S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖాట్మండు లోయ

నేపాల్ రాజధాని ఖాట్మండు. ఇదొక లోయ. వ్యాపార రాజకీయ సాంస్కృతిక కేంద్రం కూడా. ఈ లోయ 24 కి.మీ. పొడవు, 19 కి.మీ. వెడల్పు చుట్టూ ఆకుపచ్చని వృక్షాలతో ఉన్న పర్వతం. అక్కడక్కడ ఎర్రటి పెంకులు కప్పబడినట్లు ఉంటుంది. సంప్రదాయానికి అద్దంపట్టే ఎన్నో దేవాలయాలు, బౌద్ధారామాలు ఉన్నాయి.
ఈ లోయలో చారిత్రాత్మకమైన మూడు పట్టణాలున్నాయి. ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తపూర్. ప్రతి పట్టణంలో బంగారు దేవాలయాలు, బుద్ధ విగ్రహాలు. ఎన్నో కళాత్మకంగా దర్శనమిస్తాయి. వీటి చుట్టూ పరచుకున్న ఆకుపచ్చని చెట్లు, తోటలు నూతన సౌరభాలు వెదజల్లుతాయి. ఈ లోయలో చిన్న పల్లె కూడా ఉంది. చిన్న గోపురాల నుండి వినవచ్చే ప్రార్థనా గీతాలు యాత్రికుల్ని మరో లోకంలోకి తీసుకువెళ్తాయి.
ఈ ఖాట్మండు పట్టణాన్ని ద్విచక్ర వాహనంపైగాని, నడిచిగాని చూడవచ్చు. ఇక్కడ మూడుచక్రాల తెల్లటి టెంపోలు మరింత చౌకగా ఉండి ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటాయి.

-బి.మాన్‌సింగ్ నాయక్