
కానీ
జీవించడం మాత్రం మన చేతుల్లో వుంది.
కానీ
ఎంతమంది జీవిస్తున్నారు.
చాలామంది మరణిస్తూ బతుకుతున్నారు.
జీవించే అవకాశాలు అందరికీ వున్నాయి. కానీ చాలామంది నిరాశగా, ఏదో కోల్పోయినట్టు బతుకుతున్నారు.
అన్యాయాన్ని ఎదిరించి జీవించవచ్చు.
కరుణ చూపించి జీవించవచ్చు.
మన టాలెంట్‌ని ఇతరులకి పంచి జీవించవచ్చు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమించి జీవించవచ్చు.
మన శక్తి సామర్థ్యాలను బాగా ఉపయోగించి జీవించవచ్చు.
కొత్త విషయాలు తెలుసుకొని కొత్త ద్వారాలు తెరిచి మనం జీవించవచ్చు.
మనకున్న అవకాశాలను బాగా ఉపయోగించుకొని జీవించవచ్చు.
ఈ ప్రపంచం మీద ఆశావహ పాదముద్ర వేసి జీవించవచ్చు.
నవ్వుతూ, నవ్విస్తూ జీవించవచ్చు.
ఈ ప్రపంచంలో మన పాత్ర నిర్వహించి జీవించవచ్చు.
మనందరికీ తెలుసు మరణం తప్పదని
అయితే
జీవించడం అవసరమని తెలుసుకొని
జీవించడం ఎంతమందికి తెలుసు.