S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వినడం

చాలామంది వింటున్నట్టు కన్పిస్తారు. కానీ వారి మనస్సు ఎక్కడో విహారం చేస్తూ వుంటుంది. ఇది క్లాసురూంల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలామంది ఇలా కన్పిస్తూ వుంటారు. వినకపోవడం ఒక మాట అవుతే సరిగ్గా వినకపోవడం కూడా జరుగుతూ వుంటుంది. అసలు వినకపోవడం కన్నా సగం సగం వినడం వల్ల మరీ ప్రమాదం వుంది.
ఎదుటి వ్యక్తులు చెబుతున్న మాటలని వినడం వల్ల ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. వినడం వల్ల ఏదో కొత్త విషయం తెలిసే పరిస్థితి వుంటుంది.
వినడం అనేది ఒక కళ. కొంతమంది చాలా శ్రద్ధగా వింటారు. ఆ చెప్పిన విషయంలోని లోటుపాట్లని చెప్పగలుగుతారు. వినే పద్ధతి అలవర్చుకుంటే చాలా విషయాల్లో అవగాహన ఏర్పడుతుంది. వినడం వేరు. విన్నదాంట్లో మంచిని గ్రహించడం వేరు.
మనుషులు చెప్పేదానే్న కాదు. వస్తువులు, జంతువులు, చెట్లు చేమలు చెప్పే విషయాలని వినాలి. ప్రతి దానికి ఓ భాష వుంటుంది.
పక్షుల కిలాకిలారావాల్లో ఓ భావం వుంటుంది. కుక్క అరుపుల్లో, పిల్లి అరుపుల్లో కూడా ఓ అర్థం ఉంటుంది. చెట్లు గట్టిగా వీచినప్పుడు కూడా ఓ అంతరార్థం ఉంటుంది.
ప్రతి వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటాడు. తన బాధని, వేదనని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తులని చెవులతో కాదు హృదయంతో వినాలి. అంతరాయం లేకుండా వినాలి. ప్రేమతో వినాలి. జాలితో వినాలి.
అన్నింటికన్నా ముఖ్యమైంది -
మన మనస్సు చెప్పే విషయాలని వినడం. మన చర్యలని ఆలోచనలని వినాలి. గమనించాలి.
అప్పుడే మన బలం తెలుస్తుంది.
మన బలహీనతా తెలుస్తుంది.
మన శక్తిసామర్థ్యాలూ తెలుస్తాయి.
మనలని మనం వినడం ద్వారా ఈ విషయాలు బోధపడతాయి.
గాలి మనతో ఏదో చెబుతుంది.
చెట్లు మనతో ఏవో చెబుతాయి.
సూర్యుడూ ఏదో చెబుతాడు.
గ్రహణ శక్తి వుంటే మన వాహనం చెప్పే రొదను గమనించి అందులో వున్న లోపాన్ని గ్రహించవచ్చు.
గోడల భాష తెలిస్తే, ఇంటి భాష తెలిస్తే వాటి మరమ్మత్తు తెలుస్తుంది.
అందరూ మాట్లాడతారు.
కానీ
కొంతమంది మాత్రమే వింటారు.
అందరినీ వినకపోయినా
మన మనస్సుని వింటే చాలు.
మన జీవితంలో పురోగతి ఉంటుంది.

- జింబో 94404 83001