S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీరే ‘అదృష్టవంతులని’ భావించి కృషి చేయండి!

‘నేను చాలా అదృష్టవంతుడిని’ అని భావించేవారినే అదృష్టం వరిస్తుంది. శుభప్రదమైన ఆలోచనలు అయస్కాంతం వంటివి. ఒక అయస్కాంతం ఇనుమును ఏ విధంగా ఆకర్షిస్తుందో శుభప్రదమైన ఆలోచనలు అదృష్టాన్ని ఆ విధంగా ఆకర్షిస్తాయి.
‘నేను చాలా దురదృష్టవంతుడిని. జీవితంలో ఏదీ కలిసి రావడం లేదు’ అని ఆలోచనలు చేసుకునేవారు ఎప్పుడూ పరాజితులుగానే ఉండిపోతారు. ఇటువంటి వారి ఆలోచనల ప్రభావంవల్ల అందుబాటులోకి వచ్చిన అవకాశాలను కూడా వీరు అందుకోలేరు.
ఒక కోటీశ్వరుడు వ్యాపారంలో దివాలా తీశాడు. తనంతటి దురదృష్టవంతుడు లేడని బాధపడి ఒక ఎతె్తైన భవంతి మీద నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక సామాన్యుడు కష్టపడి పనిచేసుకుంటూ తనంతటి అదృష్టవంతుడు లేడని అనునిత్యం తనకు పని దొరుకుతోందని సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఉన్నట్టుండి అదృష్టం అతని తలుపు తట్టింది. లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. వార్తాపత్రికలు అన్నింటిలోను అతని పేరు ప్రముఖంగా ప్రచురించబడింది.
అంటే ఏ మనిషి అదృష్ట, దురదృష్టాలయినా ఆ క్షణంలో అతడు ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ మనిషి మానసిక ధోరణులను బట్టి ఉంటాయి.
చాలామంది ఏ పోటీలోను పాల్గొనరు. ఎందుకంటే వారి దృష్టిలో ఆ పోటీ విజేతలు ఎప్పుడో నిర్ణయమై పోయారనే భావన. పాల్గొంటే కదా నెగ్గేది లేనిదీ తెలిసేది.
తయారుగా ఉండాలి
‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే మీరు అంత అదృష్టవంతులవుతారు’. దీనిని మరొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. అదృష్టం వరించేందుకు కావలసిన కృషి మీరు చేస్తే మేలైన అదృష్టం మీ సొంతం అవుతుంది.
ఏ రంగంలోనైనా తగినంత కృషి చేస్తే అదృష్టం గురించి మీరు ఎదురుచూడవచ్చు. మీకు తెలియకుండా అది మీ సొంతం అవుతుంది. జూదం ఆడేవారికి అందులోని ఆటుపోట్లు తెలియకుండా ఆ రంగంలో ప్రవేశించలేరు. అడ్డంకులు ఏమి ఉంటాయో చదివి తెలుసుకుంటే అదృష్టం దరిజేరదు. వాటిని అనుభవం ద్వారా నేర్చుకుని వివేకాన్ని జత చేసినపుడే ఆశించిన విజయాలు చేరువవుతాయి.
ఉదాహరణకు ఒక పోటీలో మీరు పాల్గొంటున్నారనుకోండి. ఆ పోటీకి సంబంధించిన నియమ నిబంధనలు జాగ్రత్తగా చదువుకోవాలి. వాటికి అనుగుణంగా పోటీలో పాల్గొనాలి. ఆపైన ఆ పోటీకి సంబంధించిన అంశంపై తగినంత సమాచారం అధ్యయనం చేయాలి. అప్పుడు మీరే విజేతలవుతారు.
చెడుగా కన్పించేది మంచిది కావచ్చు
ఏదైనా ఒక సంఘటన జరిగినపుడు అది మంచిదా? చెడుదా? అని నిర్ణయించి చెప్పడం కొంచెం కష్టమైన పని.
ఉదాహరణకు ఒక వైద్యుడిని విశ్రాంతి తీసుకోమని అతని మిత్రుడైన మరొక వైద్యుడు సలహా ఇచ్చాడు. ఆరునెలల విశ్రాంతి అంటే అతని బ్రహ్మాండమైన ప్రాక్టీసు దెబ్బతింటుంది. ఇంతకన్నా జీవితంలో దురదృష్టం మరొకటి లేదని, తన భర్తకు గుండె జబ్బు వచ్చిందని ఆ వైద్యుని భార్య విలవిల్లాడింది.
విచిత్రం ఏమిటంటే విశ్రాంతి తీసుకున్న వైద్యుడు ఆ ఆరు నెలల్లో రెండు గొప్ప నవలలు రాసి తన పేరును శాశ్వతంగా జనంలో ముద్రించుకున్నాడు. అందుచేత సంఘటనను అంత సులువుగా విశే్లషించడం కష్టం. ఆమెకు చెడుగా కన్పించినది ఎంతో మంచిదిగా తయారయ్యింది.
ఎట్టి పరిస్థితులలోను ఎదుటివారి సానుభూతిని అంగీకరించకూడదు. దీనివలన మీలోని ఆత్మవిశ్వాసం, మీ మీద మీకున్న నమ్మకం పోతాయి. దురదృష్టం మీ ప్రియ నేస్తంగా ఉందనే ధోరణి మీలో మొదలవుతుంది. భవిష్యత్ మీదేననే ధైర్యంతో ఉండాలి. ఆత్మన్యూనతా భావం కూడా ఎంత మాత్రం మంచిది కాదు.
వేధించే బాస్‌లు
పనిచేసే చోట మన ప్రతిభను అణచివేసే విధంగా కొంతమంది బాస్‌లు వేధిస్తూ ఉంటారు. అటువంటప్పుడు వారిని నలుగురిలోనూ పెట్టి అభాసుపాలు చేయడం మంచిది కాదు. మీ తెలివిని ఉపయోగించి అతని తాడుతో అతడే ఉరి వేసుకునేటట్లు చేయాలి.
న్యూయార్క్‌లో భారతి అనే ఒకమ్మాయి ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. బాస్ తరచూ ఆమెను అవమానపరుస్తూ ఆమెలోని నైపుణ్యాలను అణగద్రొక్కేందుకు ప్రయత్నిస్తూ ఉండేవాడు.
ఆమె కంపెనీ తాలూకు లాభనష్టాల షీట్‌లు తయారుచేస్తోంది. భారతి ఆఫీసు వదిలి వెళ్లిన తరువాత ఆమె తయారుచేస్తున్న వివరాలు చూసేవాడు. నిజానికి ఆ పని అతడు చేయాలి. ఈమెకు అప్పగించాడు. వౌనంగా అవమానాలు భరిస్తున్న భారతి ఒకరోజున అసలు షీట్‌లు తన వద్ద ఉంచుకుని తప్పుడు సమాచారంతో కూడిన షీట్‌లు టేబుల్ సొరుగులో పెట్టి వెళ్లిపోయింది.
బాస్ ఆ షీట్‌లు తీసుకుని పై అధికారుల వద్దకు వెళ్లాడు. అందులోని పొంతనలేని అంకెలు వివరించలేక పోయాడు. తాను రోజూ పరిశీలిస్తున్న షీట్‌లు కావని తెలుసుకున్నాడు. కంపెనీ ఖర్చుల మీద అవగాహన లేదని కంపెనీ యాజమాన్యం అతణ్ని ఉద్యోగం నుండి తొలగించింది. ఆ తరువాత మరొక కంపెనీలో చేరిన ఆ పాత బాస్ ప్రతి విషయంలోను భారతి సలహా కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు.
అందరూ ఇదే ఫార్ములా ప్రయోగించవలసిన అవసరం లేదు. ఎవరి యుక్తిని బట్టి వారు తెలివిగా వ్యూహ రచనలు చేసుకోవాలి.

-సి.వి.సర్వేశ్వరశర్మ