S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అణకువ -- ఓ చిన్నమాట!

కొత్తగా కడుతున్న ప్లాట్లలో ఇప్పుడు రెండు పార్కింగ్‌లు ఉంటున్నాయి. గతంలో ఒక ఫ్లాట్‌కి ఒక్కటే కారు పార్కింగ్ స్థలం. ఈ పరిస్థితి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
కొత్తలో మారుతి 800 కారు కొన్నాను. అది పాతబడిపోయిన తరువాత మరో కారు కొన్నాను. పార్కింగ్ స్థలం ఒక్కటే ఉండడం వల్ల పాత కారుకి సమస్య వచ్చి పడింది. పాత కారు మీద మమకారం కొద్ది దాన్ని నా కొత్తకారు ముందు పార్క్ చేసేవాడిని. దానివల్ల మిగతా వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయని వాచ్‌మెన్ మాటిమాటికి చెప్పడం వల్ల చివరికి రోడ్డు మీద ఓ పక్కన పార్క్ చేయడం మొదలుపెట్టాను. మారుతి కారుని అమ్మకపోవడానికి చిన్నచిన్న షాపింగ్‌లకి ఉపయోగపడుతుందన్నది ఒక కారణమైతే, మొదటి కారు మీద ఉన్న మమకారం మరో కారణం.
ఎండలు ఎక్కువ వుండడం వల్ల మారుతి కారు చాలా వేడెక్కేది. సాయంత్రం నా పనుల కోసం మారుతి కారు వాడేవాడిని. అది వేడెక్కి ఉండడం వల్ల ఇబ్బందిగా ఉండేది. అందుకని రోడ్డు మీద నీడ వున్న ప్రదేశంలో పెట్టాను. అక్కడ రోడ్డు మీద చిన్న ఇస్ర్తి షాపు వాడు తనకు ఇబ్బంది అవుతుందని చెప్పాడు. అది ప్రభుత్వ స్థలమే. వాడి ఇస్ర్తి షాపు వున్నది ఫుట్‌పాత్ మీద. అయినా వాడితో ఎలాంటి వాదన చేయకుండా కారుని ఎండలోనే ఉంచడం మొదలుపెట్టాను. చివరికి అతనే ఓ రోజు వచ్చి ఈ నీడన పెట్టండి సార్ పర్వాలేదు. మధ్యాహ్నం పూట గిరాకీ ఏమీ ఉండదని అన్నాడు. వాడితో ఎలాంటి వాదన చేయకపోవడం వల్ల వాడి మాట మన్నించినందువల్ల వచ్చిన మార్పుగా అన్పించింది.
ఓ రోజు రోడ్డు మీద కారులో వెళ్తుంటే ముందట వున్న స్కూటర్‌కి నా కారు చిన్నగా తాకి స్కూటర్ లైట్ కొంత పాడైంది. తొందర ఉండి నేను బయల్దేరాను. ఆ స్కూటరిస్టు నన్ను వెంబడించి చివరికి పట్టుకున్నాడు.
‘నా స్కూటర్‌కి డామేజి చేసి ఆపకుండా వెళ్తున్నారు’ అని గట్టిగా అరిచాడు.
చాలా చిన్న నష్టం. స్కూటర్ వెనకన వుండే ప్లాస్టిక్ లైటు కవరు పగిలిపోయింది.
‘గమనించలేదు. అది చిన్న డ్యామేజీ. సరే! దాని రిపేర్‌కి ఎంత అవుతుందో చెప్పండి ఇస్తాను’ అంటూ జేబులోంచి పర్స్ తీశాను.
కర్కశంగా వున్న అతని గొంతు తగ్గింది. ‘ఫర్వాలేదు సార్! చిన్నదే మీరు వెళ్లండి’ అన్నాడు.
బయల్దేరాను. గొంతు పెంచకపోవడం వల్ల, గొడవ పడకపోవడం వల్ల వాదన చెయ్యకపోవడం వల్ల ఈ రెండు సంఘటనలు ప్రశాంతంగా ముగిసాయి. కొత్త తరం ఈ విషయాలను గుర్తించి చిన్నచిన్న సంఘటనలని పెద్ద గొడవలుగా మార్చకుంటే ఎంత బాగుంటుంది. అణకువతో, నమ్రతతో వుంటే రోడ్డు మీద జరిగే సంఘటనలే కాదు చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అణకువ అనేది బలహీనత కాదు అది బలమని గుర్తించాలి.

-జింబో 94404 83001