S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంతానలేమికి క్షయ కారణం!

టి.బి. (క్షయ) వ్యాధి శరీరంలో ఏ భాగాన్నైనా ముట్టడించవచ్చు. సాధారణంగా ఊపిరి ద్వారా వేరొక వ్యాధిగ్రస్తుని వల్ల సోకుతుంది కనుక లంగ్ టి.బి. ఎక్కువమందిలో చూస్తాం. ఈ వ్యాధికి చికిత్స చేయకున్నా లేక తీవ్రంగా వున్నా మిగతా శరీర భాగాలకు అంటే ఎముకలు, జాయింట్లు, ఉదర భాగంలో జీర్ణ అవయవాలు.. ఇంటస్టయిన్సు లివరు, పెరిటోనియం వంటివాటికి సోకవచ్చు. ఎక్కడ టి.బి. ఉన్నా చికిత్స ఒకటే. అయితే కాలపరిమితిలో తేడా ఉంటుంది.
ముఖ్యంగా స్ర్తీలలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబులు (అండవాహికలు), ఎండోమెట్రియపు లోపలిపొర, సర్విక్సు.. వీటికి టి.బి. సోకితే సంతానం కలగడం చాలా కష్టం. ట్యూబులు చాలా సున్నితంగా, సుకుమారంగా వుంటాయి కాబట్టి త్వరగా పాడైపోతాయి. వాటికి రిపేరు చాలా అసాధ్యం. సంతానం పొందగేరేవారు ఐ.వి.ఎఫ్. టెస్టుట్యూబ్ బేబీలను పొందాలి. ఎండోమెట్రియల్ టి.బి. వస్తే నెలసరి బ్లీడింగులో అవకతవకలు, చాలా ఎక్కువ రక్తం పోవడం కానీ, ఎక్కువరోజులు పోవడం కానీ, అసలే లేకపోవడం గానీ జరగవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు- రోజూ కొద్దిపాటి జ్వరం, తెల్లవారి తగ్గిపోవడం, రోజంతా నీరసం, పనిచేయలేకపోవడం, రక్తహీనత, పొట్ట ఉబ్బు, జలోదయం, సంతానం లేకపోవడం, నెలసరిలో మార్పులు, మెడలోని గ్లాండ్సు ఉబ్బడం, ఎంత తిన్నా బరువు తగ్గిపోవడం, విరోచనాలు, వాంతులు లేక మలబద్ధకం, దగ్గు రోజుల తరబడి ఎన్ని మందులిచ్చినా తగ్గకపోవడం. ఇలాంటి లక్షణాలను బట్టి వైద్యులు అనుమానించి కొన్ని రక్తపరీక్షల ద్వారా, ఆధునిక పద్ధతుల ద్వారా రోగనిర్ణయం చేస్తారు. ఒకసారి సిబిపి, ఇఎస్‌ఆర్, మాన్‌టాక్స్ టెస్టులు ఎక్స్ రేలు చేసి చికిత్స మూడు ఆరు నెలలు లేదా ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తారు. మంచి ఆహారం, ప్రోటీన్లు, విటమిన్లు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల టి.బి. మాత్రం అంటువ్యాధి గనుక చిన్న పిల్లలు, గర్భిణులను రోగులకు దూరంగా ఉంచాలి. ఈ రోజుల్లో టి.బి. అంటే భయపడనక్కర లేదు. పూర్తిగా నయం చేయవచ్చు.

ప్రశ్న: నాకు 1974లో టి.బి. వచ్చింది. దానికి మందులు పూర్తిగా వాడాను. తగ్గింది. తర్వాత బ్రాంకియల్ ఆస్త్మా వచ్చింది. 1982 నుంచి కంట్రోల్‌లో ఉంది. రాత్రిళ్లు భయంతో కూడిన కలలు, వణుకు, ఆయాసంగా ఉండి మెలకువ వస్తోంది. దీనికి పరిష్కారమేమిటి?
పి. మహేశ్వరరావు, అనకాపల్లి
జవాబు: నీకు వచ్చిన టి.బి. తగ్గిపోయినా దాని గురించి ఇంకా భయపడుతున్నావు. తర్వాత ఆస్తమా మందులు ఒకసారి మీ దగ్గరలోని ఫిజీషియనుకి చూపించి మీ భయం, వణుకు గురించి అడగండి. ఆస్త్మా తగ్గించే డెరిఫిలిక్, అమైనోఫిలిన్, కార్టిసోన్ వంటి మందులకు వణుకు, గుండెదడ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిమందికి రావచ్చు. మందు మార్చితే, కొద్దిపాటి కౌన్సిలింగుతో నీవు సాధారణంగా నిద్రపోగలవు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో