S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలెగ్జాండర్.. కాకి

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
మహావీరుడు అలెగ్జాండర్‌కు విజయం! కానీ అంతటి మహాబలుడూ సామాన్యుడిలా జ్వరంతో కుంగిపోయాడు. మరి ఆయనగారి గొప్పతనమంతా ఏమయింది? తన చెవిలో మాటిమాటికీ ఈ ప్రశ్న జోరీగలా మారి భరించలేక, గంట కొట్టాడు. అదే సమయానికి అయోనియా సైనికుడు శిరస్త్రాణంతోసహా ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. కుడిచేత్తో రెండంచుల పదునైన కత్తి, ఎడమ చేతిలో పెద్ద ఈటె పట్టుకుని ఉన్నాడు. మూడుసార్లు గౌరవవందనం చేసి తలొంచుకుని ఆదేశం కోసమన్నట్టు నిలబడ్డాడు. అలెగ్జాండర్ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ దగ్గుపొర కమ్మేసింది. తాడు మీద బొమ్మలా అంతటి పొడవాటి బలమైన సైనికుడూ అలెగ్జాండర్ దగ్గరకు వచ్చాడు. వొంగి ఆదాబ్ చేసి ఉమ్మేయడానికి వెండిపాత్ర అందించి పక్కనే నిలబడ్డాడు. చక్రవర్తి మూడు, నాలుగుసార్లు ఉమ్మి అలసి వెనక్కి వాలాడు. చక్రవర్తి గొంతు శే్లష్మంతో ముద్ద ముద్దగా మారింది. సైనికుడు నీళ్లతో చక్రవర్తి మూతి తుడిచాడు. ఆయనకి నీళ్లు అందించాడు. అలెగ్జాండర్ మూతి, మొహం కడిగాడు. కొద్దిసేపు పైకప్పుకేసి చూశాడు. తర్వాత సైనికుని ఆదేశించాడు. ‘మూడు రోజులు గడిచాయి. అయోమియా చికిత్సలు ఏమీ పని చేయలేదు. హకీమ్‌ను త్వరలోనే పట్టుకోవాలి. ఈలోగా నువ్వు పంజాబ్ అంతా ప్రతీమూలా వెతికి ఓ మంచి వైద్యుడ్ని పట్టుకురా. జ్వరం తగ్గేలా లేదు. తల పగిలిపోతోంది. ఒళ్లు నొప్పులు. నిద్ర పట్టడంలేదు. వాడిన అన్ని మందులూ నా ఆరోగ్యాన్ని మరీ క్షీణింపజేశాయి. వెంటనే వెతకండి. వైద్యుడిని సాయంత్రానికల్లా తేకుంటే ఇక్కడే ఏ ఒక్కడినీ బతకనివ్వను. నే నిక్కడ జ్వరంతో ఛస్తుంటే మీరంతా ఆరోగ్యంగా చుట్టూ తిరుగుతారా! సిగ్గులేదు? మీరంతమంది ఉండి అవమానం, ఎంతో అవమానం. నా జ్వరం తగ్గకముందు ఏ ఒక్క సైనికుడయినా తిన్నాడో వాడి తల తెగపడుతుంది. ఇంకా నిలబడి చూస్తున్నావే? వెళ్లు!’
అరగంటయినా గడిచిందో లేదో సైనికుడు తిరిగి వచ్చాడు. అలెగ్జాండర్ కళ్లు తెరిచి ‘ప్రతీ ఒక్కరికీ తెలియజేశావా?’ అన్నాడు.
‘అవసరం లేదు మా భాగ్యదాతా! హిందూస్థాన్ ప్రముఖ వైద్యుడు స్వయంగా ఇక్కడికే వచ్చాడు’
అలెగ్జాండర్ నవ్వడానికి ప్రయత్నించాడు. ఆయనవల్ల కాలేదు. కడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘ఇది నిజంగా వింత భూమి. నేను ఎన్నో ప్రాంతాలు జయించాను. కానీ ఇలాంటిది ఎక్కడా చూడలేదు. సరే. ఆయన ఎక్కడ? నీతోపాటు ఎందుకు తీసుకురాలేదు?’ అడిగాడు.
‘ఆయన గుడారం బయట వేచి ఉన్నారు హుజూర్! తమరు ఆదేశిస్తే మీ ముందుకు తీసుకువస్తాను’
‘ఆపు పిచ్చి మాటలు. అలాంటిదానికీ ఆదేశించాలా? నీ బుర్ర, మెదడు ఉపయోగించకు. ఇది పని కావలసిన సమయం కదా! వెళ్లు, వెంటనే ఆయన్ను లోనికి తీసుకురా!’ అన్నాడు.
అలెగ్జాండర్ కోపంతో అరవడం విని ఆ వైద్యుడు చొరవ చేసుకుని నేరుగా లోపలికే వచ్చేశాడు. అలెగ్జాండర్‌ను చూసి నవ్వి, ‘నన్ను పిలవాల్సిన పనిలేదు. నా బుర్రలో మెదడు ఉపయోగించి నేనే లోనికి వచ్చాను’ అన్నాడు.
తెల్లని మెరుస్తున్న జుత్తు, పొడవాటి గడ్డంతో ఉన్న మనిషిని చూసి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. పెద్ద పొడవాటి కనుబొమలు, సూదంటి ముక్కు, ప్రేమ, కరుణ పొంగిపొర్లుతోన్న కళ్లు, దేవలోక ప్రతినిధి తన ముందుకు వచ్చినట్లయింది. చక్రవర్తి ఓ క్షణంపాటు తన అనారోగ్యాన్ని మర్చిపోయాడు. పరుపు మీద అనారోగ్యంతో ఉన్న మనిషి మొహం కళ్లలోకి సాలోచనగా చూశాడు వైద్యుడు. అతని ముఖం అయోనియా దేవతకిలా మెరుస్తోంది. ఇటీవల పట్టిన అనారోగ్యం తాలూకు నీరస ఛాయలూ కనిపించాయి. కళ్లలో మొండితనం ఉంది. పెదవులు లేత గులాబీ రంగులో ఉన్నాయి. నల్లని పెద్దపెద్ద కనుబొమలు, పొడవాటి బలమయిన చేతులు. ఏదో ముద్రలో ఉన్నట్టున్న బలమయిన శరీరం!
తన గురువు అరిస్టాటిల్‌ని చూసిన భ్రమ కలిగింది అలెగ్జాండర్‌కి. ఏదో చెప్పబోయి, మరుక్షణం విపరీతమయిన దగ్గు దొంతరతో చెవులు దిమ్మెక్కిపోతోంది. చేయి చాచాడు. వచ్చిన వైద్యుడు పరీక్ష చేసేందుకు. ‘అక్కర్లేదు. మేము ముందు రోగి ముఖం, పళ్లు పరీక్షించడం ద్వారా ప్రాథమిక చికిత్స ఆరంభిస్తాం. చేయి పరిశీలించిగాదు. ఇది కాలానుగుణంగా వచ్చిన జ్వరం.. ఊష్ణం. ఇది పదిహేడు రోజులకుగాని వదలదు.’ ఓ క్షణం ఆగి, మళ్లీ అన్నాడు. ‘ఇప్పటివరకూ మీరు తిన్నవి, తాగిన వాటితో ప్రయోజనం లేదు. కానీ ఇవాళ్టి నుంచీ మత్తుపానీయం, మాంసాన్ని తీసుకోవద్దు. శరీర తత్వాన్ని దెబ్బతీస్తుంది. జ్వరం పోయినా సరే, మీరు నా ఆదేశాలు కచ్చితంగా పాటించాలి. లేకుంటే జ్వరం తిరిగి ప్రమాదకర స్థాయిలో రావచ్చు.’
విశ్వవిజేత లోలోపల ఒకింత వొణికాడు. వేలాదిమందిని అంతం చేసిన ఈ యోధుడు ఇపుడు తన జీవిత భవిష్యత్తు తెలిసి భయపడుతున్నాడు. భయంతో వణుకుతూ ఇలా అన్నాడు, ‘ప్రమాదమా? ఏం ప్రమాదం? మామూలు జ్వరం ప్రమాదకరం ఎలా అవుతుంది? మీరేమంటున్నారు? సరిగా చెప్పండి.’
‘ఇది మామూలు జ్వరం కాదు. తినకూడని వాటిని మూడు రోజులు తిన్నారు. చేయకూడనివి మూడు రోజులు చేశారు. అదే మీ పరిస్థితిని ఈ స్థితికి తెచ్చింది. ఇప్పటికైనా అన్ని జాగ్రత్తలూ తీసుకోండి. అప్పుడే అన్నీ తగ్గుతాయి. లేకుంటే కావు’
వైద్యుడు చెబుతున్నది చక్రవర్తి, సైనికుడూ విని భరించలేకపోయారు. సైనికుడు తన కత్తి ఒరను తట్టాడు. అలెగ్జాండర్ కోపగించుకున్నాడు. ‘చక్రవర్తి మాటను తిరస్కరిస్తే ఏమవుతుందో తెలుసా? నేను అలెగ్జాండర్‌ను. నా విజయగాథను ఎన్నడన్నా విన్నావా?’
‘కొంత విన్నాను. స్వయంగా కళ్లారా చూశాను కూడా’ అన్నాడు వైద్యుడు, ఏ మాత్రం బెరుకు లేకుండా. ‘పంజాబ్ దారుణాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు?’
చక్రవర్తి దీర్ఘాలోచనలో పడ్డాడు. చక్రవర్తిని చూడగానే వైద్యుడు అర్థం చేసుకున్నాడు. అతనింకా ఏవో చెప్పబోయేడు. అలెగ్జాండర్ దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు, ‘అయినా మీరంతట మీరే నాకు చికిత్స చేయడానికి వచ్చారు. ఇదే నాకు అర్థం కావడం లేదు’
పెద్దాయన నవ్వాడు. మరింత దగ్గరగా వచ్చి అలెగ్జాండర్ కళ్లలోకి చూసి ‘దీనిలో రహస్యమేమీ లేదు. నా దేశం తరఫున సంపూర్ణ బాధ్యత ప్రదర్శిస్తున్నాను. అదే సమయంలో రోగుల పట్ల నా పని నిర్వర్తిస్తాను. ఇవి రెండూ సంబంధం లేని రెండు అంశాలు. రెండూ కలిపితే సమస్యకు దారితీస్తాయి.’
‘రోగి? రోగి అన్నారా? నేను అలెగ్జాండర్‌ని. అలెగ్జాండర్ ద గ్రేట్! లోకాన్ని జయించిన తొలి విజేత. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్న దాంట్లో అర్థం ఉందా?’
‘నేను పూర్తి జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను. లేకుంటే పిలవకుండానే స్వయంగా ఎందుకు వస్తాను. ఇది తప్ప నాకు వేరే జ్ఞానం లేదు. కానీ దయుంచి ఇదంతా మనం ఈ సంగతి వదిలేద్దాం. మీ చికిత్సకు కావలసినవి నేను తెచ్చాను. ఒక్క మూలిక తప్ప. దాన్ని అడవిలో వెతికి తెస్తాను’ అని వైద్యుడు అనుమతి కోసం లేచి ఉండక గది నుంచి బయటికి వెళ్లిపోయాడు.
‘ఆయన వెంట ఎప్పుడూ ఇద్దరు సైనికులు ఉండండి’ అని అలెగ్జాండర్ ఆదేశించాడు.
‘ఆదేశం శిరసావహిస్తాం, ప్రపంచ రక్షకుడా!’
ప్రపంచ రక్షకుడు మెల్లగా తనలో తాను ఇలా అనుకున్నాడు, ‘ఎంతటి చిత్రమయిన ప్రజలు! ప్రతీ పిల్లాడు, ప్రతీ ముసలాడు, ప్రతీ మహిలా.. ప్రతీ ఒక్కరూ వేదాంతి. అయోనియనీయుడు. కానీ ప్రతీ ఒక్కరూ వేలం వేయదగ్గ బానిసలు అని నా గురువు అరిస్టాటిల్ ఎలా అన్నారు? అది ఎంతవరకూ నిజం? పోరస్‌తో ఒడంబడిక చేసుకుని ఇక్కడే ఉండిపోను నిర్ణయం తీసుకుంటా.’
వయసులో పెద్దయినా, వైద్యనిపుణుడు అయిన అతనికి రాజకీయాల్లో సంక్లిష్టతలు అంతగా తెలియదు. మందుల మిశ్రమాన్ని చేసి అడవి నుంచి నేరుగా వచ్చేశాడు. చిన్ని పాత్ర నిండా దాన్ని తాగాలని అలెగ్జాండర్‌ను వత్తిడి చేశాడు.
‘ఈ మందు మోతాదు విషయం నేను జాగ్రత్త తీసుకుంటాను. ప్రతీ మూడు గంటలకోసారి తాగాలి’ అని ఒత్తిడి చేశాడు.
‘ఇది మొదట నువ్వు తాగాలి. ఇది నిబంధన’ అని చక్రవర్తి ఆదేశించేలోగానే సైనికుడు ఒక్క ఉదుటున ముందుకు వచ్చి చిన్ని పాత్రను అందుకున్నాడు.
అలెగ్జాండర్ తన నీరసాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే లేచి కూచున్నాడు. చిన్న పిల్లాడిలా ఆ ముసలి వైద్యుని పొడవాటి గడ్డాన్ని చూస్తూ అడిగాడు, ‘అందులో ప్రాణహాని కలిగించే విషం కలిపి ఉండవచ్చు’. మరుక్షణం చక్కటి నవ్వు అతని పెదాలపై మెరవగా ‘నీ చేతులతో ఇలా విషం ఇచ్చినా తాగడానికి సిద్ధమే. అమ్మ ఒలింపియా నేను పిల్లాడిగా ఉన్నప్పుడు ఇలానే మందులు తాగించేది. అపుడు నోరు తెరవగా వైద్యుడు మందు ద్రావకాన్ని మెల్లగా తాగించాడు. అంతటి మహాయోధుడు మళ్లీ చిన్నపిల్లాడయ్యాడు. ఎంత చిత్రమో! వైద్యుడి చేతిలోంచి షెల్ లాక్కొని దాన్ని నాకడం మొదలెట్టాడు. తానేం చేస్తున్నాడో చెప్పలేనంత ఆనందంలో ఉన్నాడు. కొంతసేపు అలానే కూర్చున్నాడు. వైద్యుడిని అడిగాడు, ‘ఇంతకీ నా అనారోగ్యం గురించి మీకెలా తెలుసు? ఎవర్నీ అడగలేదు. ఎవరూ మీకు తెలియజేయలేదు’
నీళ్లు ఎక్కడ లభించేది పక్షులకు తెలిసినట్టే, తేనెటీగలు తేనెను గుర్తించినట్టే.’ త్వరగా సన్నగా నవ్వి, ఆ ముసలి వైద్యుడు ఇలా అన్నాడు, ‘రాబందులు, కాకులు చనిపోయే జంతువులను గుర్తించినట్టు.’
అలెగ్జాండర్‌కి సమాధానం చెప్పే అవకాశం లభించలేదు. వైద్యుడి పొడవాటి మెరుస్తోన్న గడ్డం చూస్తూండిపోయాడు.
మర్నాడు ఉదయం అలెగ్జాండర్‌కు మొదట విడత మందు ఇస్తున్నప్పుడు ‘ఓ అయిదు ఎనిమిది గంటలపాటు గుండె మంట, తలనొప్పి, ఒళ్లంతా నొప్పులు చాలా చిరాగ్గా ఉంటుంది. కంగారు పడవద్దు. ధైర్యంతో కాస్త భరించండి. అలానే కొద్దిగా సముద్రవొడ్డు ఇసుకతోపాటు మంచినీటిని కాచి వడబోసి ఆ నీటినే తాగుతూండండి, కేవలం మిల్లెట్ మాష్ సగం రోస్ట్ చేసింది. మేకపాలు తాగండి. మూడు రోజుల తర్వాత ఆవుపాలతో ఉడకబెట్టిన ఫిగ్స్ తినడానికి వీలవుతుంది. అంతకు ముందు కంటే మీరు మరింత బలంగా ఆరోగ్యంగా తయారవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది’ అన్నాడు.
సరిగ్గా వైద్యుడు చెప్పినట్టే అంతా జరిగింది. ఎనిమిది గంటలపాటు చక్రవర్తి ఆరోగ్యం క్షీణించడం ఆరంభమయి మరింత క్షీణించింది. లోకవిజేత చెప్పలేనంత ఇబ్బందుల్లో ఉన్నాడు. చుట్టూ వేలాదిమంది సైనికులు ఉన్నారు. అంతా చమటప్రాయంగా రక్తాన్ని ఇవ్వగలరు. కానీ తన అనారోగ్యాన్ని ఎవ్వరూ పంచుకోలేరు. వారి విధేయత అంతటిది. అతని అనారోగ్యాన్ని అతడే తోచిన విధంగా భరించాల్సిందే ఒంటరి. మండుతోన్న కొలిమి అతని గుండెల్లో ఉన్నట్టే ఉంది. అతని అరచేతులు మండుతోన్నాయి. అరికాళ్లు మండుతున్నాయి. చక్రవర్తి చిన్నపిల్లాడిలా అయ్యాడు. మాటల్లో చేతల్లో చెప్పలేనంత భరించలేని బాధతో చక్రవర్తి తెలిసీ తెలియని స్థితిలో పడుకున్నాడు. అయోనియన్లు, మాసిడోనియన్ల పరువు, ప్రతిష్ట మొత్తం మర్చిపోయాడు. పర్షియా, సిరియా, ఈజిప్ట్, ఆఫ్రికా, మధ్యాసియా అంతటా అతని విజయాలతో ఘంటారావం చేయించిన మహాయోధుడు అలెగ్జాండర్ మంచంలో అనారోగ్యంతో పడి ఉన్నాడు. అంతా నిశ్శబ్దం. ఆయన భార్య రుక్సానా కూడా అతని బాధను పంచుకోలేదు. ధేబ్స్ ప్రజలు దాస్యాన్ని వ్యతిరేకించినపుడు అతను ఆగ్రహంతో పెల్లుబికి పిడుగులా పడి నగరాన్ని నాశనం చేశాడు. క్షణాల ముందు ఎంతో హాయిగా, సరదాగా నవ్వుతోన్న ఆరువేల మందిని మరుక్షణంలో నరికేశాడు. ఇపుడు వాళ్లకు కలలు లేవు. వేలాదిమంది మహిళలు, పిల్లల్ని పట్టుకుని బానిసలుగా అమ్మేశాడు. ఇప్పుడు వారంతా కోల్పోయిన ప్రతీ ప్రాణానికి బాధ్యత అతన్ని గదమాయిస్తున్నది. లోకంలోని వజ్రాలు, ముత్యాలేవీ అతన్ని అనారోగ్యాన్నించీ బయట పడేయలేవు. బంగారం, వెండయినా సరే. కేవలం అతని కళ్ల ముందు చీకటి, వెలుగే కదలాడుతున్నాయి.
కానీ అయిదు నుంచి ఎనిమిది గంటల సమయం అయిపోగానే అతను కళ్లు తెరిచాడు. ఏదో భయానక కల ప్రభావం పోయినట్లయింది. పగటి కల శాపం పోయినట్లయింది. మరణం నుంచీ తాను ఎలాగో బయటపడ్డాడని మొదటగా గ్రహించాడు. అయోనియన్ మంత్రగాళ్లు అంతా నిష్ప్రయోజకులయ్యారు. వైద్యుడి వంక చక్రవర్తి ఎంతో కృతజ్ఞతా భావంతో చూశాడు. వైద్యుడు పిల్లాడిని తండ్రి చూసినట్టు ఎంతో వాత్సల్యంతో అలెగ్జాండర్‌ని చూశాడు. ఆ వౌనం ఏలిన క్షణంలో చెప్పలేనంత భావం వ్యక్తమయింది.
అంతటి భయానక అనారోగ్యంతోటి బాధతోనే చక్రవర్తికి జీవితం విలువ అర్థం కావడం మొదలైంది. రోజుకు ఒకసారే సూర్యోదయం అయినట్టే, మనిషికి ఒకే జీవితం ఉంటుంది జీవించడానికి. ఎవరూ రెండు పర్యాయాలు జీవించరు. ఇంతకు ముందు వరకూ అలెగ్జాండర్ ఈ చిన్న సత్యాన్ని అంగీకరించలేదు. యుద్ధం తర్వాత యుద్ధాల్లో మారణహోమం తర్వాత మారణహోమం జరపడంలో అతనికి తాను ఒక మనిషిననే గ్రహించే సమయమే లేకపోయింది. తాను దేవతలను చేరినా, ఈ లోకం అంతకు ముందులా కొనసాగుతుందన్నది ఎంతో సత్యం.
ఇప్పుడున్నట్టుగానే అతను ఈ లోకంలో ప్రాపంచిక ఆశయానికి అతడేమీ విరుద్ధంగా ఎన్నడూ లేడు. చాలా ఆలోచించిన తర్వాత ప్రజ్ఞానం తర్వాత తల గోక్కుంటూ వైద్యుడిని అడిగాడు, ‘మీరు నా దగ్గరికి రాకుండా ఉంటే నేను మరణించేవాడినా?’
వైద్యుడు ఓ నిమిషం ఆగి, ‘లేదు. మీకింకా చాలాకాలం బతకాల్సి ఉంది’ అన్నాడు.
‘ఎన్నాళ్లు. ఇంకా ఎన్నాళ్లు మిగిలి ఉంది?’ అడిగాడు అలెగ్జాండర్.
‘ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోకుండా ఉండడమే మేలు. ఇది రాజుకయినా సత్యమే, బిక్షగాడికయినా సత్యమే!
‘లోకంలో వేలాది మంది ప్రజలు నేను పోయిన తర్వాత కూడా జీవిస్తారనే ఆలోచన నేను భరించలేక పోతున్నాను. సూర్యచంద్రులు నేను లేకపోయినా ఉదయించడం; పువ్వులు పూయడం; ప్రజలు వివాహాలు చేసుకోవడం, కొత్తగా తల్లులయిన వారికి ఆనందం కలిగించేలా పాటలు పాడుకోవడం, వర్షంలో తడవడం అన్నీ జరుగుతాయి.. కానీ బాధను ఏ మాత్రం భరించలేను. ఏ మాత్రం ప్రతిష్టలేని సాధారణ మనుషులు హాయిగా ఊపిరిపీలుస్తూ, నవ్వుతూండగా, అలెగ్జాండర్ అంతటివాడు ఈ లోకాన్ని విడిచిపోతే...’
‘అవును. అది సర్వసాధారణంగా జరుగుతుంది’ అన్నాడు వైద్యుడు. ‘మీ తండ్రి మరణించారు. అయినా ఈ లోకం ముందుకు వెళుతోంది. అదంతా చాలా సహజంగా జరుగుతుంది. ఎప్పుడూ అంతే!’
‘లేదు. ఆయన సహజంగా పోలేదు. హత్య గావింపబడ్డారు’
తన పనికి మరణం ఏ మాత్రం బాధ్యత వహించదు. దానికి కావలసిందల్లా చిన్న అవకాశం మాత్రమే. చిన్న అవకాశం. అది చాలు’
‘కానీ నా విషయంలో దానికి ఏ మాత్రం చిన్న అవకాశమూ ఇవ్వను’
‘అటువంటి అవకాశాలు వాటంతట అవే వస్తాయి. దాని కోసం మరణం వేచి ఉండనక్కర్లేదు’ ఇంకా ఇలా అన్నాడు, ‘మీరు చావు లేకుండా ఉండాలని అనుకుంటున్నారా? నేనుండను’
అలెగ్జాండర్ అక్కడినుంచీ కదిలే ముందు ఇలా అన్నాడు, ‘మరణించకుండా ఉండటానికి ఏం ప్రలోభాలు ఉన్నాయి. మీ జీవితంలో? నా జీవితమంతా అలాంటివి చాలా ఉన్నాయి. అనేక రాజ్యాలపై విజయం, వేలాదిమంది బానిసలు, ఊహించలేనంత ధనం, లెక్కలేనన్ని వజ్రాలు, ముత్యాలు, అంతులేని బంగారం, వెండి నిధులు. నా వంటి చక్రవర్తిని ఈ లోకం మునె్నన్నడూ చూడలేదు. ఎంతో విశాలమయిన సామ్రాజ్యం, మరెంతో ధనరాశులు ఉన్నవాడిని! ఒక చిన్న అవకాశంతో మరణించడానికేనా ఇంతటి మారణహోమం, రక్తం ప్రవసింపచేసింది?’
దీన్ని గురించి వైద్యుడు రవ్వంత ఆలోచించి, ‘మీకు అమరునిగా ఉండాలన్న కోరిక బలంగా ఉంటే అందుకు ఒక మార్గం చెబుతాను. నాకు తప్ప మరెవరికీ తెలియదు. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేయండి.’
అలెగ్జాండర్ ఆనందానికి అంతేలేదు. ఆకాశం, నక్షత్రాలూ తన పిడికిట పట్టినంత ఆనందంగా ఉన్నాడు. తలలో పది లేదా ఇరవైకి పైగా నాలుకలు ఉన్నా, అన్నీ ఏకమై ఒక్కటిగా పలుకుతాయి. తాను ఈ లోకం చక్రవర్తి. కానీ ఒక్కటే నాలుక. ‘లేదు. కచ్చితంగా ప్రమాణం చేస్తున్నాను. దీన్ని గురించీ ఏ ఒక్కరికీ చెప్పను. ఈ జీవితంలో నాకు అత్యంత ఆత్మీయురాలు రొక్సానా క్కూడా. సరే, మహిళలే ఎందుకు శాశ్వతకీర్తి సంపాదించాలి? వారు ఇరవయ్యేళ్లు వయసు దాటగానే వారు మరణించవచ్చు. కానీ నేను మాత్రం కాలంతోపాటు ముసలివాడిని కాదలచుకోలేదు. నేను ఇప్పుడున్నట్టే ఉండాలను కుంటున్నాను.’
వేదాంతిలా ఆ ముసలి వైద్యుడు ఓ క్షణం అక్కడే కూచున్నాడు. తర్వాత, మెల్లగా, అలెగ్జాండర్ ఏకాంత గదిలో వర్షం పడుతున్నట్టు, ‘మీకు మంచి నిర్ణయం తీసుకోగల శక్తినిచ్చేలా పరమేశ్వరుని ప్రార్థిస్తాను. నిజానికి మీరు మొదట జన్మించినపుడు ఇతరుల వలె అసహాయులు, శక్తిహీనులు అని మీకు గుర్తుచేయాలా? తగిన సమయంలో మీరు పెద్దయి, బాలుడు అయ్యారు.
అలాగే సరయిన సమయంలో మీరు బలహీనులు, పిరికి, బలహీనమయిన ముసలి మనిషి అయ్యారు. అందరు మారినట్టే. మనం సమయం కాని సమయంలో మరణం గురించిన అంశాన్ని పక్కనబెడితే, అసలు ఈ మరణం అనే అద్భుత చిరకాల వరంతోనే జీవితానికి ఇంత విలువనిస్తున్నా మన్నది గ్రహించాలి. యమరాజు చేయాల్సిన పనిని మీ రెండు చేతుల్లోకి తీసుకుని వేలాదిమంది అమాయకులను సమయానికి ముందే మృత్యుదండ విధిస్తున్నారు. మీరు మాత్రం అమరుడు కావాలా? ఎందుకు?’
జీవితంలో మొట్టమొదటిసారిగా ఒకరు తన ఆశయాలను కాదంటున్నారు. కానీ అలెగ్జాండర్ ఉద్వేగాన్ని వదులుకోలేదు. కారణం తాను అమరునిగా ఉండాలనుకుంటున్నాడు. ఈ ముసలి వైద్యునికి అది ఎలా సాధించాలో తెలుసు. అంతేకాదు ఈ వైద్యుడు తన ప్రాణాలు కాపాడాడు. అతనికి తెలిసినవి ఇంకా పూర్తిగా వివరించలేదన్నది తెలుసు. కనుక కొంత తల పొగరుతో మాట్లాడుతున్నాడు. ‘ఇంతకు ముందెన్నడూ ఇంతటి విశాల సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నవారెవరు లేరు. ఇంతటి ముందెన్నడూ ఇంతటి ధనరాసులు ఎవరూ కలిగిలేరు. అందుకే ఈ కోరికను వదులుకోలేను. మృత్యుంజయునిగా ఉండాలన్నది అన్నింటికి మించి కోరుకుంటున్నాను - కోరుకునేది అదే, అవసరమూ అదే.’
ఈ పర్యాయం ముసలి వైద్యుడి పెదవులు, పళ్లు మాత్రమే కాదు మెరుస్తోన్న పొడవాటి గడ్డంలో ప్రతీ వెంట్రుకా నవ్వుకుంది! అతని కోరికను అంగీకరిస్తూ, ‘ఇంతకు మించి నేనేమీ చెప్పను. మహాగురువు అరిస్టాటిల్ శిష్యునికి అభిప్రాయం మరోలా ఉంటుందని ఎలా ఊహించగలను. మీరు ఎంతగానో ఆశిస్తున్నది తీరకుండా ఉండాలని నేను ఆశించను. దీని తర్వాత మనం కలవము. కానీ నా ఆశీసులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. నేను ఆశ్రమానికి వెళ్లగానే నా శిష్యులకు చివరి ఉపదేశం ఇచ్చి సమాధిలోకి వెళతాను. కనుక జాగ్రత్తగా వినండి. సుమేరు పర్వతం పశ్చిమం దిక్కున ఒక గుహ ఉంది. అది ఓ పెద్ద బండరాయితో కప్పబడి ఉంటుంది. మీకు ఎంతో నమ్మకస్తులయిన సైనికులు ఆ రాయిని తొలగించనీయండి. ఆయుధమేదీ లేకుండా, ధైర్యంగా లోనికి వెళ్లడానికి ముందు ఓ క్షణం వేచి ఉండండి. ఆ పవిత్రమయిన నేల మీద మీ పాదముద్రలే ముందు పడాలి.’
వైద్యుడు కొంత సమయం వౌనం వహించాడు. అలెగ్జాండర్ బలమయిన శరీరంలో ఏముందో, అతనిలో తలెత్తుతోన్న ఉద్వేగాన్ని పరిశీలిస్తున్నాడు. మళ్లీ కొనసాగించాడు, ‘గుహలో కొంతదూరం వెళ్లగానే జలపాతం నుంచి వచ్చి చేరిన మంచినీటి నీటికుంటను చూస్తారు. అది ఎప్పుడూ ఎండిపోదు, పూర్తిగా పొర్లిపోయేంతగా నిండదు. అక్కడున్న పీపల్ వృక్షం కొమ్మ మీద కావ్,కావ్,కావ్ అంటూ అరుస్తూ ఓ కాకి కనపడుతుంది. యావత్ సృష్టిలో సజీవత్వాన్ని మెలకువగా ఉన్న ప్రతీ క్షణంలో కోరుకునే ఏకైక ప్రాణి. అక్కడి జలపాతం నుంచి పడుతున్న నీటి నుంచి ఏడు దోసిట్ల నీటిని పట్టాలి. అప్పుడు ఎవరూ మీ జీవితానికి హాని కలిగించలేరు - భగవంతుడు, రాక్షసుడు, మానవుడైనా సరే. మీకు అత్యంత నమ్మకంగా ఉండే ఇరవై ఒక్క మంది సైనికులను మాత్రమే తీసికెళ్లండి. అయితే వారిని గుహకు మూడు వేల అడుగుల దూరంలో ఉంచండి. వాక్సింగ్ పక్షం తొమ్మిదవ రోజున మీరు బయలుదేరాలి. అపుడు మీ కోరిక నెరవేరుతుంది.’
ఆ తర్వాత అలెగ్జాండర్ ఆలస్యం ఎందుకు చేస్తాడు? బంగారు స్వప్నంలో మాదిరి, తన నమ్మకస్తులయిన ఇరవయొక్క మంది సైనికులతో సుమేరు పర్వతం దక్షిణ దిశకు వెళ్లి ఆ గుహ వద్దకు చేరుకున్నాడు. వాయు వేగంతో, ఆ సైనికుల బలంతో మొత్తానికి ఆ గుహ రాతి తలుపు తొలగించాడు. అలెగ్జాండర్ చీకటి గుహలోకి వెళ్లాడు. కొత్త భయం పట్టుకుంది. ఒకవేళ లోపల పోరస్ మనుషులు తనపై దాడి చేయడానికి కుట్ర చేయలేదు గదా అని. అదే జరిగితే ఆయుధం లేని తాను, ఒంటరిగా వారిని ఎలా ఎదుర్కొంటా ననుకున్నాడు. ఇంతటి వొణుకు పుట్టించేంత భయాన్ని ఎన్నడూ తాను అనుభవించలేదు. పిరికితనంతో వెనుదిరిగిపోయే కంటే, తన భయాన్ని ఎదుర్కొనదలచుకుని అడుగు ముందుకు వేశాడు. లేదు, లేదు, ద్రోహం ఎరుగని ఆ భారత ప్రతినిధి తన శత్రువునయినా మోసం చేయలేడు. తన వైద్యుడి తెల్లని గడ్డం నమ్మకాన్ని కలిగించే మెరుపును గుర్తు చేసుకున్నాడు. ముందుకు భయం లేకుండా అడుగులేశాడు. నిజంగానే అక్కడ ఓ పెద్ద చెట్టు కొమ్మన ఒక కాకి అమరత్వాన్ని కోరుకుంటూ కావ్‌కావ్ అని అరుస్తూ కూచునుంది. అక్కడికి దగ్గరలో నిత్యం ఆగకుండా నీరు పడుతోన్న జలపాతం ఉంది. గుహంతా తేనె సువాసన వెదజల్లుతోంది. అలెగ్జాండర్ ఆశ్చర్యానికి అంతే లేదు. కళ్లు నులుముకుని మరీ చూచాడు. అక్కడ అమూల్య వజ్రాలు ఎన్నో పడి ఉన్నాయి అంతటా! వాటి నుంచి వచ్చే వెలుగు సూర్యుని లేదా పున్నమి వెలుగు కంటే ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ ఆ కాకి తప్ప వేరే ప్రాణి లేదు. ఈ ఊహించని వజ్రాలకు ఈ కాకి రక్షకురాలా? దానికి తెలుసునా అది ఎంతటి అమూల్యమయిన వాటిని రక్షిస్తున్నదో? కాసిని నీళ్లు తాగి ఈ అమూల్య నిధిని ఎలా పొందాలో వ్యూహాన్ని ఆలోచించాలి. అలెగ్జాండర్‌కు ఏదీ అసాధ్యం కాదు!
హఠాత్తుగా కాకి ఎన్నడూ ఆపని కావ్‌కావ్ మనడం ఆపేసింది. పీపల్ వృక్షాన్ని చూసిన అలెగ్జాండర్ ఆశ్చర్య చకితుడయ్యాడు. కాకి అతని వంక తీక్షణంగా చూస్తోంది. తన రహస్య కోరికను కాకి గ్రహించలేదు కదా! ఆగని జలపాతం నీరు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరో అదృశ్య వ్యక్తి తాగేసినట్టు. భరించలేని నిశ్శబ్దం అతని చెవులను చీల్చింది. అప్పటి వరకూ ఉన్న వెలుగు పూర్తిగా పోయింది. ఇక అతను జలపాతం వేపుగాని, గుహ వెలుపలికి వెళ్లే దారినీ చూడలేకున్నాడు. ఇటువంటి శాశ్వత, అంతులేని చీకటిలో, పూర్తిగా శిలయ్యే వరకూ గుహలో చిక్కుకున్నాడు. తర్వాత పొగమంచు అలెగ్జాండర్ ముందు ఆవహించింది. అతని నియంత్రణకు అసాధ్యమైనదేదో జలపాతంవేపు అడుగులు వేయించింది, పాదాలు ఆలోచిస్తున్నట్టు!
అమరుడు కావాలన్న కోరికతో మాయలో పడినట్టు చేతులు జలపాతం నీటి కోసం వెతికాయి ఆ చీకట్లో. అంతలో కాకి పిలుపు విన్నాడు, ‘అలెగ్జాండర్ ఆగు!’ ఉన్న చోటనే అతను ఆగిపోయాడు. కాకి ఇలా అంది. ‘నా అనుమతి లేకుండా ఒక్క గుక్క తాకినా, రూబుల్స్ హీప్‌లా మారిపోతావ్. నువ్వు అలాంటి పొరపాటు చేయాలనుకోవద్దు. నేను కలలో ఓసారి చేశాను. ఫలితంగా ఇలా అమరత్వ శాపం కారణంగా వేలాది సంవత్సరాలు బతుకుతున్నాను. ఈ శాశ్వత జీవితంతో విసిగెత్తాను. ఎన్ని శతాబ్దాలుగా మరణించాలను కుంటున్నానో నీకు తెలియదు. కానీ జరగడంలేదు. కావ్ కావ్‌మని అరుస్తూండడం నా చెవులు చిల్లులు చేసింది. నీలో కోరిక రగిల్చిన ఈ యావత్ మసా సంపదకు తిరుగులేని యజమానిని నేనే. నువ్వు యమరాజు దగ్గరికి వెళ్లి నా జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనగలిగితే, నా యావత్ సంపదను ఆనందంగా నీ కైవసం చేసాతను. దాన్ని చూసుకోవడంలో నా కళ్లు కూడా నొప్పులు పుడుతున్నాయి. నేను మరణించిన తర్వాత, ఈ మడుగులో నీరు నీకు తోచినంత తాగవచ్చు. కానీ దురదృష్టవశాత్తూ, వేలాదిమంది వీరులను కూల్చిన నీ చేత్తో నేను నీటిని తాగలేను. నేను మంటల్లో కాలిపోను. నీటిలో మునిగిపోలేను. ఎంతో శక్తివంతమయిన విషం తాగినా నేను చావలేను. అంతెందుకు భగవంతుడే వచ్చి చంపాలనుకున్నా అది సాధ్యం కాదు. కచ్చితంగా వచ్చే మరణానికి లోబడినపుడే నిజంగా జీవితంలో సంతోషం, ఆనందం అనుభవించ గలుగుతావు. చావన్నది లేని అమరత్వం కన్నా దారుణమయిన వరం మరొకటి ఉండదు. విషాదాన్ని భరించడమే నా చిరకాల దురదృష్టం. అరే, ఏమాలోచనతో ఉన్నావ్? నువ్వు యుద్ధంలో కూల్చిన ఏ ఒక్క మనిషి, బానిసగా అమ్మేసిన ఏ ఒక్క పిల్లాడి ఊపిరికయినా విలువ కడితే, ఇపుడు నీ ముందు కనపడుతోన్న వజ్రాల రాసులు ఒక్క ఎర్ర ఏగాణికి కూడా సమంకావు. ఈ సృష్టిలో కాకిలా జన్మించిన నేనే ఈ చిన్నపాటి సత్యాన్ని అర్థం చేసుకున్నానే, మరి మనిషిగా నువ్వు అవగాహన చేసుకోవడంలో విఫలమయ్యావు? అలాంటపుడు తెలివితేటలకు అర్థమేమిటి? ఏది అర్థమవుతుంది? కావ్‌కావ్ కావ్!’
తన అత్యున్నత క్షణంలోనూ, పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ప్రపంచ విజేత అలెగ్జాండర్ కాకికి లొంగిపోవాల్సి వచ్చింది. తాను వచ్చిన దారినే వెనుకంజ వేయాల్సి వచ్చింది.
మరి ఆ ఇద్దరిలో, ఎవరు గొప్ప అనుకుంటున్నారు - అలెగ్జాండరా లేదా కాకి?