S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 87 మీరే డిటెక్టివ్

పదోరోజు గడిచాక భరతుడు శుద్ధి చేసుకుని, పనె్నండో రోజు శ్రాద్ధకర్మలు చేయించాడు. బ్రాహ్మణులకి రత్నాలు, డబ్బు, కడుపు నిండా భోజనం, విలువైన బట్టలు, మంచి వస్తువులు దానం చేసాడు. దశరథుడి ఉత్తమగతికి పూజలు చేసే సమయంలో భరతుడు అనేక తెల్లటి మేకల మందని, వందల కొద్దీ ఆవులని, దాసదాసీ జనాన్ని, వాహనాలని, పెద్ద ఇళ్లని దానం చేసాడు. పదమూడో రోజు ఉదయం తండ్రి అస్థికల కోసం స్మశానానికి వెళ్లిన మహాబాహువైన భరతుడు పెద్దగా ఏడిచాడు. తండ్రి చితి దగ్గరకి వెళ్లి చాలా విచారంతో చెప్పాడు.
‘నాన్నా! నువ్వు నన్ను ఏ రాముడికి అప్పగించావో ఆ రాముడు అరణ్యానికి వెళ్లిపోయాడు. ఇక నన్ను ఇప్పుడు శూన్యంలో వదిలేసావు. అనాధురాలైన కౌసల్యకి పోషకుడు కావలసిన రాముడ్ని అడవికి పంపి, నువ్వు కూడా ఇప్పుడు ఆవిడని విడిచి ఎక్కడికి వెళ్లిపోయావు?’
ఎముకలు కాలిపోగా ఎర్రటి బూడిదగా మారిన తన తండ్రి శరీరాన్ని ఆ మండలాకారంలో చూసి భరతుడు బిగ్గరగా ఏడ్చాడు. దీనుడై ఎముకలని పైకి ఎత్తుతూండగా, యంత్రం పైన అమర్చిన ఇంద్రుడి జెండలా జారి నేలపై పడ్డాడు. అప్పుడు అతని మంత్రులు అంతా అంత్యకాలంలో కిందపడ్డ మాండవ్యుడ్ని ఋషులు చుట్టుముట్టినట్లుగా శుద్ధమైన నియమాలు గల భరతుడ్ని వేగంగా సమీపించారు. శతృఘు్నడు కూడా భరతుడ్ని చూసి శోకంతో నిండినవాడై రాజుని స్మరిస్తూ స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. ఆయా తండ్రి అవయవాలని ఆయా విధాలుగా తలుచుకుంటూ పిచ్చివాడిలా మనస్థైర్యం కోల్పోయి విలపించాడు. మంథర నించి పుట్టి, కైకేయి అనే మొసలి చేత కోరబడ్డ భయంకరమైన, తీవ్రమైన, బాధ పడటానికి శక్యం కాని వరదానం శోకసముద్రంలా అందర్నీ ముంచేసింది.
‘తండ్రీ! సుకుమారుడు, బాలుడు, ఎప్పుడూ నీ చేత లాలింపబడ్డ వాడైన భరతుడు ఇలా విలపిస్తూంటే ఎక్కడికి వెళ్లావు? ఆహార పదార్థాలు, పానీయాలు, వస్త్రాలు, అలంకారాలు తీసుకోమని మా అందరికీ ఆయా వస్తువుల్ని ఇస్తూండేవాడివి కదా? ఇప్పుడు మాకు ఎవరు ఇస్తారు? ధర్మాత్ముడు, మహాత్ముడు, రాజైన నువ్వు లేని ఈ భూమి బద్దలవ్వాల్సింది. కాని అలా బద్దలవడం లేదు. తండ్రి స్వర్గస్థుడయ్యాడు. రాముడు అరణ్యానికి వెళ్లాడు. ఇంక నాకు జీవించే సామర్థ్యం ఎక్కడ ఉంది? అగ్నిలో ప్రవేశిస్తాను. సోదరుడు, తండ్రి లేని నేను, ఇక్ష్వాకు వంశీకులతో పాలించబడి, శూన్యమై పోయిన అయోధ్యలో ప్రవేశింపను. తపోవనానికి వెళ్తాను.’
ఇలా వారిద్దరి విలాపాలు విని, వచ్చిపడ్డ ఆపదని చూసిన వారి అనుచరులంతా చాలా దుఃఖించారు. దుఃఖంతో అలసిన భరత, శతృఘు్నలు ఇద్దరూ కొమ్ములు విరక్కొట్టబడ్డ రెండు ఎద్దుల్లా నేల మీద దొర్లారు. అప్పుడు ఉత్తమ స్వభావం కల జ్ఞానవంతుడు, వీరి తండ్రికి పురోహితుడైన వసిష్ఠుడు భరతుడ్ని లేవదీసి చెప్పాడు.
‘ప్రభువైన ఓ భరతా! నీ తండ్రి మరణించి ఇవాళ్టికి పదమూడో రోజు. నువ్వు ఇక్కడ ఆలస్యం చేస్తున్నావేమిటి? ఇంకా అస్థిసంచలనం మిగిలి ఉంది. ఆకలిదప్పులు, సుఖదుఃఖాలు, జనన మరణాలు అనే మూడు జంటలు అన్ని ప్రాణుల విషయంలోనూ భేదం లేకుండా ప్రవర్తిస్తాయి. వాటి నించి తప్పించుకోవటం ఎవరి శక్యం కాదు. అలాంటి స్థితిలో నువ్వు ఇలా అవడం బాగాలేదు.’
తత్త్వవేతె్తైన సుమంత్రుడు శతృఘు్నణ్ణి లేవదీసి, సమస్త ప్రాణులకి జన్మ, మరణాలు తప్పవనే విషయాన్ని బోధించాడు.
నేల మీంచి లేచిన ఆ కీర్తిమంతులు ఇద్దరూ వర్షానికి తడిసి, తర్వాత ఎండకి ఎండి రంగు మారిన రెండు ఇంద్రధ్వజాల్లా ఉన్నారు. కన్నీరు తుడుచుకుని, ఎర్రబడ్డ కళ్లతో దీనంగా మాట్లాడే ఆ రాజకుమారులని మంత్రులు మిగిలిన పనిని చేయమని తొందరపెట్టారు. (అయోధ్య కాండ 77వ సర్గ)
తర్వాత రాముడి దగ్గరకి వెళ్లాలని ఆలోచిస్తూ, శోకంతో బాధపడే భరతుడితో లక్ష్మణుడి తమ్ముడైన శతృఘు్నడు చెప్పాడు.
‘బలశాలైన రాముడు సకల ప్రాణులకి గతి. మనకి ఆపద వచ్చినప్పుడు అతనే రక్షకుడని వేరుగా చెప్పాలా? అలాంటి రాముడ్ని ఓ ఆడది అడవికి పంపేసింది. బలవంతుడు, పరాక్రమవంతుడైన మన సోదరుడు లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు కదా? అతడైనా తండ్రిని ఆపి రాముడ్ని ఎందుకు వనవాసం నించి విడిపించలేదు? ఆడదానికి వశుడై తప్పుదారిలో సంచరించిన రాజుని న్యాయాన్యాయాలు పరీక్షించి ముందుగానే ఆపి ఉంటే బావుండేది.’
శతృఘు్నడు ఇలా మాట్లాడే సమయంలో సర్వాభరణాలు అలకరించుకున్న మంథర తూర్పు ద్వారంలో వాళ్లకి కనపడింది. ఆమె మంచి గంధం పూసుకుని, రాజులు ధరించే చాలా విలువైన బట్టలని ధరించి, అనేక రకాల అలంకారాలతో ఉంది. అప్పుడు ద్వారపాలకులు పెద్ద పాపం చేసిన, జాలిలేని ఆ మంథరని చూసి, ఆమెని పట్టుకుని శతృఘు్నడికి చెప్పారు.
‘ఎవత్తె మూలంగా రాముడు అరణ్యానికి వెళ్లాడో, నీ తండ్రి మరణించాడో, పాపాత్మురాలు, క్రూరురాలైన ఆ ఆడది ఇదిగో. ఈమెని ఏం చేయాలనుకున్నావో అది చేయి’
బాగా విచారించే, ఉత్తమ నియమవంతుడైన శతృఘు్నడు ఆ మాటలు విని అంతఃపురంలోని వారందరితో ఇలా చెప్పాడు.
‘మా అన్నదమ్ములకి, నా తండ్రికి తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన ఈమె తను చేసిన క్రూరమైన పనికి తగిన ఫలం అనుభవించి తీరాలి.’
వెంటనే మంథరని బలవంతంగా పట్టుకున్నారు. దాసీజనంతో కూడిన ఆమె ఆ ఇల్లు మారుమోగేలా ఏడ్చింది. ఆమె స్నేహితురాళ్లంతా శతృఘు్నడికి కోపం వచ్చిందని తెలుసుకుని వెంటనే నాలుగు దిక్కులకీ పారిపోయారు. ‘ఇతన్ని చూస్తే మనందరినీ ఒక్కరూ మిగలకుండా చంపేసేట్లున్నాడు. జాలి, ఔదార్యం గల, ధర్మం తెలిసిన కౌసల్యని శరణు వేడుదాం. ఆమె తప్పక మనల్ని రక్షిస్తుంది’ అని ఆమె స్నేహితురాళ్లంతా అనుకున్నారు.
రోషంతో కళ్లు ఎర్రబడ్డ శతృఘు్నడు అరిచే ఆ గూని దాన్ని నేల మీదకి పడేసాడు. అలా చేసినప్పుడు ఆమె ధరించిన చిత్రమైన, అనేక రకాల అలంకారాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా చెల్లాచెదురైన అవన్నీ ఆ రాజగృహంలో శరత్‌కాలంలో నక్షత్రాలతో నిండిన ఆకాశంలా ప్రకాశించాయి. బలవంతుడైన శతృఘు్నడు ఆమెని బలంగా పట్టుకుని, కైకేయిని భయపెడుతూ కోపంగా చెప్పాడు. కైకేయి ఆ తిట్లకి, మాటలకి చాలా దుఃఖిస్తూ, శతృఘు్నడి వల్ల ఏం ఆపద కలుగుతుందో అని భయపడుతూ తన కొడుకుని శరణు కోరింది. భరతుడు కోపంగా ఉన్న శతృఘు్నడితో చెప్పాడు.
‘ఏ జీవుల్లోనైనా స్ర్తిలని చంపకూడదు. కాబట్టి దీన్ని క్షమించు. ధర్మాత్ముడైన రాముడు మాతృహత్య చేసినందుకు నన్ను నిందిస్తాడు. లేకపోతే నేను చెడ్డగా ప్రవర్తించిన పాపాత్మురాలైన కైకేయిని చంపేసేవాడిని. మనం ఈ గూని దాన్ని చంపినట్లు రాముడికి తెలిస్తే, అతను నీతో, నాతో కూడా మాట్లాడడు అన్నది నిజం.’
శతృఘు్నడు భరతుడి మాటలు విని, కోపాన్ని అణచుకుని మంథరని విడిచిపెట్టాడు. ఆమె కైకేయి పాదాల మీద పడి చాలా విచారిస్తూ, నిట్టూరుస్తూ ఏడ్చింది. దూరంగా విసిరివేయడం వల్ల దుఃఖిస్తూ వలలో చిక్కుకున్న మయూర పక్షిలా నాలుగు వైపులా చూసే ఆ గూనిదాన్ని భరతుడి తల్లైన కైకేయి మెల్లగా ఓదార్చింది. (అయోధ్య కాండ 78వ సర్గ)
‘ఇవాళ మూడు చిన్న సర్గలని చెప్పాను. మిగిలిన కథని రేపు చెప్పుకుందాం. అంతదాకా సెలవు’ కథ ముగిస్తూ హరిదాసు చెప్పాడు.
ఓ వైష్ణవుడు మంగళహారతి తర్వాత హరిదాసుతో చెప్పాడు.
‘దాసుగారు! మీ గాత్రం అద్భుతం. మీ మాట వినసొంపుగా ఉంది. అంతా చక్కగా చెప్పారు. కాని ఐదు చిన్న తప్పులని చెప్పారు.’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*

మీకో ప్రశ్న

ఇక్ష్వాకు వంశానికి గల
మరో పేరు ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
సరయు నదికి గల మరో పేరు ఏమిటి?
సరయు నదికి కాళీ, శారద అనే రెండు పేర్లున్నాయి.
*
1.రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే, దీనులై, పైకి చూస్తూ యాచించే బిచ్చగాళ్ల ఆశని నిష్ఫలం చేసే వాడికి ఎంతటి పాపం వస్తుందో అంత పాపం నాకు కలుగు గాక.
2.రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే ఋతుస్నానం చేసి, ఋతుకాలాన్ని పాటించే పతివ్రతైన భార్యని కలవని దుష్టుడికి ఎంతటి పాపం వస్తుందో నాకు అంత పాపం కలుగుగాక.
3.రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే లేగదూడ ఉన్న ఆవు పాలని దాని కోసం మిగల్చకుండా పితికితే ఎంత పాపం వస్తుందో అది నాకు కలుగుగాక.
4.రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే, నీళ్లు ఉండి కూడా లేవని చెప్పి, దాహంతో ఉన్న వాడి దాహం తీర్చని వాడికి ఎంతటి పాపం వస్తుందో అది నాకు కలుగుగాక.
5.రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే, కొందరు రెండు పక్షాలుగా విడిపోయి పోట్లాడుకుంటూంటే, వాళ్లని విడదీయకుండా దారిలో నిలబడి చోద్యం చూసే వాడికి ఎంతటి పాపం వస్తుందో అని నాకు కలుగుగాక.
6.్భరతుడితో మాట్లాడింది వశిష్ఠుడు. కాని విశ్వామిత్రుడు అని హరిదాసు పొరపాటుగా చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి