S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వివేకుని గమనం

వ్యక్తిత్వ వికాసం అంటే ఉన్నత విద్య, ఉన్నత పదవులు, పేరు ప్రతిష్ఠలు, ప్రతిభా పాటవాలు కలిగి ఉండటం మాత్రమే కాదు; కష్టాల్లోనూ మనస్సు దృఢంగా ఉండడం; ప్రలోభాల్లోనూ మనస్సు చలించకుండా ఉండటం; కీర్తి కిరీటాలను ధరించినపుడు కూడా మనస్సు సమతుల్యాన్ని కోల్పోకుండా ఉండడం; ఎదుటివారి బాధలకు స్పందించే మనస్సు కలిగి ఉండడం; మన సాంగత్యం ఇతరులకు స్వాంతన చేకూర్చేదిగా ఉండడం; ఇతరుల ఉన్నతిని ఆస్వాదించగలిగే విశాల దృక్పథం ఉండడం - ఈ లక్షణాలే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనాలు. అటువంటి సంపూర్ణ వ్యక్తిత్వ రూపమే స్వామి వివేకానందుడు.
కన్నీటి కడలిని దాటి... వివేకానందుని తండ్రి హఠాన్మరణం వల్ల ఒకప్పుడు వైభవంగా బ్రతికిన కుటుంబం కటిక దారిద్య్రాన్ని అనుభవించాల్సి వచ్చింది. అపార మేధాశక్తి గల వివేకానందుడికి ఓ చిన్న ఉద్యోగం కూడా దొరకడం గగనమైంది. కుటుంబమంతా రోజుల తరబడి పస్తులుండాల్సి వచ్చింది. వీటికి తోడు బంధువులు ఆస్తిని కాజేశారు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కుటుంబ బాధ్యతలను విడిచి పారిపోలేదు; నిరాశతో కృంగిపోలేదు, ఆత్మహత్యకు సిద్ధపడలేదు. కష్టాల కడలిని దాటి మనోస్థైర్యాన్ని నిరూపించారు. అలాంటి పరిస్థితులే మనకు ఎదురైతే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది?
ప్రలోభాలకు అతీతంగా...
స్వామీజీ కుటుంబ అష్టకష్టాలు పడుతున్నప్పుడు ఆయన మిత్రులు స్వామీజీని పెడదోవలు పట్టించడానికి ప్రయత్నించారు. ఒక ధనవంతురాలిని పెళ్లి చేసుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయనే ప్రతిపాదన కూడా చేశారు. అందుకు స్వామీజీ తిరస్కరించారు. అలాగే, ఒకసారి అమెరికాలో ఓ కోటీశ్వరుడి కుమార్తె స్వామీజీతో నన్ను వివాహం చేసుకుంటే నా ఐశ్వర్యమంతా మీకు అర్పించుకుంటాను- అని ప్రాధేయపడింది. కానీ స్వామీజీ అంగీకరించలేదు. ఇలా ఆయనకు జీవితంలో ఎదురైన ఎన్నో ప్రలోభాలు, ఆకర్షణలను స్థిరచిత్తంతో అధిగమించారు.
‘మన సమస్యలన్నిటికీ కారణం మనస్సును నిగ్రహించుకోలేక పోవడమే! మనస్సును చెడు భావాల నుండి నియంత్రించగలిగితే మనలోని అంతర్గత శక్తి బహిర్గతమవుతుంది.’
-స్వామి వివేకానంద
కీర్తి ప్రతిష్ఠల్లోనూ సమచిత్తం.. స్వామీజీ విశ్వమత మహాసభల్లో పాల్గొన్న మొదటిరోజే విశ్వవిఖ్యాతిగా ప్రసిద్ధిగాంచారు. ప్రపంచంలోని మేధావులు, కోటీశ్వరులు ఆయనకు పాదాక్రాంతులయ్యారు. మహారాజులు సైతం ఆయన కూర్చున్న రథాన్ని లాగారు. ఆయన పాదరక్షలను తమ శిరస్సుతో తాకి ధన్యులమయ్యామని పులకించారు. యావత్ భారతజాతి ఆయనకు నీరాజనాలర్పించింది. ఇలా స్వామీజీ అపార కీర్తిప్రతిష్ఠలు ఆర్జించినప్పటికీ ఆయనలో ఎన్నడూ అహంకారం లేశమైనా పొడసూపలేదు. ఆయన సమచిత్తాన్ని కోల్పోలేదు. అదే మనం ఏ చిన్న విజయం సాధించినా, మనకు ఏ చిన్న అధికారం చేజిక్కినా, ఏ చిన్న ప్రశంస వచ్చినా మన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కీర్తిప్రతిష్ఠలను జీర్ణించుకునే శక్తి మనలో ఎంతమందికి ఉందో అర్థం చేసుకోవచ్చు.
‘్ధర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు. ఓర్పు, స్థిరత్వాలతో పనిచేయి.. ఇదే ఏకైక మార్గము. ఓర్మి, పవిత్రత, ధైర్యం, స్థిరత్వంతో పనిచేయాలని గుర్తుంచుకొని ముందుకు నడువు. పవిత్రంగా ఉండి నీ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నంతకాలం నీకు అపజయం కలుగదు’
- స్వామి వివేకానంద

-శృంగవరపు రచన 99591 81330