S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్కస్( ఓ చిన్నమాట)

నాచిన్నప్పుడు శివరాత్రి సమయంలో మా వూరికి సర్కస్ వచ్చేది. ఆ సర్కస్‌లో వ్యక్తులు చేస్తున్న ఫీట్లు చూసి చాలా ఆశ్చర్యం వేసేది. ఒక జూలా వదిలి గాలిలో కొంచెం దూరం ప్రయాణం చేసి మరో జూలా పట్టుకునేవాళ్లు.
ఎంత నేర్పు.
ఎంత ఏకాగ్రత.
ఎంత ధైర్యం.
ఆశ్చర్యం, భయం రెండూ కలిగేవి.
హైస్కూల్‌కి వచ్చేసరికి లెక్కల క్లాస్ అంటే భయంగా వుండేది. కానీ మా లెక్కల సార్ నోటికే అన్ని లెక్కలు చెప్పేవాడు.
ఆయన తెలివితేటలు చూసి అచ్చెరువు చెందేవాన్ని.
డిగ్రీ చదివేటప్పుడు మా కెమిస్ట్రీ లెక్చరర్‌ని చూసి కూడా ఆశ్చర్యపోయేవాన్ని.
ఈ రకంగా చాలామంది నన్ను ఆశ్చర్యపరిచేవారు. బాగా మాట్లాడే వ్యక్తులు, రచయితలు, చిత్రకారులు, ఆటగాళ్లు.. ఇలా ఎందరో.
వాళ్లలాగా నాకు శక్తిసామర్థ్యాలు వుంటే నేను వాళ్లలాగా వుండేవాడినని అన్పించేది.
ఇంకా కాస్త గొప్పవాడిలా వుండేవాడినని తోచేది.
మా వూరికి వచ్చిన సర్కస్‌లో మా వూరికి చెందిన మోహన్ ఉన్నాడు. అతని తమ్ముడు శ్రీను మా క్లాస్‌మేట్. మోహన్ జూలాలను అవలీలగా అందుకునేవాడు. కానీ శ్రీను అలా కాదు. శ్రీను సర్కస్‌లో పెరగలేదు. మోహన్ సర్కస్‌లో పుట్టలేదు.
మోహనే కాదు. ఎవరైనా పనిలో అత్యున్నత స్థానం సంపాదించాలంటే ఎంతో కృషి, ఎన్నో సంవత్సరాల శ్రమ వుండాలి. అప్పుడే వాళ్లు ఆ స్థానం సంపాదించగలరు.
జన్మతః వచ్చేవి కొన్ని మాత్రమే. సాధన వల్ల చాలా వస్తాయి.
అత్యున్నత శిఖరం ఎక్కాలంటే కఠోర పరిశ్రమ, నిత్యం అందుకోసం కృషి చేయడం, నిరంతరాయంగా చేయడం అవసరం.
సర్కస్‌లో పనిచేసే వ్యక్తులు ఒక్క ఉదాహరణ మాత్రమే!

- జింబో 94404 83001