S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముద్దకర్పూరంతో చికిత్సలు

ఫ్రశ్న: పచ్చకర్పూరం గురించి చాలా విశేషాలు రాశారు. ముద్దకర్పూరం గురించి కూడా వివరాలు చెప్తారా?
-వి.రాజారాం (సికిందరాబాద్)
జ: ముద్దకర్పూరంతో చాలా ఉపయోగాలున్నాయి. నాణ్యత పరిశీలించి తీసుకోవాల్సిన ద్రవ్యం అది. అతిగా తీసుకుంటే విషంలా మారుతుంది. చాలా స్వల్ప మోతాదులో తీసుకోవటం అవసరం. ఈ హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని కర్పూరం వాడకాన్ని మొదలుపెట్టండి. కొందరి శరీర తత్వాలకు కర్పూరం సరిపడకపోవచ్చు. ఇరిటేషన్, మంట పుట్టడం, దురదల్లాంటివి కలగవచ్చు. అది ఆయా వ్యక్తుల శరీర తత్వాల మీద ఆధారపడి ఉంటుంది.
1.ముఖ సౌందర్యం: ముద్దకర్పూరాన్ని కొద్దికొద్దిగా వేస్తూ సాన మీద మంచి గంధం చెక్కని అరగదీయండి. కర్పూరం 11:3 పద్ధతిలో చాలా కొద్ది మోతాదులో మాత్రమే ఉండాలి. దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం కలుగుతుంది. బజార్లో దొరికే గంధం పొడి మీద ఆధారపడకండి. మంచి గంధం చెక్క దొరికితేనే గంధం తీయండి. దొరక్కపోతే కేవలం కర్పూరాన్ని కొద్దిగా నీళ్లతో తడిపి పేస్టులా చేసి వాడుకోవచ్చు. ఒరిజినల్ ముద్దకర్పూరం దొరక్కపోతే బదులుగా పచ్చకర్పూరాన్ని తగుమోతాదులో వాడుకోవచ్చు.
2.మొటిమలు: మొటిమలను గిల్లకండి. రసికారి, పుండుపడి బెరళ్లు కట్టి చివరికి శాశ్వతంగా గుంటలు పడతాయి. మొటిమల మీద గంధం కర్పూరం పేస్టు గానీ కర్పూరం పేస్టుగానీ చాలా పలుచగా రోజూ ఒక్కసారి పట్టించండి. మొటిమలు తగ్గుతాయి.
3.ఆవిరి పట్టడానికి: వేడి నీళ్లలో చిటికెడంత ముద్దకర్పూరం వేసి ఆవిరిపడితే ముఖానికి జిడ్డు తగ్గి, చర్మం మృదువుగా ఉంటుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
4.చర్మ వ్యాధుల్లో: ఈ పేస్టుని రాసుకుంటే దురద తగ్గుతుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాల కొనల మీద కర్పూరం పనిచేసి ఇరిటేషన్ తగ్గిస్తుంది. దానివలన మృదుత్వం ఏర్పడి దురద తగ్గుతుంది.
5.కాలినప్పుడు: ఈ గంధం + కర్పూరం పేస్టు రాస్తే కాలినచోట నొప్పి, మంట వెంటనే తగ్గుతాయి.
6.ఎగ్జీమా: ఎగ్జీమా అనే నల్లమచ్చల వ్యాధి మీద కర్పూరం ఔషధంలా పనిచేస్తుంది. ఎగ్జీమా అనేది వౌలికంగా ఎలర్జీ వ్యాధి కాబట్టి కర్పూరం మీ శరీరానికి సరిపడుతుందో లేదో కొద్దిగా రాసి చూసుకోండి. సరిపడేట్టయితే, ఎగ్జీమా మచ్చల మీద గంధం కర్పూరం పేస్టుగానీ, కర్పూరం పేస్టుగానీ రోజూ రెండు పూటలా పలుచగా పట్టించండి. దురద, మచ్చలు త్వరగా తగ్గుతాయి.
7.పొంగు, అమ్మవారు: వైరస్ వలన వచ్చే పొంగు, అమ్మవారు మొదలైన వ్యాధుల్లో కర్పూరం + గంధం పేస్టు పలుచగా రోజూ రెండుపూటలా పొక్కులు వచ్చినచోట పట్టిస్తూ ఉంటే త్వరగా మాడుదలకు వస్తాయి.
8.హెర్పిస్ జోస్టర్ లాంటి నొప్పి కలిగించే పొక్కులు వచ్చినప్పుడు కర్పూరం, మంచిగంధం పేస్టు రాయటం, కడుపులోకి కర్పూరం తీర్థం తీసుకోవటం వలన త్వరగా గుణం కనిపిస్తుంది. నొప్పులు తగ్గి, పొక్కులు మాడుపడతాయి.
9.అరికాళ్ల పగుళ్లు: అరికాళ్ల పగుళ్లు, గోళ్లు పగుళ్లు, గోళ్లచుట్టు ఫంగస్ వ్యాపించి ఉండటం లాంటివి ఉన్నప్పుడు కర్పూరం పేస్టుని రోజూ రాయండి. ఫంగస్ త్వరగా మాడుతుంది. అరికాళ్ల పగుళ్ల మీద కర్పూరం గుణవత్తరంగా పనిచేస్తుంది.
10.దద్దుర్లు: దద్దుర్లు అనేక కారణాల వలన వస్తాయి. ముఖ్యంగా సరిపడని వస్తువులు దీనికి కారణం కావచ్చు. దద్దుర్లు వచ్చినప్పుడు కర్పూరాన్ని నీళ్లలో వేసి కొద్దిగా పలుచగా చేసి దద్దుర్లు వచ్చిన చోట పట్టేస్తే త్వరగా తగ్గుతాయి.
11.పొక్కులు తగ్గటానికి: కర్పూరం పేస్టు పలుచగా రాస్తే పొక్కులు ఎక్కడ వచ్చినా త్వరగా తగ్గుతాయి.
12.కురుల కుదుళ్లు: కొబ్బరినూనెని బాగా వేడిచేసి దించి, ఆ వేడి మీద కొద్దిగా ముద్దకర్పూరం వేస్తే నూనెలో కరిగిపోతుంది. ఆ నూనెని తలకు కుదుళ్లంటా పట్టించండి. కుదుళ్లు గట్టిపడతాయి.
13.జుట్టు పెరగటానికి: మనకున్న కాలుష్య వాతావరణంలో జుట్టు తన పట్టు కోల్పోతుంది. కొబ్బరినూనెలో కర్పూరం కొద్దిగా కలిపి తలకు రాసుకుంటే జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అతిగా రాయకండి.
14.తలలో చుండ్రు: కోడిగుడ్డు సొనగానీ, పెరుగు గానీ తీసుకుని, అందులో కొద్దిగా కర్పూరం కలిపి వెంట్రుకలకు పట్టించి ఉంచండి. కొంతసేపయ్యాక తలంటి పోసుకోండి. తరచూ ఇలా చేస్తుంటే తలవెంట్రుకలు గట్టిపడతాయి. తలలో చుండ్రు తగ్గుతుంది.
15.జుట్టు నలుపెక్కటానికి: కొబ్బరినూనెలో కర్పూరం కొద్దిగా కలిపి రాసుకుంటే జుట్టు బాగా నల్లగా మెరుస్తుంది.
(మిగతా వచ్చేవారం)

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com purnachandgv@gmail.com