S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్రీడీ టాటూ మాయ..

కడుపు చించుకుని పేగులు బయటపడినట్లు..
మెడపై సీతాకోకచిలుక వాలి గిలిగింతలు పెట్టినట్లు..
కడుపులోనే లోయలు ఏర్పడినట్లు..
ఇదంతా మాయ అనుకునేరు.. నిజమే! నేడు శరీరంపై త్రీడీ టెక్నాలజీ చేస్తున్న టాటూ మాయ అంతా ఇంతా కాదు. టాటూ అంటున్నారు.. రెండక్షరాలు పచ్చబొట్టు రూపంలో వేయించుకోవాలంటేనే భయంకరమైన నొప్పి కదా.. మరి శరీరంపై ఇంత పెద్ద పెద్ద పచ్చబొట్లు వేసుకోవాలంటే ఒళ్ళంతా కుళ్ళపొడిపించుకోవాల్సిందేనా.. అనుకుంటున్నారు కదూ.. భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వీటిల్లో చాలావరకూ టెంపరరీ టాటూలే.. చేయి తిరిగిన కళాకారులు వేసిన అందమైన కుంచె చిత్రాలే.. ఇవి కొద్దిరోజుల్లోనే చెరిగిపోతాయి. ఇక టెంపరరీ టాటూల సంగతి అందరికీ చెప్పాల్సిన పనిలేదు. అవి నీళ్ళతో కడగగానే పోతాయి. మరికొన్ని కొద్దిరోజులపాటు ఉండి క్రమంగా చెరిగిపోతాయి. వీటికే త్రీడీ ఎఫెక్టుల్ని ఇచ్చి తయారుచేస్తున్నారు కొంతమంది కళాకారులు. ఈ ఎఫెక్టుల వల్ల ఆ బొమ్మలు నిజంగా ఒంటిమీద ఉన్నట్లే అనిపిస్తుంది. అందుకే ఇవి యువత మనసుల్ని దోచేస్తున్నాయి. అయితే వీటిని వేయించుకోవడానికి చాలా సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. అందువల్ల అందరూ వీటివైపు వెళ్ళలేకపోతున్నారు. అలాంటివారికోసం త్రీడీ టాటూ స్టిక్కర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి చూడటానికి నిజం బొమ్మల్లా ఉంటున్నాయి. అంటే నిజంగానే మన శరీరంపై సీతాకోకచిలుక వాలినట్లూ, కడుపులోంచి పేగులన్నీ బయటకు వచ్చినట్లూ, కడుపులో ఓ పెద్ద అగాధం ఏర్పడినట్లు భ్రమ పెడుతున్నాయి. ఈ మాయ చేసేదే త్రీడీ కళాకారులే.. అందమైన బొమ్మలను త్రీడీ స్టిక్కర్లుగా మారుస్తున్నారు. వీటిని శరీరానికి అంటించుకుంటే సరి. ముందుగా టాటూ వేయాలనుకున్న భాగాన్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తరువాత నచ్చిన స్టిక్కరును తీసుకుని బొమ్మ ఉన్న వైపుని శరీరంలో నచ్చినచోట పెట్టి, తడిబట్ట లేదా స్పాంజ్‌తో తిరగేసిన స్టిక్కర్ మీద నొక్కుతూ రుద్దాలి. తరువాత నెమ్మదిగా ఒక చివరిభాగం నుంచి ఈ స్టిక్కర్‌ను తీసేయాలి. అప్పుడు అడుగున ఉన్న బొమ్మ శరీరంపై ముది తమవుతుంది. ఈ రకం టాటూలన్నీ కొద్దిరోజులపాటు ఉంటాయి. అనవసరం అనుకున్నప్పుడు ఈ టాటూలను తొలగించుకోవాలంటే కోల్డ్ క్రీమ్‌ను టాటూలపై రాసి ఓ రెండు నిముషాల తర్వాత రుద్దేస్తే సరి.. ఇలా నచ్చినచోట, నచ్చిన విధంగా, నచ్చిన సమయం వరకు టాటూలను వేసుకుని తొలగించుకోవచ్చు. అదే పర్మినెంటు టాటూలైతే తొలగించడం కష్టం. అదే ఇవైతే ఆ డిజైన్ బోర్ కొట్టి, మరో డిజైన్ వేయించుకోవాలంటే వెంటనే తుడిచేసుకుంటే సరి! బాగున్నాయి కదూ.. టెంపరరీ టాటూలు.. ఇంకెందుకాలస్యం.. మీ అభిరుచిని బట్టి టాటూలను ఎంపిక చేసుకోవడానికి పదండి మరి!