S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇదీ మన కథ!

గరుత్మంతుడు చిన్నప్పుడు తల్లి, దాస్యవిముక్తి కోసం, సవతి తల్లి కోరిక మేరకు అమరపురానికి వెళ్లి అమృతం తెచ్చి యివ్వడం.. ఆ తరువాత శ్రీహరికి వాహనం కావడం.. లోకపాలకుడు శ్రీహరికే వాహనం అయిన తను గర్విష్టిగా మారడం.. గమనించిన శ్రీహరి ఆ గర్వాన్ని అణచి కళ్ళు తెరిపించడం.. సుశాంత్ చిన్నప్పుడు పాఠ్యాంశంగా తెలుగులో ఉండేది. ఏదో పాఠంగా చదువుకున్నాడు కానీ ఒంట పట్టించుకోలేదు. అదే ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. గతానికి తెరతీస్తే వాస్తవం తెలుస్తోంది సుశాంత్‌కి. సుశాంత్‌కి త్రిపురతో పెళ్ళైన కొత్తరోజులు.. మోజులకి రేకువిచ్చుకుంటున్న తొలిరోజులు.. మామగారు త్రిపురని, నన్ను, అమ్మానాన్నల్ని.. పదహారురోజుల పండక్కి పిలిచారు. అమ్మానాన్న వెనకాతల వస్తామని మమ్మల్ని ముందు పంపించారు. మా ఏకాంతం భంగం కాకూడదని కామోసు బహుశా. వెళ్తూనే త్రిపురని చెల్లెలు భ్రమర లోపలికి తీసుకెళ్ళింది. మామగారు నన్ను హాల్లో సోఫాలో కూర్చోమని అమ్మానాన్నల గురించి కుశల ప్రశ్నలు వేశారు. అత్తగారు అల్లుడు మర్యాదలు చేసి త్రిపురను వెదుక్కుంటూ లోనికి వెళ్ళింది.
‘‘ఎలా వున్నారక్కా బావగారు నీతో..’’ ఉత్సాహంగా అడిగింది అక్కని భ్రమర.
‘‘అల్లుడికేం బంగారం..’’2అంది అమ్మ.
‘‘నాకనిపించనిది నాకెంతో ఇష్టమైన క్రేన్ వక్కతుంపు కూడా నోట్లో వేసుకోను, అలాంటిది నువ్వు చెప్పావని నాకిష్టంలేనిది తింటానని, వింటానని ఎలా ఊహిస్తున్నావు త్రిపుర అన్నారాయన మొదటిరాతి రోజే..’’ చెప్పింది త్రిపుర తల్లికి, చెల్లికి.
‘‘బావగారు పైపైకి అలా ఉంటారేమో కానీ.. అంత పట్టింపు మనిషిలా లేరక్కా..’’ తన అభిప్రాయం చెప్పింది భ్రమర.
‘‘ఆఁ! మరీ విడ్డూరం నీది. మొదట్లో మీ నాన్నగారు అలానే ఉండేవారు, మీరు పుట్టుకొచ్చాక.. ఈయనే ఆయనా అనిపించారు. మగవాణ్ణి మన దారిలోకి తెచ్చుకోవాలి’’ జడ్జిమెంటు ఇచ్చింది అమ్మ.
ఇందాక ఆయన్ని అంత వొంగొంగి మర్యాదలు జరిపిన అమ్మేనా అనిపించింది త్రిపురకి. బహుశా అత్తగార్లంతేనేమో.. అమ్మగా ఇక్కడ నాకు ధైర్యం చెప్పింది.. అత్తగా అక్కడ ఇలా పోషిస్తోంది.. ద్విపాత్రాభినయం.. అనుకుంటూ తను హాల్లోకి వెళ్ళి సుశాంత్‌ని తీసుకుని మేడమీద తన గదికి తీసుకెళ్ళింది త్రిపుర.
గదిలోకి వెళ్ళిన సుశాంత్ డ్రెస్ మార్చుకుని తమ్ముడు ప్రశాంత్‌కి ఫోన్ చేశాడు. ప్రశాంత్ హాస్టల్‌లో ఉంటూ ఎం.బి.ఏ. చేస్తున్నాడు.
‘‘ఏం తమ్ముడూ? ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ వ్యవహారం?’’ అడిగాడు సుశాంత్.
అన్నయ్య సడన్‌గా ఈ విషయం అడిగేసరికి క్షణంపాటు ప్రశాంత్‌లో ప్రశాంతత స్తంభించింది. తేరుకోటానికి కొన్ని క్షణాలు గడిచిపోయినయ్..
‘‘నీదాకా వచ్చిందా..?’’ అంటున్న ప్రశాంత్‌ని మధ్యలోనే అడ్డుకుంటూ ‘‘నువ్వెంత రహస్యంగా ఉంచినా.. ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయి..’’22 అన్నాడు సుశాంత్.
‘‘అదే.. ఎలా..? ఎవరు చెప్పారు..? శ్యాంగాడా, రాంగాడా..’’ కంగారుగా అడిగాడు ప్రశాంత్ సుశాంత్‌ని.
‘‘నీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు.. కానీ నన్ను మాత్రం దూరం పెట్టావన్నమాట..’’ సతాయిస్తున్నాడు అన్నయ్య.
‘‘అన్నయ్యా! నువ్వు మటుకు నువ్వు.. ఒకే విషయం పట్టుకుని సతాంయిచేస్తున్నావు. వదిలిపెట్టరా బాబు.. హాయిగా అత్తారింట్లో వదినతో కులాసాగా గడిపేయరా బాబు..’’ అంటూ బతిమాలుతున్నాడు ప్రశాంత్.
‘‘పెళ్ళికెందుకురా అంత తొందర.. వివాహాయ విద్యనాశాయ అన్నారు. లక్షణంగా చదువు పూర్తిచేసుకుని ఉద్యోగంలో స్థిరపడ్డాక ఈ ప్రేమ.. పెళ్ళి ముచ్చట..’’ లెక్చర్ ఇస్తున్నాడు అన్నయ్య. అన్నయ్య ఎంతైనా లెక్చరర్‌గదా మరి.
‘‘పెళ్ళికాక నువ్వు.. పెళ్ళయ్యాక నేను.. ఏముంది వింత?’’ అన్నాడు త్రిపుర వైపు చిలిపిగా చూస్తూ..
‘‘ఏం.. ఇప్పుడు మీకేం తక్కువయ్యిందట..’’ కస్సుమంది త్రిపుర.
వదిన కూడా ఈ సంభాషణల్లోకి వస్తుందేమోనని ప్రశాంత్ ఫోన్ కట్ చేశాడు.
నవ్వులు.. తుళ్ళింతలతో మా వైవాహిక జీవనయాత్ర మూడు రాత్రులు.. ఆరు వసంతాలుగా సాగిపోతోంది. మా ఇద్దరి మధ్యకి సరోజ, నీరజలు వచ్చేశారు. చూస్తున్నంతలోనే పెరిగి పెద్దవారయ్యారు. పెళ్ళీడుకి వచ్చేశారు అంటోంది త్రిపుర. ముమ్మరంగా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు సుశాంత్, త్రిపుర.
ప్రశాంత్ కలిసినప్పుడల్లా పిల్లల పెళ్ళెప్పుడంటూ తెగ సతాయించేస్తున్నాడు. వాడికెప్పుడూ పెళ్ళిళ్ళ గొడవే.. ఈడొచ్చిన పిల్లలు కనబడితే చాలు పెళ్ళి ముచ్చట.. పెళ్ళైన పిల్లలు కనపడితే పిల్లలింకా పుట్టలేదా.. అంటాడు. మా పిల్లల్ని ఉద్దేశించి ‘‘మీ అయ్యని నమ్ముకుంటే యింతే సంగతులు.. నన్ను చూడు ఎంచక్కా నేనే వెతికి చేసుకున్నాను మీ పిన్నిని’’ అంటూ మొదలెడ్తాడు. పిల్లలతో ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో కూడా తెలియదు వెధవకి.. ఎవరికి ఏం వెలితుందా అని చూస్తూంటాడు. పెళ్ళికాని పిల్లల్ని చూస్తే పెళ్ళి కాలేదని.. పెళ్ళైన వాళ్ళని చూస్తే పిల్లలెప్పుడని, ఎవరికి ఏది లేదో అదే ఎత్తి చూపిస్తుంటాడు. ఎందుకిలా శాడిస్టుగా మారాడో తెలియదు.
కొంచెం టైమ్ తీసుకున్నా సరోజకి మంచి సంబంధమే వచ్చింది. ఆరునెలలు తిరక్కుండానే నీరజ పెళ్ళి కూడా అయ్యింది. అందరూ పైకి బాగానే ఆనందించారు. కానీ లోలోపల నా పైన బాగా దృష్టిపెట్టుకున్నారు. ఎంతలో ఎంత మార్పు.. ఇద్దరి పెళ్ళిళ్ళు ఇట్టే చేసేశాడు అంటూ చెవులు కొరుక్కున్నారు అయినవాళ్ళందరూ. అమ్మయ్య పెళ్ళిళ్ళయిపోయినయ్ అని కాస్త త్రిపుర, నేను ఊపిరి పీల్చుకుంటుంటే ఇంకా తాతవి కాలేదా అంటూ మా ప్రశాంత్ మా ప్రశాంతతను భంగపరుస్తూ వెంటపడ్డాడు. అలవాటైపోయింది వాడి ధోరణి మాకు.
ఆ ఘడియ కూడా వచ్చింది. ఇద్దరమ్మాయిలకి ఇద్దరు కొడుకులు కలిగారు. ముద్దుముద్దుగా బారసారెలు గట్రా జరిగిపోతున్నాయి. గర్వంగా చూద్దునుగదా ప్రశాంత్ వైపు.. ‘‘మహా కన్నారులే.. ఒంటికాయ సొంటి కొమ్ముల్ని’’ అంటూ నా చేతికి దొరక్కుండా జారుకున్నాడు వాడు. చేతికి చిక్కితే చితక్కొడ్తామనిపించేది వెధవని.
పండుగలా జరిగిపోతున్న కాలానికి కళ్ళెం వేసినట్లు ఒకరోజు అర్ధరాత్రి నా గుండె కొంచెం బరువుగా అనిపించింది. ప్రెజర్ కాస్తా దవడల దాకా పాకింది. ఒకటే దవడల నొప్పి. ఒళ్ళంతా దిగచెమటలు.. ఇవన్నీ చూస్తున్న త్రిపుర పక్కగదిలో వున్న నీరజ, నిరంజన్‌లు ఆత్రుతగా వచ్చి డాక్టరు దగ్గరకు నన్ను అప్పటికప్పుడే తీసుకుపోయారు. వాళ్ళు వెంటనే అంబులెన్స్‌లో రమేష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వేగంగా అడ్మిట్ చేసుకున్నారు. ప్రాథమిక చికిత్స మొదలుపెట్టారు. అశక్తంగా జరుగుతున్నవన్నీ చూస్తూ అయోమయమయ్యానే్నను.
కళ్ళు తెరచి చూస్తే బైపాస్ ఆపరేషన్ సక్సెస్ అంటోంది తెల్లని దుస్తుల్లో ఉన్న నర్స్.. డాక్టరు వచ్చి చూసి పలకరించి వెళ్తున్నారు. అంతా కళ్ళముందు జరుగుతున్నవి కలలా జరిగిపోయినవి గుర్తుకొస్తున్నాయ్ కొద్దికొద్దిగా. నాకు తెలిసినవాళ్ళు, బంధువులు రోజుకి కొందరు వచ్చి పలకరించి వెళ్తున్నారు. వాళ్ళల్లో ప్రశాంత్ కూడా ఒకడు.. ఏదో మాట్లాడబోతుంటే త్రిపుర అడ్డుకుంది. వాడి భార్యాపిల్లలు పక్కకి తీసుకువెళ్ళారు వాడిని. డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాను. చిన్నపిల్లవాడ్ని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారు నన్ను నా పిల్లలు. వేళకి మందులు వేయడం, బ్రష్ చేయించడం దగ్గరనుంచి స్నానం చేయించడం, అన్నం తినిపించడం.. ఇట్లా రమారమి రెండు నెలలు జరిగిపోయింది ముందుకి. ఇంకా స్థిమితం చిక్కలేదు నాకు. ఎప్పటికి కోలుకుంటానో ఏమో.. గాడ్ నోస్.. నిర్లిప్తత.. జవసత్త్వాలు ఉడిగిపోయిన స్థితిలో నాకు చిన్నప్పటి పాఠం గరుత్మంతుడికి జరిగిన అహంకార గర్వభంగం.. ఆయన సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడ్ని మోస్తున్న ఫీలింగ్‌లా నా కుటుంబాన్ని నేనే మోస్తున్నానన్న ‘‘అహం’’ ఇంతవరకూ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో.. నా కుటుంబం అవసరం నాకు ఇప్పుడు ఎంత బలమిచ్చిందో తలచుకుంటే.. జీవితాంతం ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తే నెలనెలా జీతం వచ్చేది. రిటైరయ్యాక నెలనెలా పుచ్చుకునే పెన్షన్‌లా అనిపించింది. ఎంతో కష్టపడి నెలనెలా ఇన్సూరెన్స్‌కి డబ్బులు కట్టి, బోనస్‌తో మెచ్చూర్డ్ డబ్బు అందుకున్నప్పుడు కలిగిన ఆనందం నా కళ్ళలో మెరిసి మురిసింది నా హృదయం. మనసు అద్దంలో ప్రతిబింబిస్తోంది. మట్టివాసనలు నింపుకున్న చెట్టు విస్తరించి కొమ్మలై, లతలై విరబూసిన పువ్వులై.. పరిమళిస్తున్నాయి సుగంధాలై..

-ఆచార్య క్రిష్ణోదయ