S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసులు తాకే మృదంగ ధ్వని

సిరిపల్లి నాగేశ్వరరావు గారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన తాళమణి వీరు. 70కి పైగా విదేశాలు పర్యటించి కళాసేవ చేసిన మృదంగ విద్వాన్ వీరు. ఎన్నో ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్‌లో వాయించారు. ఎన్నో ప్రదర్శనలకు మృదంగం, ఘటం వాయించారు. 35 సంవత్సరాలుగా మృదంగం, ఘటం సంగీత కచేరీలలో, నృత్య ప్రదర్శనల్లో ప్రతిభ చూపుతున్నారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు సిరిపల్లి వెంకటరమణగారు వీరి తండ్రి, గురువు. తండ్రికి తగ్గ తనయుడు నాగేశ్వరరావుగారు.
ప్రశ్న: మీ ప్రస్థానం గురించి చెప్పండి.
జ: నేను జూన్ 9, 1967న జన్మించాను. మా నాన్నగారు, గురువు సిరిపల్లి వెంకటరమణగారు గొప్ప సంగీత విద్వాంసులు. నేను 14 సంవత్సరాలకే ప్రదర్శించడం మొదలుపెట్టాను. నా చిన్నప్పుడు నాన్నగారు మృదంగం వాయిస్తున్నప్పుడు, ఆ ప్రదర్శనల్లో నేను ఘటం వాయించేవాడిని. తరువాత నేను మృదంగం ప్రదర్శించేవాడిని. నేను మృదంగంలో డిప్లొమా చేశాను. దూరదర్శన్ ఇంకా ప్రసారభారతి ఆలిండియా రేడియో - ఆకాశవాణిలో ‘బి’ హై కళాకారుడిని. ఐసిసిఆర్ లో కూడా సీనియర్ ఆర్టిస్ట్ ఎంపానల్‌మెంట్ ఉంది. 1987 నుండి 1992 దాకా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పని చేశాను. తరువాత నిజామాబాద్‌లో శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ మ్యూజిక్ డాన్స్ కాలేజీలో పని చేశాను. మృదంగం అసిస్టెంట్ లెక్చరర్‌గా, ఆపై కోఠీలో గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీలో పని చేశాను. ఇప్పుడు శ్రీ భక్తరామదాసు గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ, వెస్ట్‌మారేడ్‌పల్లి, సికిందరాబాద్‌లో పని చేస్తున్నాను. ఎంతోమంది నా శిష్యులు సర్ట్ఫికెట్, డిప్లొమాలు చేశారు.
ప్రశ్న: మీ కుటుంబంలో అందరూ సంగీత విద్వాంసులేనా?!
జ: నాన్నగారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు సిరిపల్లి వెంకటరమణగారు. నా చెల్లెలు అనూరాధ ప్రఖ్యాత వేణువు విద్వాంసురాలు. నా జీవిత భాగస్వామి కిరణ్మయి కూచిపూడి నర్తకీమణి; శ్రీమతి సువర్ణలతగారి శిష్యురాలు. మా బాబు వెంకటసాయి ఫణీశ్ బి.టెక్ చేశాడు. మృదంగంలో సర్ట్ఫికెట్ చేశాడు. కిరణ్మయి అన్న వినోద్ కూడా ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు. అతడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో పని చేస్తున్నాడు.
ప్ర: ఏయే దేశాలు తిరిగారు?
జ: నేను 70కి పైగా విదేశాలు పర్యటించి మృదంగ ప్రదర్శనలిచ్చాను. సింగపూర్, మలేసియా, యుఎస్‌ఎ, యుకె, వెస్టిండీస్, యుఎఇ, గల్ఫ్, కెనడా, లండన్, పనామా, స్విట్జర్లాండ్, నార్వే, సిరియా, న్యూజిలాండ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మారిషస్, జమైకా మొదలకు ఎన్నో దేశాలలో ప్రదర్శించాను. అలేఖ్య అక్కతో ఐసిసిఆర్ టూర్ చేశాను గల్ఫ్ దేశాలలో. అలేఖ్య అక్క ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్యం నర్తకీమణి. సంగీత నాటక అకాడెమీ గ్రహీత. నన్ను తమ్ముడిలా చూసుకుని, ఎంతో ప్రోత్సహించారు. వనజ గారితో సౌత్ ఆఫ్రికా, సింగపూర్ పర్యటించాను. రాజారెడ్డి గారితో 50కిపైగా విదేశాల్లో పర్యటించాను. ఉమారామారావు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. షికాగోలో సిరి, సీత అక్కచెల్లెళ్లు మంచి నర్తకీమణులు. వారి ప్రదర్శనల్లో పాల్గొన్నాను.
ప్ర: మీరు పొందిన గౌరవ పురస్కారాల గురించి..
జ: ముంబైలోని సుర్ శృంగార్ సంసద్ నాకు తాళమణి అవార్డు ఇచ్చింది. కాకినాడలో సరస్వతీ గానసభ మృదంగ విద్వాన్ బిరుదునిచ్చి సన్మానించారు. ఎన్నో విదేశాలకు వెళ్లాను. ఎన్నో ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్‌లో మృదంగం వాయించాను.
ప్ర: మీరు ఏయే కళాకారులతోపాటు మృదంగం వాయించారు?
జ: పద్మవిభూషణ్ బాలమురళీ కృష్ణగారు, పద్మభూషణ్ రాజా - శ్రీమతి రాధారెడ్డి దంపతులు, శ్రీమతి ఉమా రామారావుగారు, శ్రీమతి అలేఖ్య పుంజాల గారు, డా.్భగవతుల సేతురాంగారు, నేదునూరి కృష్ణమాచార్యులుగారు, ఈమని శంకరశాస్ర్తీగారు, చిట్టిబాబుగారు, శ్రీరంగం గోపాలరత్నంగారు, నూకల చినసత్యనారాయణగారు, మాండలిన్ శ్రీనివాస్‌గారు, హైదరాబాద్ సిస్టర్స్ లలిత - హరిప్రియ, శ్రీమతి స్వప్న సుందరిగారు ఇలా ఎంతోమందితో దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చాను. వేల నృత్య ప్రదర్శనలకు, వేల సంగీత కచేరీలకు మృదంగం వాయించాను. కొన్నిటిలో ఘటం వాయించాను కూడా.
ప్ర: మీరు పాల్గొన్న డాన్స్ ఫెస్టివల్స్ వివరాలు చెప్తారా?
జ: అతి ప్రతిష్ఠాత్మకమైన ఖజురహో డాన్స్ ఫెస్టివల్, కోణార్క్, నిషాగంధి, సూర్య, కూచిపూడి, బాంబే, హైదరాబాద్ ఇలా ఎన్నో డాన్స్ ఫెస్టివల్స్‌లో మృదంగం వాయించాను.
ప్ర: కళాకారుడిగా మీ అనుభూతులు?
జ: ప్రతి ప్రదర్శన మధురస్మృతే. బాలమురళీకృష్ణ గారితో యుఎస్‌ఏలో సింగపూర్‌లో మృదంగం వాయించాను. జయేంద్ర సరస్వతి, గణపతి సచ్చిదానంద సరస్వతి, చిన్నజీయర్‌స్వామి, సత్యసాయిబాబా, అప్పటి భారత ప్రెసిడెంట్ ఆర్.వెంకటరామన్‌గారు, అప్పటి భారత ప్రధానులు శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీగారి సమక్షంలో మృదంగం వాయించాను.
ప్ర: ఎలా అభ్యాసం చేసేవారు?
జ: చిన్నప్పుడు చిక్కడపల్లిలో (హైదరాబాద్) ఉండేవాళ్లం. పొద్దునే్న 4-7 గంటల దాకా మేడ మీద అభ్యాసం. చెల్లెలు అనూరాధ వేణువు, వినోద్ కూడా మృదంగం వాయించే వాళ్లు. ముందు సోలో, తర్వాత సహకారం అభ్యాసం చేసేవాళ్లం. స్కూల్ అయ్యాక మళ్లీ రాత్రి ప్రాక్టీస్.
ప్ర: మీరు కళాకారులకిచ్చే సందేశం.
జ: బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వినికిడి జ్ఞానం బాగా పెంపొందించుకోవాలి. కనీసం 10 సంవత్సరాలు నేర్చుకుని అభ్యాసం చేస్తే అప్పుడు కచేరీలలో ప్రదర్శించడానికి తయారవుతారు.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి