S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాలింతల ఆహారం

గర్భిణీలకు మంచి ఆహారం తినిపిస్తే కాన్పు సానుకూలంగా అవడమేగాక గర్భస్థ శిశువు కూడా ఆరోగ్యంగా వుండే నమ్మకం ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. పైగా అందరూ పాటిస్తారు. కానీ ఒకసారి ప్రసవం కాగానే పరిస్థితి మారిపోతుంది. ఎంత పథ్యం పాటిస్తే అంత మంచిది అనుకుని బాలింత కడుపు మాడుస్తూంటారు చాలామంది. డాక్టర్లు చెప్పినా గానీ ఇంట్లోని ఆడువారు వారి మిడిమిడి జ్ఞానంతో సరిగా అన్ని పప్పులతో, కూరలతో అన్నం పెట్టరు. ఒక రెండు బ్రెడ్డు ముక్కలు, గ్లాసుడు పాలు ఇస్తే చాలనుకుంటారు చాలామంది. ముఖ్యంగా మన సంప్రదాయ కుటుంబీకులు చాలా నమ్మకంతో చేసే అకృత్యమిది. అసలు గర్భిణి కంటే బాలింతకే పౌష్టికాహారం ఇవ్వాలి. పాలు, పండ్లు, గింజధాన్యాలు ముఖ్యం. ప్రొటీన్లు దండిగా లభించే మాంసం, కోడిగుడ్డు తినాలి. శాకాహారులకు పప్పు్ధన్యాలలోను, మార్కెట్‌లో దొరికే ప్రొటీన్ పౌడర్లు, బిస్కెట్ల ద్వారాను ప్రొటీన్లు అంటే మాంసకృత్తులు లభిస్తాయి. పాలు, మజ్జిగ, గంజి, వెజిటబుల్ సూప్స్ కూడా ఇస్తే కాల్షియం, విటమిన్స్ దొరికి పాపకు పాలు దండిగా దొరుకుతాయి.
శిశువుకు ఆరేడు నెలల వరకు కడుపు నిండా తల్లిపాలు దొరికితే రోగ నిరోధక పదార్థాలు (యాంటీబాడీస్) పాపకు లభిస్తాయి. మాంసాహారులకు చిన్నచిన్న చేపలు తింటే పాలు సమృద్ధిగా పడతాయి.
వీటికితోడు డిహెచ్‌ఎ ఉండే మందులు మార్కెట్‌లో లభ్యమవుతాయి. ఇవి తల్లికి ఇస్తే పాపకు పాల ద్వారా సరఫరా అవుతుంది. థైరాయిడ్ లోపం, మధుమేహం ఉన్నవారు మళ్లీ రక్తపరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వేసుకుంటూ వుండాలి.
బాలింతకు వెంటనే స్నానం చేయించాలి. పాప బొడ్డు ఊడేంతవరకు బయటి వారిని పాపను ముట్టుకోనీయకూడదు. కాన్పు ఐన వెంటనే గుంపులు గుంపులుగా బయట తిరిగిన బట్టలు, చెప్పులు, సామాన్లతో బాలింతను చూడడానికి వస్తే వారి ప్రమేయం లేకుండానే ఎన్నో సూక్ష్మజీవులు తల్లి, పిల్లకి సంక్రమిస్తాయి. కనుక వచ్చినవారు దూరం నించి చూసి, వెళ్లిపోతే మంచిది. డాక్టర్లు, నర్సులు వారిని వారిస్తే చెడుగా అనుకోకూడదు. ఊబకాయంతో షుగరు వ్యాధి, బిపి, గుండెజబ్బు, ఆయాసం వగైరా ఎదుర్కోవలసి రావచ్చు. కనుక తగిన వ్యాయామం, నడక, వీలైనంత వరకు వాహనాలు వాడకపోవడం, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం వంటి అలవాట్లు చేసుకోవాలి. పెద్ద వయసు వారికి ఎలాగూ పైవన్నీ తప్పవు. ముఖ్యంగా బజారు తిండి, బేకరీలో తయారయ్యే వెన్న జామ్, పిజ్జా బర్గర్, ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు కేకులూ మితంగా తీసుకోవాలి.
ప్రశ్న: నాకు పాదాల్లో ఆనెలు ఉంటే ఆపరేషన్ చేయించుకున్నాను. అయినా తగ్గలేదు. ఇది కేన్సరుకు దారితీస్తుందా? దయచేసి చెప్పగలరు?
-ఎస్. గిరిజ, నల్లకుంట, హైదరాబాద్
జవాబు: ఆనెలకి కార్న్ కాప్స్ అనే చిన్న పలాస్తీ పట్టీలు వేసుకోండి. నొప్పి తగ్గవచ్చు. ఇది కేన్సరు కాదు. భయపడనవసరము లేదు. ఆపరేషను నిపుణులతో చేయించుకోవాలి. లేకపోతే పూర్తిగా పోదు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో