S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జన్యులోపాలతో గర్భస్రావం

గర్భధారణ సమయం తొమ్మిది నెలలయినా అది పూర్తయే కాలం ఎవరూ ముందు చెప్పలేరు. ఎందుకంటే వారి శరీర తత్వాన్నిబట్టి అండం ఎప్పుడు విడుదల అవుతుందో అప్పటి నుంచి లెక్కపెట్టాలి. అందుకనే 9 నెలలకి ఒక వారం కలిపి డెలివరీ తేదీ నిర్ణయిస్తాం. అంటే ఉదాహరణకు ఒక వనిత నెలసరి - జనవరి ఒకటో తేదీన మొదలైందనుకుంటే 9 నెలలు కలిపితే అక్టోబర్ ఒకటి, ఆపై ఏడు రోజులు అంటే 8 అక్టోబర్‌న ఆమె ప్రసవ తేదీ. ఐతే నాలుగైదు రోజులు ముందుగానో నాలుగైదు రోజులు వెనుకగానో ప్రసవం జరుగవచ్చు.
మొదటి మూడు నెలల్లో పాప అవయవ నిర్మాణం (ఆర్గనోజెనిసిస్) జరుగుతుంది. అప్పుడు రక్తప్రసారం ఏ కారణం చేతైనా తగ్గితే పాపలో అవయవ లోపాలు లేక ప్రాణవాయువు సరిపోక కిందికి జారిపోతుంది. దీనినే గర్భస్రావం అంటారు. ఈ మొదటి మూడు నెలలు అంటే మొదటి 12 వారాలు ఒక పెద్ద మెట్టు లాంటివి. ఇది నిండితే చాలావరకు గర్భం పెరుగుతూ శిశువు చక్కగా అభివృద్ధి చెంది నెలలు నిండినాక పుట్టి తల్లిదండ్రులకు బంధువులకూ ఆనందం కల్గిస్తుంది. తరువాతి మెట్టు 5 నెలలు. ఈ సమయంలో పాపకి ఎముకల పెరుగుదల, ఆకారం, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణావయవాలు, మూత్రపిండాలు, నాళాలు, మూత్రకోశం వంటి పెద్ద అవయవాలు, బ్రెయిన్ పెరుగుదల లాంటివి జరుగుతాయి. 5 నించి 7 నెలల వరకూ పాప గర్భంలో పెరిగితే తర్వాత 1 నించి 2 కిలోల బరువు పుంజుకుని అపుడు డెలివరీ అయినా పాప జీవించే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా అపసవ్యంగా గర్భం జారిపోతే దానికి కారణాలు చాలా ఉంటాయి. మొదటి 3 నెలల మధ్య గర్భస్రావానికి ముఖ్యంగా వంశపారంపర్య జెనెటిక్ లోపాలు కారణం. ఇంకొక ముఖ్య కారణం గర్భసంచిలోని నిర్మాణ లోపాలు.. అంటే రెండుగా చీలిపోయిన గర్భాశయం గాని ఒకవైపున సగం బాగా పెరిగి రెండో వైపు లేకపోయినా లేక చిన్న పరిమాణంలో వున్నా పాప విస్తరించడానికి అడ్డంకి అవుతుంది. బైకార్నువేట్, ఆర్క్యువేట్, బాగా వెనుకకి వంగిన (ఎక్యూట్ రిట్రోవర్టెడ్ యుటిరస్) వుంటే గర్భకోశం ప్రెగ్నెన్సీని భరించలేక అబార్షను కావచ్చు.
ఇక వేరే కారణాలు - గర్భాశయపు గడ్డలు - ఫైబ్రాయిడ్స్ అనబడే ట్యూమర్లు పెరిగే పిండం మీద వత్తిడి పెట్టి రక్తప్రసారానికి అడ్డు వస్తాయి. తల్లికి ఏదైనా వ్యాధి - షుగరు వ్యాధి లేక అంటువ్యాధులు - స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్, జాండీస్, మలేరియా వంటి వైరల్, పారసిటిక్ ఇన్‌ఫెక్షన్లు - సీదా పిండాన్ని ఎటాక్ చేసి గర్భస్రావాన్ని కల్గిస్తాయి. ఇదేగాక తల్లి తినే కొన్ని మందులు - ఏంటీబయాటిక్స్ థాలిడోమైడ్ (ఇది బ్యాన్ చేశారు) కీమోథెరపీ, రేడియో థెరపీ, ఎక్స్‌రేలు, పిండంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. చాలామందికి అల్ట్రాసౌండ్ మీద అనుమానాలుంటాయి గాని నేటి ఆధునిక పరికరాల్తో స్కానింగ్ చేస్తే ఏమీ చెడు ప్రభావం వుండదు. ఎన్నిసార్లయినా చేయవచ్చు అవసరమైతే.
2-3 నెలలకి కడుపులోని పిండం పెరుగుదల, గుండె ఆగిపోతే దాన్ని ‘మిస్డ్ అబార్షన్’ అంటారు. ఇటువంటిది అల్ట్రాసౌండ్ ద్వారా కనిపెట్టాలి. ప్రాణం లేని పిండాన్ని తీసివేసే ఉపాయం - టెర్మినేషన్ - మందుల ద్వారానో, సర్జరీ - డి అండ్ ఎస్‌ఇ చేసిగాని గర్భం తీసి క్లీన్ చేస్తారు. దాని కారణాలు శోధించి తగిన చికిత్స చేస్తారు.
4-5 నెలలకి జరిగే గర్భస్రావానికి కారణం ముందు చెప్పుకున్న ఇన్‌ఫెక్షన్లు లేక ట్యూమర్లు కాక మాయ కిందకి వుంటే కూడా గర్భస్రావం కావచ్చు. ఒక్కోసారి గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండి ఇన్‌కాంపిటెన్స్ అనే పరిస్థితి కలుగుతుంది. ఇది సర్విక్స్ యొక్క కొలతనుబట్టి ముందే అనుమానించి ఒక కుట్టు ద్వారా దాన్ని ఆపవచ్చు. దీనే్న సర్వికల్ సర్క్‌లాజి ఆపరేషన్ అంటారు. కొద్దిపాటి మత్తుమందుతో సులువుగా చేసే ఈ ఆపరేషన్ వల్ల అబార్షన్ అనే ఉపద్రవాన్ని అరికట్టవచ్చు. ఇవేగాక సిఎంవి, రూబెల్లా అనే చెడు వైరస్‌లు కూడా అబార్షన్ అవయవ లోపం వల్ల కల్గించవచ్చు.
ఇంకా ఒక సీరియస్ పరిస్థితి - ముత్యాలగర్భం లేక మోలార్ ప్రెగ్నెన్సీ.. ఇందులో పిండం పెరిగినా అందులోని మాయ ముత్యాల లాంటి నీటిబుడగలు (వెసికిల్స్)గా మారిపోయి విపరీతమైన రక్తస్రావం కలుగజేస్తుంది.
ఇదేగాక ట్యూబులో పిండం పెరిగి, అది పగిలి కడుపు లోపల విపరీతమైన రక్తస్రావం కలిగి తల్లికి ప్రాణాపాయం కలుగుతుంది. పై రెండు పరిస్థితులు రక్తపరీక్ష బిహెచ్‌సిజి, స్కానింగ్‌లలో గుర్తుపట్టి వెంటనే చికిత్స చేసి తల్లిని కాపాడాలి. అందుకే నెల తప్పగానే వైద్యపరీక్ష చాలా ముఖ్యం.

-- డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో